నేటి రాజకీయం-౦౨/౦౨

* టీడీపీ నుంచి రొంగలి బహిష్కరణ
తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎంపీపీ, సీనియర్‌ నాయకుడు రొంగలి శ్రీరామ్మూర్తిని బహిష్కరిస్తున్నట్లు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధ నాగజగదీశ్వరరావు తెలిపారు. ఈమేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇటీవల రొంగలి శ్రీరామ్మూర్తి తెలుగుదేశం పార్టీని, పార్టీ ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా అభ్యంతర పదజాలంతో కించపరుస్తున్నారని, దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించి రొంగలి శ్రీరామ్మూర్తికి షోకాజు నోటీసు జారీ చేసినట్టు పేర్కొన్నారు.
* శాస్త్రవేత్తల మాట రాజకీయనేతలు వినాలి- నోబెల్‌ గ్రహీత, రిచర్డ్‌ జే రాబర్ట్స్‌
సైన్స్‌ ప్రాధాన్యం గురించి రాజకీయ నేతలకు అర్థమయ్యేలా చెప్పడమే నా జీవితాశయం. శాస్త్రవేత్తల సూచనలను తప్పకుండా వారు ఆలకించాలి. సైన్స్ ను వ్యతిరేకించే ప్రజల మాటలను పట్టించుకోరాదు. విదేశాల్లో శిక్షణ పొందిన వర్ధమాన దేశాల పరిశోధకులు తమ సొంత దేశానికి సేవ చేసే అవకాశం తప్పకుండా వస్తుంది.
* కాంగ్రెస్‌ కూటమిలో చేరేది లేదు- శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌రౌత్‌
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమిలో చేరే ప్రశ్నే లేదు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని పార్టీ జాతీయ కార్యవర్గభేటీలో నిర్ణయించాం. ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోబోం.
*టీడీపీ విమర్శలకు భయపడను
కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన పని లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు ఇప్పటికీ కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. నిపుణుల అభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉన్నా కేంద్రం మాత్రం సానుకూలంగా పరిశీలిస్తోందని పార్టీ రాష్ట్ర నేతలకు తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులతో అమిత్‌షా ఢిల్లీలో గురువారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అసెంబ్లీ సీట్ల పెంపు విషయం ఏం చేద్దామని అమిత్‌ షా ప్రశ్నించగా… ‘మీరే తుది నిర్ణయం తీసుకోవాలి’ అని నేతలు బదులిచ్చారు. కొద్ది రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని, బడ్జెట్‌ తర్వాత ఆ పార్టీ చేస్తున్న విమర్శల్ని బీజేపీ నేతలు పార్టీ చీఫ్‌కు వివరించారు.
*సిలికాన్‌ ఆంధ్రా వర్సిటీ వార్షికోత్సవ సభలో మంత్రి లోకేశ్‌
తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు మరచిపోతే భవిష్యత్తు ఉండదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా గురువారం ఆయన కాలిఫోర్నియాలో సిలికాన్‌ ఆంధ్రా విశ్వవిద్యాలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొని ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాకు వచ్చిన వారే ఎక్కువగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు పెట్టుకునేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు.
*సోనియాగాంధీ సారథ్యంలో ప్రతిపక్షాల సమావేశం
పార్లమెంట్‌ గ్రంధాలయ భవనంలో గురువారం నాడిక్కడ జరిగిన ప్రతిపక్ష పార్టీ నాయకుల సమావేశానికి యూపీఏ సారథి సోనియాగాంధీ సారథ్యం వహించారు. బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహం, భాజపాపై దాడికి ఒక్కతాటిపైకి రావడానికి చేపట్టాల్సిన చర్యలను చర్చించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.
*‘ఆయుష్మాన్‌ భారత్‌’ను మోదీకేర్‌ అంటున్నారు
పేదప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ బడ్జెట్‌ ఎంతగానో ఉపకరిస్తుందని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. సమాజంలోని అన్నివర్గాలు అభివృద్ధి చెందాయని బడ్జెట్‌ చాటిచెప్పిందన్నారు.
*హామీలేమాయె- ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా
రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని చట్టబద్ధమైన ప్రధాన హామీలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. రాజధానికి నిధులు, రెవెన్యూలోటు భర్తీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల గురించి ఊసు లేదు. కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం పోర్టు ఏమయ్యాయి? విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, విశాఖ రైల్వేజోన్లపై ప్రకటన ఉంటుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు మరోసారి నిరాశ ఎదురైంది. రాష్ట్రానికి భాజపా, తెదేపాలు ఉమ్మడిగా ద్రోహం చేశాయి.
*పార్టీని బలోపేతం చేయాలి
సంస్థాగతంగా బలోపేతానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీ నేతలకు భాజపా అధ్యక్షుడు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. పొత్తులు ఉంటాయా? ఉండవా? అన్న అంశంతో సంబంధం లేకుండా 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకోడానికి చర్యలు తీసుకోవాలని ఉద్బోధించినట్టు తెలిసింది.
*పోల్ బాండ్ పాలిటిక్స్
రాజకీయ పార్టీలకు అందే నిధులు చాలా రహస్యంగా ఉంటాయన్నది అందరికి తెలిసినదే. అటువంటి గోప్యతతో భాగ్నంగా చేస్తామన్న మోడీ ప్రభుత్వం పోల్ బాండ్ పధకం తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా రాజకీయ పార్టీకి నిధులు ఇవ్వాలంటే ఎస్బీఐ లో డబ్బు కట్టి కట్టేవారి వివరాలు ఇచ్చి పోల్ బాండ్ తీసుకుని దానిని రాజకీయ పార్టీకి ఇస్తే వారు పదిహేను రోజుల్లో తమ అకౌంట్ లో వేసుకోవాలి. ఎవరు నిధులు ఇస్తున్నారో బ్యాంక్ వారికి తప్పించి మరెవరికి తెలియదు. ఇంతకన్నా పారదర్శకత ఏమికావాలి. అంటుంది ప్రభుత్వం. నిధులు ఇచ్చేవారి వివరాలు ఎస్బీఐకి తెల్సు. అంటే ప్రభుత్వానికి సులభంగా తెలుస్తుంది. అటువంటప్పుడు నిధులను ప్రతిపక్షాలకు ఇవ్వటానికి ఎ సంస్తా ముందుకు రాదు. తాము నిధులిచ్చినట్లు తెలిస్తే ప్రభుత్వం వారిని వేదిస్తుందన్న సందేహం ఆ సంస్థల్లో కల్గుతుంది కదా అన్నది కాంగ్రెస్ ఆరోపణ. ప్రతిపక్షాలకు నిదులందక కార్పోరేట్ నిధులన్నీ అధికార పార్టీకి మాత్రమె దక్కేలా చెయ్యటమే పోల్ బాండ్ పధకం అంటున్నది కాంగ్రెస్ మరి ఈ ఎన్నికల సంస్కరణ ఏమవుతుందో.
*పల్లకీల మోత
ఇంట్లో ఈగల మోత వీధిలో పల్లకిల మోత అనే తెలుగు సామెత నరేంద్రమోడికి ఇప్పుడు అక్షరాల సరిపోతుంది. నరేంద్రమోడి తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టి వంటి నిర్ణయాలన్నీ దేశాన్ని ఆర్ధ్కంగా దెబ్బతీశాయి. వృద్దిరేటు తగ్గిందని దేశంలోని ప్రజలు, ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి, తీవ్ర విమర్శలు సందిస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎక్కువ సమయం ఉంటే మరీ నష్టం అంటున్నారు. కానే విదేశాల్లోని నరేంద్రమోడి ప్రభ వెలిగిపోతుంది. ఇటీవల జరిగిన ప్రపంచ సర్వేలో ప్రపంచ నాయకుల్లో ట్రంప్, పుతిన్ లను వెనక్కి నెట్టి మూడవ స్థానంలో నిలబడ్డాడు. ఎంతో ముందుచూపు కలిగిన కొత్త ఆలోచనలు ఉన్న ఒక గొప్ప నాయకుడు ఈ సమయంలో అటు వంటి నాయకత్వం దొరకటం భారత్ అదృష్టం అంటున్నారు. విదేశీ నాయకులు ఆర్ధికంగా భారత్ ఎదగటం ఖాయమని 2018లోనే అది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అవుతుంది. ఆపైన మూడవ స్థానం అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇంతకీ ఏది నిజం.
* యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం..
ఉత్తర ప్రదేశ్‌లోని పోలీస్ శాఖ ప్రక్షాళన చేసే దిశగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 26 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. లక్నో నూతన ఏడీజీగా రాజీవ్ క్రిషన్ నియమితులయ్యారు.
* నేపాల్‌కు సుష్మా స్వరాజ్ అభినందనలు
నేపాల్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం నేపాల్ పర్యటనలో ఉన్న ఆమె… నేపాల్‌లో మూడంచెల ఎన్నికల నిర్వహణలో విజయవంతమైనందుకు అక్కడి ప్రజలను అభినందించారు.
* బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరానికి నిధులు, రైల్వేజోన్, రెవెన్యూ లోటుభర్తీ ప్రస్తావన లేదని మండిపడ్డారు. బీజేపీతో పాటు టీడీపీ, వైసీపీలు కూడా నైతిక బాధ్యత వహించాలని రఘువీరా డిమాండ్ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com