నేటి రాజకీయం-౦౩/౧౦

*నా పుట్టుక..చావు టీఆర్ఎస్ లోనే.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపని మంత్రి హరీష్ రావు స్పష్టం చేసారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు.అధికారంలోకి రాదు కాబట్టే ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు హామీలు ఇస్తున్నారు. 2019 కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కటైనా అమలు చేసారా. అమలు చేయని కాంగ్రెస్ ప్రజలను ఎలా నమ్ముతారు అని ఆయన వ్యాఖ్యానించారు.
*వచ్చే ఎన్నికల్లో భాజపాను ఓడిస్తాం
భారత్‌లో దుష్ట రాజకీయాలు వేళ్లూనుకుంటున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్నికల విజయాల కోసం భాజపా ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని కాంగ్రెస్‌ ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సింగపూర్‌లోని ప్రతిష్ఠాత్మక లీ క్వాన్‌యూ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీలో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
*రాజీనామా చేసిన భాజపా మంత్రుల ఉద్ఘాటన
భాజపాకు చెందిన కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు గురువారం ఉదయం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం వీరిద్దరూ శాసనసభకు వచ్చి సభలో సహచర మంత్రులు, సభ్యులనుఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయాన్ని వివరిస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థతను ప్రస్తావించారు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామన్నారు.
*తెదేపాలో చేరిన మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌
ఆంధ్రప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచి రామారావు, పలువురు సంస్థ డైరెక్టర్లు గురువారం తెదేపాలో చేరారు. వీరు ఇప్పటివరకూ కాంగ్రెస్‌లో ఉన్నారు. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తిరువూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాసు ఆధ్వర్యంలో వీరు తెదేపాలో చేరారు.
*అమరావతిలో వైల్డర్‌నెస్‌ పార్కు
అమరావతిలో 20 ఎకరాల్లో వైల్డర్‌నెస్‌ పార్కును త్వరగా ఏర్పాటు చేయాలని ప్రగతి గ్రీన్‌ మిడోస్‌ అండ్‌ రిసార్ట్‌ సంస్థను ముఖ్యమంత్రి ఆదేశించారు. రిసార్టులు, పుష్పవనాలు, మూలికా వనాలతో ఈ పార్కు ఆహ్లాదభరితంగా ఉంటుందని, నడక, సైకిల్‌ ట్రాకులు, రెస్టారెంటు, కృతిమ అరణ్యం వంటివి దీనిలో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎన్టీఆర్‌ క్యాంటీన్ల భవనాలకు సంబంధించి ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతిపాదించిన ఆకృతులు అంత ఆకర్షణీయంగా లేవని సీఎం అన్నారు.
*రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా సుఖేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి సంస్థ మొట్టమొదటి ఛైర్మన్‌, సంచాలకుని(డైరెక్టర్‌)గా నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని రాష్ట్రప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గాక మరో నలుగురు ఉన్నతాధికారులతో పాలకమండలిని ఏర్పాటుచేసింది.
*హైదరాబాద్‌ కలెక్టర్‌ యోగితారాణాకు అవార్డు
రాజస్థాన్‌లోని ఝుంఝుమాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో హైదరాబాద్‌ జిల్లా పాలనాధికారికి అరుదైన సత్కారం లభించింది. దేశంలో బాలికల సంరక్షణ, బాలిక విద్యకు విశేష కృషి చేసిన 10 మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా అందులో కలెక్టర్‌ యోగితారాణాకు స్థానం లభించింది. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు.
*డ్రాగన్‌, ఏనుగు డ్యాన్స్‌ చేయాలి- చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి
డ్రాగన్‌, ఏనుగు కలిసి డ్యాన్స్‌ చేయాలి. భారత్‌, చైనా సంబంధాల్లో నిరుడు పరీక్షా కాలం ఎదురైంది. ఇరుదేశాలకు వ్యూహాత్మక దార్శనికత ఉంది. అందుకే డోక్లాం సమస్యను పరిష్కరించుకోగలిగాం. డ్రాగన్‌, ఏనుగు ఘర్షణ పడరాదు. ఇరుదేశాలూ ఆనందంతో చిందులేయాలి. భారత్‌, చైనా కలిస్తే 1+1=11 అవుతుంది.
*మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తే బహిరంగ ఉరే!- మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌
అన్ని రంగాల్లో అతివలదే పైచేయి. వారి ప్రమేయం లేకుండా ఏ రోజైనా పనులు జరుగుతాయా? మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని బహిరంగంగా ఉరి తీయాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com