నేటి రాజకీయం-౦౪/౧౬

*నితీష్ కష్టాలు
బీహార్ సిఎం నితీష్ కుమార్ కి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఒకటి మొన్నటి లోక్ సభ శాసన సభ ఉప ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీ ఆర్జేడీ గెలిచింది. ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసులో శిక్ష పది జైలులో ఉంది కూడా తన పార్టీని గెలిపించుకున్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు యాదవుల ఓట్ల కోసం అత్యంత తెలివి తేటలు లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. దానితో బీసీ నేతగా నితీష్కున్న ఇమేజ్ కొంచెం చెం తగ్గుతోంది. ఈలోగా భాజపా మరింత చురుకుగా బీహారు రాజకీయాల్లో వ్యవహరిస్తోంది. అగ్రవర్ణాల ఓట్లు భాజపా వ ఐపు వెళ్ళిపోతున్నాయి. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో తన పరిస్తితి ఏమిటనేది నితీష్ భయం మహాకూతమీ అనే ఆలోచన చేసింది. దానికి ఒక రూపం ఇచ్చింది నితీష్. నరేంద్ర మోడీణి డీ కొనే ప్రతిపక్ష నేతగా గుర్తింపు తెచ్చుకుంది నితీష్ ఇప్పుడు అవన్నీ పోయి భారతీయ జనతా పార్టీకి తోక పార్టీగా భాజపా పెత్తనం చేస్తుంటే ఏమీ చెయ్యలేని నిశ్శయుడిలా మిగిలిపోయాడు నితీష్ కుమార్.
* ఏ చరిత్ర గెలుస్తుందో..
కర్ణాటక ఎన్నికల వేల అక్కడి ప్రధాన రాజకీయ పక్సహలైన భాజపా కాంగ్రెస్ లు రెండూ తమ గెలుపుకు అక్కడ ఎన్నికల చరిత్రను నమ్ముకున్తున్నాయి. 1980 తర్వాత కర్ణాటకలో ఏ పార్టీలు కూడా వరసగా రెండు సార్లు ఎన్నికలు గెలవలేదు. పాలక పక్షాన్ని కాదని ప్రతి పక్షానికి అధికారం ఇస్తారు. 2013లో భాజపాని ఓడించిన కాంగ్రెస్ ణి గెలిపించారు. 2018 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి చరిత్ర ప్రకారం గెలుపు తమదే అనుకుంటున్నారు. భాజపా వారు. అయితే ఈ విషయానికి భిన్నంగా కాంగ్రెస్ వారు మరో చరిత్ర చెపుతున్నారు. కర్ణాటక ఓటర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించి పార్టీని గెలిపిస్తుంటారు.
*ఆదిత్యనాథ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార ఘటనలను అదుపు చేయడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విఫలమయ్యారని, అలాంటి వ్యక్తిని చెప్పులతో తరిమికొట్టాలని కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్‌ గుండూరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అనంతరం ఆయన బహిరంగ క్షమాపణ కోరారు.
*అభివృద్ధి ఓర్వలేకే ప్రభుత్వంపై విమర్శలు
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, పంజాబ్‌, కర్ణాటక మంత్రులు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, రేవణ్ణలను చూసైనా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్యే వేముల వీరేశంలు సూచించారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల వారు ప్రశంసిస్తుంటే ఇక్కడి నేతల్లో అసహనం పెరిగి దురుసుగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
*ఆదిత్యనాథ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార ఘటనలను అదుపు చేయడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విఫలమయ్యారని, అలాంటి వ్యక్తిని చెప్పులతో తరిమికొట్టాలని కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్‌ గుండూరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
*దేశం, రాష్ట్రం బాగుండాలంటే మోదీని గద్దె దింపాలి
దేశం, రాష్ట్రం బాగుండాలంటే ప్రధాని మోదీని గద్దె దింపాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని కోరుతూ ఆదివారం గుంటూరులో ఎమ్మెల్యే ఫిలిప్‌ టోచర్‌ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.
*హిందువుల సంక్షేమానికే నిరాహార దీక్ష
హిందువుల సంక్షేమం లక్ష్యంగా మంగళవారం నుంచి తాను ఆమరణ దీక్ష చేయబోతున్నట్లు- విశ్వహిందూ పరిషత్‌ను వీడిన అగ్రనేత ప్రవీణ్‌ తొగాడియా చెప్పారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుని పదవికి తాను ప్రతిపాదించిన అభ్యర్థి ఓడిపోవడంతో ఆయన ఆ సంస్థను వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్‌లో మద్దతుదారులతో ఆయన సమాలోచనలు జరిపారు.
*ఆంధ్రుల ఆత్మగౌరవం గీతావిష్కరణ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఐదుకోట్ల ఆంధ్రులను దగా చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ రూపొందించిన ఆంధ్రుల ఆత్మగౌరవం గీతాన్ని… ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ ఆదివారం ఇక్కడ ఆవిష్కరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com