నేటి బిజినెస్-౦౨/౧౧

*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎస్‌బీఐ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరులో ఇది రూ.1886.57 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే మూడు నెలల కాలంలో లాభం రూ.2152.14 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
*ప్రముఖ వ్యాపార వేత్త పెప్సికో ఛైర్మన్, సీఈఓ ఇంద్రా నూయీని ‌అంతర్జాతీయ క్రికెట్ మండలి‌(ఐసీసీ) డైరెక్టర్‌గా నియమించారు. ఈ కౌన్సిల్‌లో తొలి స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ నూయీనే కావడం విశేషం.
*స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న నేటి యువతకు వాట్సాప్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
*వరుసగా రెండు రోజుల పతనం తర్వాత ఈరోజు బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.220 పెరిగి రూ.31,170కి చేరింది.
*డిజిటలీకరణలో భాగంగా ప్రజలకు ఆన్‌లైన్‌లో నేరుగా సమగ్ర ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇ-ప్రగతి ప్రాజెక్టుకు ఆధార ప్లాట్‌ఫారమ్‌గా ‘పెగా గవర్న్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌’ను ఎంపిక చేశారని పెగా సిస్టమ్స్‌ ఇండియా ఎండీ ఇ.సుమన్‌ రెడ్డి తెలిపారు.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ రూ.5,014.67 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,950 కోట్ల స్టాండలోన్‌ నికరలాభాన్ని హెచ్‌పీసీఎల్‌ (హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌) నమోదు చేసింది.
*ఇండియా యమహా తన కొత్త స్పోర్ట్స్‌ బైక్‌ వైజడ్‌ఎఫ్‌-ఆర్‌3ని శుక్రవారమిక్కడ జరిగిన వాహన ప్రదర్శనలో ఆవిష్కరించింది. దీని ధర రూ.3.48 లక్షలు(ఎక్స్‌షోరూం దిల్లీ). ఈ కొత్త బైకులో డ్యూయల్‌ చానెల్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌(ఏబీఎస్‌) సాంకేతికతను వాడారు.
*భారత్‌లోనే తొలి అడ్వెంచర్‌ యుటిలిటీ వాహనం ఇసుజు డిమాక్స్‌ వి-క్రాస్‌తో పాటు.. అయిదు సీట్లుండే పికప్‌ క్యాబ్‌ ‘డిమాక్స్‌ ఎస్‌-క్యాబ్‌’ను శుక్రవారమిక్కడ ఇసుజు మోటార్స్‌ ఆవిష్కరించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరి నెలల్లో ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు రూ.6.95 లక్షల కోట్లకు చేరాయి. 2016-17 ఇదే కాలం వసూళ్ల కంటే ఇవి 19.3 శాతం ఎక్కువ.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ద ఆంధ్రా పెట్రోకెమికల్స్‌ రూ.15.76 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ (గతంలో గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌) త్రైమాసిక లాభం మూడింతలైంది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 2017, డిసెంబరుతో ముగిసిన మూడు నెలలకు కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.3.33 కోట్ల నుంచి రూ.10.05 కోట్లకు చేరింది.
*రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లాభం భారీగా తగ్గింది. 2017, డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి స్టాడ్‌అలోన్‌ ప్రాతిపదికన రూ.86.6 లక్షల నికర లాభాన్ని ఆర్జించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఇండియా సిమెంట్స్‌ లాభం 57 శాతం తగ్గినట్లు సంస్థ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఏకీకృత నికర లాభం రూ.35.34 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.15.24 కోట్లకు పరిమితమైంది.
* నిరర్ధక ఆస్తులకు కేటాయింపులు పెంచడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సిండికేట్‌ బ్యాంక్‌ రూ.869.77 కోట్లు నష్టం ప్రకటించింది.
*ఏకీకృత ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి అవంతీ ఫీడ్స్‌ నికర లాభం ఆకర్షణీయంగా పెరిగింది.
*మొండి బకాయిలకు కేటాయింపులు రెట్టింపు కావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టం మరింతగా పెరిగింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారులకు మధ్యంతర డివిడెండును ప్రకటించింది.
*డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.1,215.91 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.112 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో టాటా స్టీల్‌ ఏకీకృత నికర లాభం ఐదు రెట్లు పెరిగి రూ.1,135.92 కోట్లకు చేరింది. కిందటేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.231.90 కోట్లుగా నమోదైంది.
*అమెరికా మార్కెట్లు మరోసారి మనపై నష్టాల వర్షాన్ని కురిపించాయి. అక్కడి మార్కెట్ల క్షీణత ప్రభావం మన సూచీలపై తీవ్రంగానే కనిపించింది.
*ఫోర్టిస్‌ హెల్త్ కేర్‌లో సింగ్‌ సోదరుల వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. వాళ్ల రాజీనామాతో కేసుల గోల నుంచి బయటపడినట్లేనని భావించిన కంపెనీకి.. మరో చిక్కువచ్చి పడింది. సింగ్‌ సోదరులకు ఏడాదిక్రితం ఇచ్చిన రూ.500 కోట్ల రుణమే ఇందుకు కారణం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com