నేటి రాజకీయం-౦౨/౦౯

*టీఎంసీ నేతలవి మురికి ముఖాలు-పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేఎన్‌ త్రిపాఠి
తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలవి మురికి ముఖాలు. ఒకసారి వారు తమ ముఖాలను అద్దంలో చూసుకోవాలి. గవర్నర్‌ కార్యాలయంపై విమర్శలు చేయడం మానుకోవాలి. వారి ముఖాలకు అంటిన మురికిని శుభ్రంగా కడుక్కోవాలి.
*జమిలి ఎన్నికలు అప్రజాస్వామికం-సీపీఎం నేత ప్రకాశ్‌ కరత్‌
పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న ఆలోచన అప్రజాస్వామికం. అది అసాధ్యం కూడా. ఏకాలంలో ఎన్నికల నిర్వహణ ప్రాథమికంగా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థనే దెబ్బతీస్తుంది.
*రైతులకేం చేశారో చెప్పండి
అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ఎన్డీయే హామీ ఏమైందని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బడ్జెట్‌లో రైతులకు నిరాశే దక్కిందని ఆవేదన చెందారు. ఎరువుల సంస్థలకు ఇచ్చే రాయితీని రైతులకు నేరుగా ఇవ్వాలన్నారు.
*సీబీఐ రహస్య నివేదిక మీ ఇంటికి ఎలా చేరింది?
సీబీఐకి సంబంధించిన ఒక రహస్య నివేదిక.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఇంటికి ఎలా చేరిందని భాజపా సభ్యుడు భూపేంద్ర యాదవ్‌ గురువారం రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో రాజ్యసభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
*పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలి
తెలంగాణలో పార్టీ మారిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు శాసనసభాపతి మధుసూదనాచారిని కోరారు.
*రాజ్యసభలో వెంకయ్య తీవ్ర అసంతృప్తి
రాజ్యసభ జరుగుతున్న తీరుపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి లోనయ్యారు. ఆందోళన చేయవద్దని పదేపదే చెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో ఒకింత ఆగ్రహానికిఅసంతృప్తికి లోనైన ఆయన.. సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. సభా గౌరవం పెరిగేలా సభ్యులు వ్యవహరించాలని సభ్యులను కోరగా.. దీంతో టీడీపీ ఎంపీలు ఆందోళన విరమించుకున్నారు. ఎంపీల వారి సీట్లలో కూర్చున్న అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com