నేటి రాజకీయం-౦౨/౦౪

*ఈశాన్యం ప్రగతితోనే వృద్ధికి ఊపు
సంచలనాత్మక ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని పెట్టుబడులకు ప్రాధాన్య గమ్యంగా మార్చామనీ, ఈశాన్య రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి సాధించినప్పుడే వృద్ధి ప్రస్థానానికి మరింత ఊపు వస్తుందనీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. తొలిసారిగా అసోం ఆతిథ్యంతో రెండ్రోజుల పాటు జరిగే ‘ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు’ను ఆయన శనివారం నాడిక్కడ ప్రారంభించారు.
*గురుతర మార్గదర్శకులు మీరే
పరీక్షల్లో ఒత్తిడిని అధిగమిస్తూ.. విద్యార్థులు తమ ఉజ్వల భవితకు ఎలా బాటలు వేసుకోవాలో వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ (పరీక్ష యోధులు) పుస్తకం శనివారం విడుదలైంది.
*ముదిరిన ట్రంప్‌-ఎఫ్‌బీఐ జగడం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐల మధ్య జగడం మరింత ముదురుతోంది. న్యాయ విభాగంతో కుమ్మక్కై ఎఫ్‌బీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ట్రంప్‌ వ్యాఖ్యలుచేసిన అనంతరం ప్రతిదాడి మొదలైంది. దర్యాప్తు సంస్థల ప్రతినిధులతోపాటు డెమోక్రాట్లూ ట్రంప్‌ వర్గంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
*యువత చేతుల్లోనే ‘తెలుగు’ భవిష్యత్తు
తెలుగు భాషను ప్రభుత్వాలు కాపాడలేవని బతికించుకొనే బాధ్యత యువతపైనే ఉందని భాషావేత్తలు, తెలుగు ప్రముఖులు సూచించారు. ఇంటి నుంచే మాతృభాషాభివృద్ధికి కృషి జరగాలన్నారు. చెన్నై నగరంలో ప్రపంచ తెలుగు సమాఖ్య 11వ ద్వైవార్షిక మహాసభలు, రజతోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
*పలు చోట్ల భారీగా ఆస్తుల కొనుగోలు చేసిన దావూద్‌
మాఫియా డాన్‌, ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం (62) తన అక్రమ సంపాదనతో బ్రిటన్‌లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడు. దేశంలోని మిడ్‌లాండ్‌, ఆగ్నేయ ప్రాంతాల్లో ఈ ఆస్తులున్నాయి.
*సమస్యలపై సమీక్షించిన పవన్‌కల్యాణ్‌
ఇటీవల ‘ఛలొరె.. ఛలొరె.. ఛల్‌’ కార్యక్రమంలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పార్టీ ముఖ్యులతో కలిసి సమీక్షించారని ఆ పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్‌రెడ్డి తెలిపారు.
*ఒకేసారి ఎన్నికలు సాధ్యం కాదు
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు విదేశీ కార్పొరేట్‌ సంస్థల విరాళాలపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.
*తెలుగు ప్రజల గుండె రగిలిపోతోంది
కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది భజన మానకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలుగు ప్రజల గుండె రగిలిపోతోందన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో మంత్రి కె.ఎస్‌.జవహర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీ కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.
*బడ్జెట్‌ను అర్థం చేసుకోవడం లేదు
బడ్జెట్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమైన రాష్ట్ర నాయకులు విమర్శలు చేస్తున్నారని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు.
*సీఎంకు కుంభకర్ణ అవార్డు ఇవ్వాలి
ఏడాది కాలంగా సచివాలయానికి రాకుండా కొత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుంభకర్ణ అవార్డు ఇవ్వాలని ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సచివాలయంలోని తన కార్యాలయానికి రాక శనివారానికి సరిగ్గా సంవత్సరం అవుతుందన్నారు. ప్రజలను కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకొని సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి… తన కార్యాలయానికే రాకపోవడం ప్రజల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
*మిషన్‌ భగీరథతో ఒక్కో వ్యక్తిపై రూ.20వేలు భారం
మిషన్‌ భగీరథ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాబోతుందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో ప్రజలకు ఉపయోగం లేకపోగా.. ఒక్కో వ్యక్తిపై రూ.20 వేల భారం పడనుందన్నారు. న్యాయ విచారణ జరిపిస్తే ఈ ప్రభుత్వం అవినీతి బయటపడుతుందన్నారు. శనివారం జీవన్‌రెడ్డి అసెంబ్లీ మీడియాహాలులో మాట్లాడుతూ… భగీరథ నీళ్లు రాబోయే రోజుల్లో బట్టలు ఉతకడానికే పనికొస్తాయన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com