నేటి రాజకీయం-౦౪/౧౫

*రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారు
వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవాడ చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రాన్ని విడగొట్టిన అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేబినెట్‌లో ఆమోదించి, ప్లానింగ్‌ కమిషన్‌కు పంపింది. 2 మార్చి 2014న ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు ఏడు నెలల పాటు ప్లానింగ్‌ కమిషన్‌ అమల్లో ఉంది. ఫైల్‌ ప్లానింగ్‌ కమిషన్‌ వద్దే ఉన్నా.. దాన్ని పట్టించుకోలేదు.
*జమిలి’ ఎన్నికలు నిర్వహించవచ్చా?
లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ‘జమిలి’ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే అంశంపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) అభిప్రాయాన్ని కేంద్రం కోరనుంది. ఈ విషయంపై న్యాయ కమిషన్‌ ఈ నెల చివర్లో నివేదిక సమర్పించిన అనంతరం.. ఈసీని కేంద్రం సంప్రదించనుంది. రెండు దఫాలుగా 2019, 2024ల్లో లోక్‌సభతోపాటు వివిధ రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించడం ద్వారా.. ఇందుకు వీలు కల్పించాలని న్యాయ కమిషన్‌ ప్రతిపాదించే అవకాశాలున్నాయి.
*మోదీని ప్రశంసించారన్న వార్తలపై కాంగ్రెస్‌ గుస్సా
ప్రధాని మోదీ మంచి పరిపాలకుడని, కార్యనిర్వాహకుడని వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎంపీ కె.వి.థామస్‌కు కేరళ కాంగ్రెస్‌ నోటీసులు జారీచేసింది. క్రూరమైన, దాడులతో కూడిన ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని మోదీ నడుపుతున్నారని కేపీసీసీ అధ్యక్షుడు ఎం.ఎం.హసన్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
*తెరాస ప్లీనరీలో 12 తీర్మానాలు
తెలంగాణ రాష్ట్రసమితి ప్లీనరీలో 12 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 27న హైదరాబాద్‌ కొంపల్లిలో జరిగే ప్లీనరీ కోసం తీర్మానాల కమిటీ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్లీనరీ తీర్మానాల కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు అధ్యక్షతన గల కమిటీ ఇప్పటికే సమావేశమై ముసాయిదాలపై చర్చించింది.
*‘ఎస్సీ, ఎస్టీ’ చట్టంలో అక్షరం మారినా ఊరుకోం
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం విషయంలో అక్షరం మారినా ఊరుకునేది లేదు.. కచ్చితంగా పోరాటం చేసితీరుతామని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. శనివారం నిజామాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించక పోవడంతో ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.
*మైనార్టీలే ఎక్కువ హక్కులు అనుభవిస్తున్నారు
మన దేశంలో మెజార్టీ వర్గాలు అనుభవించని హక్కులు సైతం మైనార్టీ వర్గాల వారు అనుభవిస్తున్నారని కేంద్ర మానవ వనరుల సహాయమంత్రి సత్యపాల్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. రెండు దశాబ్దాలుగా మన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న తీరును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
*జగన్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా అధ్యక్షుడు జగన్‌ మతిభ్రమించిన వ్యక్తిలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని రాష్ట్ర మంత్రి కె.ఎస్‌.జవహర్‌ ధ్వజమెత్తారు. ‘40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గర్వించాల్సిందిపోయి ఆయనను జైల్లో పెట్టాలనడం ఎంతవరకు సమంజసం? రైతులకు రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేసినందుకా? రాష్ట్రానికి 24 గంటలు విద్యుత్‌ అందించినందుకా? కియా మోటార్స్‌ వంటి పరిశ్రమల్ని తెచ్చినందుకా? ఎందుకు ఆయనను జైల్లో పెట్టాలి?…’ అని ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
*గ్రామ స్వరాజ్‌’కు భాజపా శ్రీకారం
గ్రామీణ ప్రాంత ప్రజలు.. ప్రధానంగా దళితులు, గిరిజనులకు చేరువయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం, భాజపాలు వివిధ సంక్షేమ పథకాలతో కూడిన ‘గ్రామస్వరాజ్‌ అభియాన్‌’కు శుక్రవారం శ్రీకారం చుట్టాయి. ఈమేరకు ప్రధాని మోదీ పార్టీ ఎంపీలు, మంత్రులకు మార్గనిర్దేశం చేశారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా చత్తీస్‌గఢ్‌లో ప్రధాని ఆయుష్మాన్‌ భారత్‌ సహా వివిధ పథకాలను ప్రారంభించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com