నేటి రాజకీయం-౦౧/౧౯

*ద్రావిడ గుర్తింపున్న రాష్ట్రాలు ఐక్యత చాటాలి
ద్రావిడ గుర్తింపున్న దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ఉండాలని, అప్పుడే కేంద్రంలో మన మాట చెల్లుబాటవుతుందని విశ్వనటుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. ఇప్పటికే రాజకీయ ప్రవేశం చేసిన ఆయన.. వచ్చే నెల 21న రామనాథపురం జిల్లాలోని అబ్దుల్‌ కలాం నివాసం నుంచి తన రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.
*మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం
తెలంగాణ తెదేపా నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.
*మాయా దెబ్బ
గుజరాత్ లో గెలిచినా భాజపా ఓడిన కాంగ్రెస్ రెండూ తమ పార్టీ పరిస్తితులను అంచనా వేసుకున్తున్నాయి.నిన్నటి వరకు తమలో ఉన్న వర్గాలు ప్రభుత్వ నిర్ణయాలతో దూరంగా జరిగాయని భాజపా భావిస్తుండగా కాంగ్రెస్ పార్టీ తమ ఓటమిని మాయ దెబ్బ శాసించింది అనుకుంటున్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వలేదు మాయావతి. బహుజనులు పార్టీ బీఎస్పీ ఆ పార్టీ అబ్యార్ధులు పలు నియోజకవర్గాల్లూ పోటీ చేసారు. ఇప్పుడు ఫలితాలు విశ్లేసిస్తే దాదాపుగా పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమికి బీఎస్పీ అబ్యార్ది కారణమని తేలింది. ఆ పన్నెండు నియోజకవర్గాలలో భాజపా అభ్యర్ధులు గెలిచింది వెయ్యి ఓట్లకు లోపు. మెజారిటి తోనే కాగా బీఎస్పీ అభ్యర్ధులు రెండు వేల ఓట్లు వరకు సాధించారు. బీఎస్పీ పోటీల్లో లేకుంటే ఆ ఓట్లన్నీ తమకే దక్కి ఆ పన్నెండు సీట్లతో తాము గుజరాత్ లో అధికారంలోకి వచ్చి ఉండేవారం అని కాంగ్రెస్ భావిస్తోంది.
*కుంభమేళా ఖర్చు మాటేంటి
ముస్లిం బాలికలకు ఉపకారవేతనాల కోసం రూ.2వేల కోట్లు ఇస్తామన్న హామీని మోదీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ అన్నారు. హజ్‌యాత్రకు రాయితీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై ఆయన మాట్లాడుతూ కుంభమేళా వంటి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్న నిధుల మాటేమిటని ప్రశ్నించారు.
*ప్రాంతీయ కట్టడి
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలావాలంటే ఉత్తర భారతదేశంలో తగగ్ సీట్లును ఇతర రాష్ట్రాల నుండి సంపాదిన్చుకోవలన్నది భాజపా ఆలోచన అందుకోసం భాజపా ద్రుష్టి సారించే రాష్ట్రాలన్నిటిలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆ ప్రాంతీయ పార్టీల నేతలు శక్తివంతులు వారు ఇతర రాష్ట్రాలలోకి ప్రచారంలోకి డిజిట్ భాజపాకి ఇబ్బందులు తప్పవు. అందుకని ఆ ప్రాంతీయ పార్టీల నేతలను వారివారి రాష్ట్రాలకే పరిమితం చెయ్యాలన్నది అమిత్ షా ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో దాదాపుగా విజయం సాధించాడు బెంగాల్ లో మమతా బెనర్జీ ఇప్పుడు బెంగాల్ దాటిరలేని పరిస్థితి.త్రిపురలో ప్రచారానికి వెళితే భంగపడటం ఎమోనన్న భయం మమతా బెనర్జీలో తెప్పించాడు అమిత్ షా. ఇక నవీన్ పట్నాయక్ పరిస్థితి మరీ ఇబ్బంది. ఆయనకు ఓడిశా భాషే సరిగా రాదు. ఇక పొరుగు రాష్ట్రాలకు వెళ్ళలేదు. అక్కడ భాజపా చేసే ప్రచారం ఆయన్ని ఇబ్బందిలో పదేస్తున్నది. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబును అలాగే నిర్భందం చేయాలన్నది ఎత్తుగడ. తమిళనాడులో రజనీకాంత్ ని చూసి ఇతర ప్రాంతీయ పార్టీలను నిలువరించే పనిలో ఉన్నాడు అమిత్ షా.
*ఆర్ధికంగా అటూ ఇటూ
భారత ఆర్ధిక వ్యవస్థ ఊగిసలాటలో ఉంది. భారత్ అభివృద్ధి సూచిక గత నాలుగేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయినా ప్రపంచంలోనే పలు ఇతర దేశాలకన్నా మెరుగ్గా ఉండటం ఒక విశేషం. అయితే ఇది తాత్కాలిక వేనుకడుగే కాని మున్ముందు పెరుగుతుందనే, ప్రపంచంలోని ఆర్ధిక వ్యవస్థలో మూడో స్థానానికి చేరుతుందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీనికి సాక్ష్యంగా కొన్ని రంగాలలో అతివేగంగా పెరుగుతున్న పెట్టుబడులు చూపుతున్నారు. మరో వైపు భారత్ ఆర్ధిక పరిస్థితి ఆందోళన ప్రకటిస్తున్నాయి. అంతర్జాతీయ పత్రికలూ కొన్ని. ఆశించిన మేరకు ఆర్ధిక వ్రుద్దిలేక పరిశ్రమలు కుదేలు అవుతున్నాయి. ఉద్యోగాలు వూడుతున్నాయి. మెక్ ఇన్ ఇండియా ఏమైందో తెలియటం లేదు అన్నది ఆ పత్రికల వివరణ. ఇటువంటి ఊగిసలాటలో ఉన్న ఆర్ధిక రంగానికి కొత్త పుస్తిని తీసుకు రాగలిగిన సత్తా నరేంద్రమోడి ప్రదర్శించాల్సి ఉంటుంది.
*కేసీఆర్‌ వ్యాఖ్యలు బాధించాయి
అభివృద్ధిలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌కు పోలికేలేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. వ్యాఖ్యలు బాధాకరమన్న ఆయన తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారన్న వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 1995కు ముందు.. తరువాత హైదరాబాద్‌ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. విభజనలో యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అట్టడుగున ఉన్నామని.. తలకు ఇంకా రూ.35వేల ఆదాయం పెరిగితేనే పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయికి చేరుకోగలమని పేర్కొన్నారు.
*ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కోరింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇదో పెద్ద ఎదురుదెబ్బ. ఆ మంది ఎమ్మెల్యేలు లాభదాయకమైన పదవుల్లో ఉన్నారంటో ఎన్నికల సంఘం ఆరోపించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ తన రిటైర్మెంట్‌కు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు.
*వరంగల్‌ కలెక్టరేట్‌లో అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ కాకతీయ పనులపై అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. మిషన్ కాకతీయ పనులు వేగవంతం చేయాలని నాలుగోదశ కాకతీయ పనులను పూర్తి చేసి ప్రథమస్థానంలో నిలిచేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. మిషన్‌కాకతీయ పనులపై జిల్లా కలెక్టర్లు వారానికోసారి సమీక్ష జరపాలని సూచించారు.
*కెస్లాపూర్‌లో ప్రారంభమైన దర్బార్
గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతరలో ప్రతి సంవత్సరం నిర్వహించే దర్బార్ ప్రారంభమైంది. దీనికి బీసీ సంక్షేమ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ నగేశ్, ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు, కోవ లక్ష్మి , ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టర్లు డి.దివ్య, ఆర్వీ కర్ణన్, ప్రశాంత్ జీవన్ పాటిల్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. మంత్రులు, అధికారులు, గిరిజన పెద్దలు దర్బార్‌లో మాట్లాడారు. భారీ సంఖ్యలో గిరిజనులు దర్బార్‌కు వచ్చి తమ సమస్యలపై విజ్ఞప్తులను ప్రత్యేక కౌంటర్లులో అందజేశారు.
*సీనియర్‌ సినీ నటుడు ఎం. మోహన్‌బాబు.. రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్‌ అని వ్యాఖ్యానించారు. ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌ 2018లో రెండో రోజు శుక్రవారం ‘ఫాదర్‌ టు డాటర్‌: ది డీఎన్‌ఏ ఆఫ్‌ యాక్టింగ్‌’ పేరుతో జరిగిన సెషన్‌లో తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమాలు, రాజకీయాలు వేర్వేరని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com