నేటి రాజకీయం-౧౧/౨౯

జగన్ పై దావా వెస్ట..-గిడ్డి ఈశ్వరి.
నిన్న సాక్షి పేపర్ మరియు చానల్ వాళ్ళు నా పై దుష్ప్రచారం చేశారు. నేను పాతిక కోట్లు తీసుకున్నాని చెప్పారు నేను పాతిక కోట్లు తీసుకున్నాని అని చెప్పినారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపై నేను సాక్షి పేపర్ పై కోర్టు కి వెళ్తాను అని గిడ్డి ఈశ్వరి తెలిపారు.
*త్వరలో తెలంగాణాలో మహిళా మంత్రులు
మంత్రి వర్గంలో మహిళలకు చోటు పై సరైన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేసిఆర్ స్పష్తం చేసారు. తమ పార్టీలో మహిళా ఎమ్మెల్యే సంఖ్య కూడా తక్కువగా ఉందన్నారు.
*డిసెంబర్ ఒకటి న మంత్రి మండలి భేటి.
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం దేసేమబ్రు ఒకటో తేదీ జరుగుతుంది. ఆరోజు సాయంత్రం అయిదు గంటలకు వెలగపూడి సచివాలయంలో మంత్రి మండలి భేటి కానుంది.
*తాను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ బెంగళూరుకు చెందిన అమృత సారథి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జయలలిత మేన కోడలు దీపా జయకుమార్‌ మంగళవారం స్పందించారు. అసలు ఆ అమృత సారథి ఎవరో తనకు తెలియదన్నారు.
*జయలలిత వారసులమని పేర్కొంటూ ప్రస్తుతం తెరపైకి వస్తున్నవారంతా నకిలీలేనని ఎంజీఆర్‌ అమ్మా దీప పేరవై ప్రధాన కార్యదర్శి, జయలలిత మేనకోడలు దీప పేర్కొన్నారు. తన మేనత్త వీలునామా రాసి ఉంటే ఈపాటికి కోర్టుకు వచ్చి ఉండాలని, దీనిని బట్టి ఆమె ఎలాంటి వీలునామా రాసి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జయలలిత నివసించిన చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయాన్ని స్మృతివనంగా మార్చనున్న చర్యలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో దీప పిటిషన్‌ వేసిన నేపథ్యంలో దీనిపై నాలుగు వారాల్లోపు విచారించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ సమక్షంలో సోమవారం సాయంత్రం దీప హాజరయ్యారు. ప్రధాన కార్యదర్శితో సమావేశ అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ… ‘వేదనిలయం’పై వారసత్వ హక్కులు తమకే ఉన్నాయని పేర్కొన్నారు.
*పార్టీ అధిష్ఠానం రాజ్యసభకు వెళ్లమంటే వెళతానని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్‌లో మంగళవారం మంత్రి విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మీరు రాజ్యసభకు వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది, నిజమేనా? అన్న ప్రశ్నకు.. ఆయన పై విధంగా స్పందించారు. ‘‘అది కావాలి, ఇది కావాలి అని అడిగే అలవాటు ఎప్పుడూ లేదు. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. 35 ఏళ్లు రాష్ట్రంలో పనిచేశా. ఇది సుదీర్ఘ అనుభవం. నా అవసరం ఎక్కడుందో పార్టీనే నిర్ణయిస్తుంది’’ అని పేర్కొన్నారు.
*రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేరికకు రంగం సిద్ధమైంది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బొడిమల్ల గురునాథరెడ్డితోపాటు ఆయన సోదరులు, వారి అనుచరులు గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.
*మిషన్‌ కాకతీయ నాలుగో దశ చెరువుల పునరుద్ధరణ కోసం పరిపాలనా అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో 28 చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
*పాకిస్తాన్ ప్రధానమంత్రి షాహిద్ ఖకాన్ అబ్బాసీని దించేసి తాత్కాలిక ప్రధానిని నియమించేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు కొన్ని పాకిస్తాన్ వార్తాపత్రికలు ఇవాళ కథనాలు ప్రచురించాయి. ఆర్మీలో పనిచేసి రిటైరైన ఓ అధికారి ఈ పనిలో ఫుల్ బిజీగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రధాని పదవిని చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ మాజీ న్యాయమూర్తి వాజిహుద్దీన్ అహ్మద్‌కు సూచించినట్టు సమాచారం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com