నేటి రాజకీయం-౦౨/౧౩

* మన హక్కులు కాపాడుకుందాం
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం భేటీ అయ్యారు. బేగంపేటలోని లోక్‌సత్తా కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, నిజనిర్ధరణ కమిటీ విధివిధానాలపై చర్చించారు.
* 116 రోజులపాటు నీరు-ప్రగతి
116 రోజులపాటు నీరు-ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ప్రాధాన్యత ప్రాజెక్టుల పనులపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేస్తామన్నారు.
*సిద్ధాంతాల ప్రాతిపదికన కమ్యూనిస్టుల ఎన్నికల పోరు- బీజేపీ సీనియర్‌ నేత శేషాద్రిచారి
ఎన్నికల్లో సిద్ధాంతాలను ప్రాతిపదికగా చేసుకుని పోరాడేది కమ్యూనిస్టులే. మిగిలిన ఏ పార్టీ ఆ పని చేయడం లేదు. బీజేపీలో ఉన్నా.. ఆరెస్సె్‌సలో ఉన్నా నేను చెప్పేది ఇదే.
*చీర కట్టును విస్మరించడం సిగ్గుచేటు-ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ
దేశంలో మహిళలు ముఖ్యంగా యువతులు చీర కట్టును విస్మరించడం విచారకరం. చీర కట్టుకోవడం రాదని చెప్పారంటే అంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉండదు. చీర కట్టుడు దేశ సంస్కృతిలో భాగం. దానిని కాపాడుకోవాలి.
*రోశయ్యకు జీవిత సాఫల్య పురస్కారం
సమయపాలన, క్రమశిక్షణ, సంస్కారం ఉన్నప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నాయకులకు ఇవి ఎంతో అవసరమని తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయని పేర్కొన్నారు. సుస్థిర ప్రభుత్వాలతోనే ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
*ఏపీకి రూ.588కోట్లు
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో భాగంగా రూ.9,940కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,378కోట్లు కేటాయించగా, ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు రూ.984కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. స్మార్ట్‌ సిటీస్‌ కార్యక్రమం కింది కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ 99 నగరాలను గుర్తించింది. ఈ నగరాల అభివృద్ధికి రూ.2.03లక్షల కోట్ల నిధులను కేటాయించడం ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగు పరచనున్నారు.
*దుబాయ్‌లో తొలి హిందూ ఆలయ శంకుస్థాపన
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో హిందువుల తొలి ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 55వేల చదరపు మీటర్ల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. బోచసాన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ(బీఏపీఎస్‌) ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణ ప్రాజెక్టు జరుగుతోంది. ఆలయ శంకుస్థాపన అనంతరం ఆయన దుబాయ్‌లోని ఒపెరా హౌస్‌లో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాయ్‌లోని ప్రవాస భారతీయులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
*హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఏటియంను ఓ గుర్తు తెలియని వ్యక్తి తగులబెట్టాడు. అనంతరం అదే ఏటీఎం దగ్గర ప్రపంచంలో మానవ సమస్యలపై సలహాలు సూచనలతో కూడిన పేజీల నోట్ విడిచి వెళ్లాడు. అంతేకాదు ఆ నోట్‌‌లోని విషయాలను మీడియా ప్రచురించకపోతే ఆత్మహత్యకు పాల్పడుతానని బెదిరింపు లేఖ కూడా రాసిపెట్టాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఏటీఎంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో అటుగా వెళ్తున్న జనాలు పోలీసులు సమాచారం అందించారు.
*జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు మండలంలోని కాసిందేవిపేటలో ఉండే కవ్వంపెల్లి సుమలత అవమానం భరించలేక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. సుమలత పక్కింటి వాళ్లు.. తన ఇంటిపై దాడి చేసి సుమలతను చెప్పుతో కొట్టారు. దీంతో మనస్థాపానికి గురైన సుమలత ఆత్మహత్య చేసుకున్నది.
*మాస్కోలో విమానం కుప్పకూలిపోయింది.మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న విమానం.. మాస్కోలోని డోమోడెడోవో విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొంతసేపటికే కూలి పోయింది. ఈ ఘటనలో విమానంలో మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.
*సుస్థిరాభివృద్ధి సదస్సుకు సీఎంకు ఆహ్వానం
దిల్లీలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకూ జరగనున్న ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు (డబ్ల్యూఎస్డీఎస్‌)లో పాల్గొని ప్రసంగించాల్సిందిగా కేంద్ర ఇంధన వనరుల సంస్థ (టీఈఆర్‌ఐ) నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది.
*ముంపు బెడద లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం అద్భుతం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గ్రామాలు ముంపునకు గురికాకుండా పనులు చేపట్టడం అద్భుతంగా ఉందని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com