నేటి రాజకీయం-౦౩/౩౧

* జగన్‌పై ఆదినారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
జగన్, విజయసాయిరెడ్డిపై మంత్రి ఆదినారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ ఏ-1, ఏ-2 కేటుగాళ్లు అంటూ ధ్వజమెత్తారు. జగన్‌ కడప జిల్లాలో రెడ్డిగా పుట్టి జిల్లా పరువు తీస్తున్నారని విమర్శించారు. జగన్ వీధిరౌడీలా వ్యవహరిస్తున్నారని, ఆయన రాజకీయాలకు పనికిరారని మంత్రి చెప్పుకొచ్చారు.
* 2019లో మళ్లీ చంద్రబాబే సీఎం
రాష్ట్రంలో రాజకీయంగా ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా 2019లో మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు ధీమా వ్యక్తం చేశారు. శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను శుక్రవారం ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
* మైసూరులో ‘రాచ’మార్గం
రాచనగరి మైసూరు పరిసరాల్లో పాగావేసేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భాజపా ఉనికే లేని ఈ ప్రాంతంలో అస్థిత్వ సాధనకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా శుక్రవారం కార్యాచరణ ప్రారంభించారు. మైసూరు యువరాజైన యదువీర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరశైవ, లింగాయత వివాదాల నేపథ్యంలో లింగాయతులకు చెందిన మైసూరులోని సుత్తూరు మఠాన్ని, సవర్ణ హిందువులకు చెందిన గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాల్ని అమిత్‌ షా సందర్శించి.. మఠాధిపతుల ఆశిస్సుల్ని పొందారు. మరోవైపు దళితులు, ఆదివాసీలతోనూ సమావేశమయ్యారు. అన్ని చోట్లా సానుకూల స్పందన లభించటంతో పాలకపక్షంలో ఆందోళన నెలకొంది.
* 2019లో మళ్లీ చంద్రబాబే సీఎం: మంత్రి శిద్దా
రాష్ట్రంలో రాజకీయంగా ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా 2019లో మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు ధీమా వ్యక్తం చేశారు. శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను శుక్రవారం ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
* కాంగ్రెస్‌పై రాహుల్‌ ముద్ర
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్రమంగా పార్టీలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఎన్నాళ్లనుంచో పార్టీ పదాధికారులుగా ఉన్న నిన్నటితరం నేతల స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. తాజాగా పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
* గజదొంగ ఎవరో అందరికీ తెలుసు: జగన్‌పై ప్రత్తిపాటి విమర్శ
పన్నెండు కేసుల్లో తొలి ముద్దాయి, ఏకంగా పదహారు నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఎవరో…గజదొంగ ఎవరో ప్రజలందరికీ తెలుసునని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
* కాంగ్రెస్‌పై రాహుల్‌ ముద్ర
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్రమంగా పార్టీలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఎన్నాళ్లనుంచో పార్టీ పదాధికారులుగా ఉన్న నిన్నటితరం నేతల స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. తాజాగా పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
* న్యాయవ్యవస్థలో ఆర్‌స్‌ఎస్‌ ప్రచారకులు
న్యాయవ్యవస్థలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్న వ్యక్తులను చొప్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని సీనియర్‌ కాంగ్రెస్‌నాయకుడు కపిల్‌సిబల్‌ ఆరోపించారు. ఇప్పటికే విద్యాసంస్థల్లో ‘ప్రచారక్‌’లను చొప్పించిన ప్రభుత్వం, న్యాయవ్యవస్థనూ వారితోనే నింపేయాలని చూస్తోందన్నారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా, హమీర్‌పుర్‌లో కేసులు
ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా, హమీర్‌పుర్‌లోని న్యాయస్థానాల్లో కేసులు నమోదయ్యాయి. ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్‌ సభల్లో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా ప్రతినిధి శలభ్‌మణి త్రిపాఠి చెప్పారు. దేవరియా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో కేసు దాఖలైందని, ఏప్రిల్‌ 5న తదుపరి విచారణ ఉంటుందన్నారు. హమీర్‌పుర్‌ సీజేఎం న్యాయస్థానంలో పరువునష్టం వ్యాజ్యం దాఖలు చేసినట్లు అడ్వొకేట్‌ అవధ్‌ నరేశ్‌సింగ్‌ చందేల్‌ చెప్పారు. ఐపీసీ నిబంధనలను అనుసరించి కేసు నమోదైందని, దర్యాప్తు జరుగుతోందన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com