నేటి రాజకీయం-౦౨/౧౫

*షీలాబిడే కమిటీ కాలపరిమితి పెంచండి
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య 9వ షెడ్యూల్‌ సంస్థల విభజన ఇంకా పూర్తికానందున షిలాబిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ కాల పరిమితిని మరో ఆరునెలలు పొడిగించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి మంగళవారం లేఖ రాశారు.
*తెరాస సర్కారు చేసిందేమీ లేదు
‘కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర బడ్జెట్‌ను విమర్శించే ముందు… రాష్ట్ర ప్రభుత్వం తన పనితీరును మెరుగుపర్చుకోవాలి. నాలుగేళ్లలో వ్యవసాయం, విద్య సహా అన్ని రంగాలనూ అస్తవ్యస్తం చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది’ అని భాజపా శాసనసభపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించారు.
*తిరుపతి వద్ద 150 ఎకరాల్లో
తిరుపతిలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్‌ పార్కు ఏర్పాటు చేయడానికి రిలయన్స్‌ సంస్థ ముందుకొచ్చింది. అందులో 10 లక్షల జియోఫోన్లు, టీవీలు, చిప్‌ డిజైన్లు, బ్యాటరీలు, సెట్‌టాప్‌ బాక్స్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఆకృతుల రూపకల్పన మొదలుకుని పూర్తిస్థాయిలో వస్తువుల తయారీ చేసేంతవరకూ అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించనుంది.
*కమ్యూనిస్టుల కోటపై కమలదళం గురి!
గత పాతికేళ్లుగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో ఈ దఫా విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. మళ్లీ తామే గెలుస్తామని సీపీఎం నేతలు భరోసా వ్యక్తం చేస్తుండగా అది అంత సులభం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయం సాధించి తీరాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ వేగంగా పావులుకదుపుతోంది. కమలదళం అగ్రనేతలు ఆ రాష్ట్రంపై కేంద్రీకరించి పని చేస్తున్నారు.
*ఆంధ్రప్రదేశ్‌కు ఎంత ఇచ్చారో చెప్పండి
రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసిందో వెల్లడించాలని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.
*జగన్‌ కోసం ఏపీకి అన్యాయం చేయొద్దు
వైకాపా అధినేత జగన్‌ను కాపాడుతూ రాజకీయంగా లబ్ధిచేకూర్చటం కోసం ఏపీ ప్రజలకు అన్యాయం చేయవద్దని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా తిరువూరు మండలం గానుగపాడు వచ్చిన ఆయన మంగళవారం మాట్లాడారు.
*మూడేళ్లు పోటీ చేయను
ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు గాను.. వచ్చే మూడేళ్లలో తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని కేంద్ర మంత్రి, భాజపా నేత ఉమాభారతి పేర్కొన్నారు. అలాగని తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. భో
**వైద్య విద్యార్థుల ఉపకార వేతనాలు పెంపు
వైద్య విద్యార్థుల ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 2016 సంవత్సరం నుంచే ఈ పెంపు వర్తిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. వైద్య విద్యార్థుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉందని.. ఆర్థికపరమైన విషయాల్లో తగిన అధ్యయనం అనంతరమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున జాప్యం అనివార్యమైందని పేర్కొన్నారు.
* రాజీనామాలు చేసేందుకేనా ప్రజలు గెలిపించింది?
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రతిపక్ష వైకాపా పార్టీ అధినేత జగన్ చేసిన వాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఘాటుగా స్పందించారు. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు ఓట్లేస్తే ముందే ఎందుకు రాజీనామా చేస్తామంటున్నారో సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com