నేటి రాజకీయం-౦౧/౨౦

* ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే
భూమిపై స్థలం లేకుంటే సముద్రంలో కూడా మద్యం దుకాణం పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానం ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖలో తహసీల్దార్, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీపై ఏసీబీ సోదాలు జరిపించానని, వందల కోట్ల అవినీతి సొమ్మును జప్తు చేయించానని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు పగటి పూటే 10 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో 10లక్షల ఐటీ ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అవినీతి, రౌడీయిజం వల్లే రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగాయని వ్యాఖ్యానించారు.
*కర్ణాటక ఎన్నికలకు రాహుల్‌ సారథ్యం
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సారథ్యం వహించనున్నట్లు ఆ రాష్ట్ర పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేష్‌ గుండురావు వెల్లడించారు.
*పోలవరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల జీవనాడి అని.. ప్రాజెక్టు సాధన కోసం కాంగ్రెస్‌ శ్రేణులు విస్తృతంగా పోరాటం చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచించారు. జనవరి 7 నుంచి 10 వరకు ఏపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలవరం మహాపాదయాత్ర, సత్యాగ్రహం విజయవంతమైన సందర్భంగా రాహుల్‌గాంధీ ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని అభినందిస్తూ ఒక లేఖ రాశారు. శుక్రవారం విజయవాడలో పీసీసీ కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
*ప్రముఖ తమిళ నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లు పేరొందిన రాజకీయ నాయకులు కాలేరని కాంగ్రెస్‌ బహిష్కృత నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీని చాయ్‌వాలా అని సంబోధించలేదని స్పష్టం చేశారు.
*జనసేనపై కుట్ర చేస్తున్నారు
జనసేన పార్టీ నాలుగేళ్లు కూడా నిండని పసిబిడ్డ అనీ, ఎదగనీయకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదంతా రాజకీయంలో ఓ భాగమే అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
*చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి
హైదరాబాద్‌ అభివృద్ధి చంద్రబాబు హయాంలోనే సాధ్యమైందని వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడు, మంత్రి కేటీఆర్‌ సైతం చంద్రబాబే హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేశారని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కలెక్టర్ల సదస్సు అనంతరం సీఎం నివాసం వద్ద సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షానికి వచ్చే ఎన్నికల్లో చాలాచోట్ల అభ్యర్ధులు కూడా దొరకరని జోస్యం చెప్పారు.
*జగన్‌ అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. పాదయాత్ర నుంచి శుక్రవారం జగన్‌ హాజరుకాగా సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. రాంకీకి సంబంధించిన వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ఈ వ్యవహారంలో నిందితుడి పాత్ర లేదని, అనవసరంగా ఇరికించారని కేసును కొట్టివేయాలని న్యాయవాది అభ్యర్థించారు.
*మరో అవినీతి మంత్రి
ఇతర రాష్ట్రాలలో అవినీతి అధికారుల అధికంగా పట్టుబడుతుంటే కేరళలో మంత్రుల అవినీతి బయటపడుతోంది. కేరళలో అధికారంలో ఉన్నది. నిత్రంతరం పేదల కోసమే అని చెప్పుకునే వామపక్ష ప్రభుత్వం. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి ఆరోపణలతో దొరికిన నాల్గవ మంత్రి ఒక మహిళా మంత్రి. ఆ రాష్ట్త్ర ఆరోగ్య సామాజిక న్యాయ శాఖలు నిర్వహించే కేకే.శైలజ తన భర్త అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే ఆ ఖర్చు బిల్లులన్నీ ప్రభుత్వం నుండి తీసుకుంది. అదేమీ తప్పు అని ఆమె వాదిస్తోంది. అయితే ఆమె భర్త హెడ్మాస్టర్ గా చేసి పించను అందుకుంటున్నాడు. ఆయనకు పించనుదారుడిగా ప్రభుత్వం నుండి ఆరోగ్య సౌకర్యాలు అందుతున్నాయి. వాటితో పాటుగా ఈ దొంగాబిల్లుల డబ్బులు పొందటమే ఆ మంత్రిగారి కక్కుర్తి. ఆమె వేల రూపాయలు పెట్టి ఒక కళ్ళజోడు కొనుక్కుని ఆ బిల్లును ప్రభుత్వమే చెప్ప్లించేలా చేసింది. ఇవన్నీ కేరళ ప్రభుత్వం విజిలెన్స్ విభాగపు దర్యాప్తులో బయటపడ్డాయి.
*కరెంట్ షాక్ లు
ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోయినా విద్యుత్ గోల ఇప్పుడు లేదు. ఈ మూడున్నర ఏళ్లలో ఎవరి విద్యుత్ గోలలో వారున్నారు. ఒకరు రైతులకు ఇరవై నలుగు గంటలు విద్యుత్ అన్ని ప్రచారం చేసుకుంటున్నారు. మరొకరు విద్యుత్ ధరలు పెంచటం కోసం చూసారా అని గొప్పలు చెప్పుకుంటున్నారు. హటాత్తుగా రెండు రాష్ట్రాలకు విద్యుత్ ఎక్కడి నుండి వస్తోంది. ఏమన్నా సొంతంగా ఉత్పత్తి పెంచుకున్తున్నారా. ఒకవేళ ఉత్పత్తి పెంచుకుని ఉంటె విద్యుత్ చార్జీలు తగ్గించాలి కదా. రెండు రాష్ట్రాలకు యూనిట్ ధర తగ్గలేదు. అసలు ఘనత కేంద్రంలోని మోడీ ప్రభుత్వానిది ఆయన మంత్రి పియూష్ గోయల్ డి. విద్యుత్ సరఫరని మెరుగు పరచి ఒక ప్రాంతం లోపు అదనపు విద్యుత్ ని మరో ప్రాంతంలోకి అందించగలిగిన వ్యవస్థను రోపొందించాడు పియూష్ గోయల్. అయితే ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరకు కొంటున్న సమయంలో కూడా ప్రజలకు మాత్రం యూనిట్ దహర తగ్గించకుండా లాభం పొందుతున్న పరిస్థితి రాష్ట్రాలలో ఉంది.
*తలాక్ రాజకేయం
తలాక్ లిచ్చి భార్యను వదిలించుకునే ముస్లీం మగాళ్ళ మీద సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. కొత్త చట్టం తెమ్మని కేంద్రాన్ని ఆదేశించింది. దానికి అనుగుణంగా కొత్త చట్టాన్ని తెచ్చింది. మోడీ ప్రభుత్వం ఆ బిల్లును ముస్లీం మహిళలకు మేలు చేకూరుతుంది. వివాహ భద్రతా వస్తుంది. ఆ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టినపుదు ఎటువంటి అభ్యంతరం చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లు రాజ్యసభకు రాగానే అడ్డుపడింది. ఆ బిల్లును ఎలెక్ట్ కమిటీకి పంపాలని పట్టుపట్టింది. అయితే అసలు కారణం తలాక్ చట్టాన్ని రాజకీయం చేయ్యలన్నేదే. అందువల్ల రాజ్యసభలో తలాక్ బిల్లును అడ్డుకుని ముస్లీం పురుషుల ఓట్లు ఆకట్టుకోవడం కదా అనియా కాంగ్రెస్ థింక్ టాక్ అనుకున్నాడట. అందుకే లోక్ సభలో నో చెప్పని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలోకి వచ్చేసరికి బిగ్గరగా నో అంటూ అడ్డుపడుతోంది.
*కర్ణాటక ఎన్నికలకు రాహుల్‌ సారథ్యం
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సారథ్యం వహించనున్నట్లు ఆ రాష్ట్ర పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేష్‌ గుండురావు వెల్లడించారు. ఫిబ్రవరి 10 నుంచి రాహుల్‌గాంధీ మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తారని, అదేనెల చివరిలో రెండో విడత, మార్చిలో మూడో విడత పర్యటనలు ఉంటాయన్నారు.
* పీకలదాకా మద్యం సేవించిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. మాదాపూర్ హోలీ బార్ వద్ద అవినాష్వరుణ్ అనే టెకీలు శుక్రవారం అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదుచేశారు. అనంతరం శనివారం వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com