నేటి రాజకీయం-౦౪/౧౪

*కలకత్తా వెళ్లి మమతా బెనర్జితో మంతనాలు జరిపి తానూ పెడరల్ ప్రంట్ ణి ప్రపోజ్ చేసిన తోలి నేతగా తెలంగాణా ముఖ్యమంత్రి కే.సి.ఆర్. ప్రచారం చేసుకునే యత్నం చేసాడు. అయితే కలకత్తాలో సీన్ ఆయన అనుకున్న రీతిలో లేదన్నది ఇప్పుడు తెలుస్తున్న విషయం. మమతాబెనర్జీ మోడీ విషయంలో బద్ద వ్యతిరేకి. నిన్నా మొన్నటి వరకు కేసీఆర్ , నరేంద్ర మోడీ అనుకూల విధానం హటాత్తుగా కేసీఆర్ , నరేంద్ర మోడీ వ్యతిరేకి అని రావటం మమతా బెనర్జికి నమ్మదగ్గదిగా అనిపించలేదు. ఇప్పటికే కేసీఆర్ తన కూతురు కవితకు కేంద్రంలో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నాడని,కేసీఆర్ సామాజిక వర్గపు గవర్నర్ మోడీకి కీసీఆర్ కి మధ్య మంతనాలు కొనసాగిస్తున్నా డన్నది మమతా బెనర్జీ సమాచారం. అందుకే ఆమె సంయుక్త పత్రికా సమావేశానికి ఉత్సాహం చూపలేదు. బలవంతం మీద వచ్చి నిలబడినా ఆమె ముఖంలో ఆ సమావేశం వలన ప్రయోజనం లేడన విషయం స్పష్టంగా కనిపించింది. తోలి యత్నమే ఇలా వికటించిందేమిటనేది కేసీఆర్ బాధ.
*ఎదురు చూస్తున్నాడు.
నరేంద్ర మోడీ మంత్రి అవ్ర్గంలో రామ్ విలాస్ పాశ్వాన్ అధికారం ఎటు ఉంటే అటు మొగ్గు చూపే నాయకుడిగా ఇప్పటికే పేరుగడించాడు. ఎవరితో అయినా జట్టు కట్టగల నేర్పు అతనిది. 2014లో మోడీ వెంట నడిచిన ఈ దళిత నేత 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేల రాజకీయ గాలి ఎటు మల్లుతుందోనని లెక్కలు కడుతున్నారు. అందుకోసం ఎన్డీఏలో ఉన్న దళిత ఎంపీల తోనే కాదు ఇతర పార్టీల ఎంపీలతో కూడా రహస్య మంతనాలు జరుపుతున్నాడు. మోడీ ప్రభుత్వం మీద దళిత వర్గాల్లో ఎటువంటి అభిప్రాయం ఉందనేదాని మీద సర్వేలు చేయిస్తున్నాడు. ఈ అంశాలలో ప్రతీకూల, అనుకూల అభిప్రాయాలు రెండూ రావటంతో రాం విలాస్ పాశ్వాన్ తన కొడుకును ఉత్తర భారత దేశ పర్యటనకు పంపుతున్నాడు. అలా అంతా తిరిగి ఏదో ఒక అభిప్రాయంతో కొడుకు వచ్చిన తర్వాత తన తదుపరి నిర్ణయం ప్రకటించాలనేది పాశ్వాన్ ఆలోచన. అందుకే కొత్త సమాచారం కోసం ఎదురు చూపులు.
*మోదీ, అమిత్‌షాకు భయం పట్టుకుంది
కేంద్రంలో ఎన్డీయే నుంచి తెదేపా బయటకు వచ్చేసరికి ప్రధాని నరేంద్ర మోదీకి నిరాహారదీక్ష చేసే పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్తు శాఖమంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి రాష్ట్రానికి చెందిన ఏ1, ఏ2 ముద్దాయిలతో జతకడుతున్నారని విమర్శించారు.
* ఆడపిల్లల జోలికి వెళ్తే తోలు తీయాలి
ఆడపిల్లల జోలికి వెళ్తే.. బహిరంగంగా వారి తోలు తీయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై మృగాల సామూహిక అత్యాచారం, హత్య తన హృదయాన్ని ద్రవింపజేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం పార్టీ కార్యాలయంలో జనసేన మహిళా విభాగం ప్రతినిధులు, విద్యార్థులు, యువతీయువకులతో పవన్‌ మాట్లాడారు.‘కథువా ఘటన మెదటిది కాదు. మన వ్యవస్థలో ఓ దుర్ఘటన జరిగితే కానీ చలనం రాదు. నిర్భయ చట్టం కూడా దిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే వచ్చింది. తమ కళ్ల ముందు జరిగితేనే ఎంపీలు స్పందిస్తారా? ఆడ పిల్లల్ని వేధించే ఈవ్‌ టీజర్లు, అత్యాచారానికి ఒడిగట్టే వాళ్లని బహిరంగంగా శిక్షించాలి. అప్పుడే అందరికీ భయం పుడుతుంది. సింగపూర్‌ తరహాలో శిక్షలు అమలు చేయాలి. సినిమాల ప్రభావంతో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెరిగాయి
* ఆయుష్మాన్‌ భారత్‌ను ప్రారంభించిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈసారి బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని నేడు ఆవిష్కరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఏర్పాటు చేసిన తొలి ఆరోగ్య కేంద్రాన్ని మోదీ ఆవిప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మోదీతోపాటు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద దేశవ్యాప్తంగా 2022 సంవత్సరం నాటికి 1.5లక్షల ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌తో పాటు వృద్ధాప్యం వల్ల వచ్చే పలు సమస్యలకు చికిత్స అందించేందుకు తగిన వసతులతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ పథకం ద్వారా బీమా సౌకర్యం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
*కర్ణాటకలో ఆలయాలు, మఠాల చుట్టూ రాహుల్‌, అమిత్‌షా చక్కర్లు
కుల, మతాల ప్రాతిపదికగా ఓట్లడగటం ఎన్నికల నియమావళికి విరుద్ధం. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న కాంగ్రెస్‌, భాజపాలు ఈ నియమావళిని తుంగలో తొక్కుతున్నాయి. కులం, మతం అస్త్రాలుగా ఓట్ల వేట సాగిస్తున్నాయి. అభివృద్ధి, ప్రజా సమస్యలు వీటికి రెండో ప్రాధాన్యాంశాలుగా మారిపోయాయి. కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేక పార్టీ అని ముద్రవేయడానికి భాజపా నేతలు ప్రయత్నిస్తుంటే.. తమది హిందూ అనుకూల పార్టీయే అని ఓటర్లను నమ్మించడం కోసం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వివిధ మఠాలు, ఆలయాలను సందర్శిస్తున్నారు. కుల పెద్దల ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు.
*వైకాపా ఎమ్మెల్యేలూ రాజీనామా బాట?
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా ఎమ్మెల్యేలం మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని వైకాపా తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఎంపీలు రాజీనామా చేసినందున వారికి సంఘీభావంగా ఎమ్మెల్యేలం కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని కొందరు నేతలు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ముందు ప్రతిపాదించినట్లు పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.
*అగ్రిగోల్డ్‌ పై వైకాపా ప్రచారం అవాస్తవం
అగ్రిగోల్డ్‌ విషయంలో వైకాపా అవాస్తవాలను ప్రచారం చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉందని తెలిసి కూడా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఆ పార్టీ యత్నిస్తుండడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ.35 వేల కోట్లంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లో కలిపి ఆ సంస్థ ఆస్తుల విలువ రూ.6వేల కోట్లు ఉంటుందని తెలిపారు.
*‘గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌’కు శ్రీకారం
గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీనవర్గాలే లక్ష్యంగా; దేశవ్యాప్తంగా దళితులను ఆకట్టుకోవడానికి కేంద్రప్రభుత్వం, భాజపా శనివారం నుంచి మే 5 వరకు విస్తృత ప్రచారం చేపట్టనున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి అయిన ఏప్రిల్‌ 14 నుంచి దళితుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది.
*రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ
పార్లమెంట్‌ సాక్షిగా, కేంద్ర కేబినెట్‌ సమావేశాల్లో తీర్మానాల రూపంలో రాష్ట్రానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ.. ఇప్పుడు తీరని అన్యాయం చేశారని శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
*చంద్రబాబు స్వతంత్ర రాజ్యానికి రాజా
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని దేశంగా ఊహించుకుంటున్నారా? ఏపీని స్వతంత్ర రాజ్యంగా భావించి దానికి ఆయన రాజనుకుంటున్నారా? అని భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. తాను ఒక్క పిలుపు ఇస్తే కేంద్ర ప్రభుత్వ వాహనాలేవీ రాష్ట్రం నుంచి కదలవని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎలా వ్యాఖ్యానిస్తారని ప్రశ్నించారు.
*శిల్పా చక్రపాణిరెడ్డికి భద్రతను పునరుద్ధరించండి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శిల్పా చక్రపాణిరెడ్డికి గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలంటూ ఏపీ ప్రభుత్వానికి శుక్రవారం ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శిల్పా చక్రపాణిరెడ్డికి ఉన్న భద్రతను తొలగిస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను జూన్‌ 14వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనకున్న గన్‌మెన్‌ సౌకర్యాన్ని తొలగిస్తూ అదనపు డీజీ (ఇంటిలిజెన్స్‌) జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ చక్రపాణిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైస్సార్‌సీపీలో చేరారన్న కక్షతో గన్‌మెన్‌లను ఉపసంహరించారన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com