నేటి రాజకీయ వార్తలు -౧౧/౨౬

*కొందరు రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్రల పేరుతో రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌ తన పాదయాత్రలో వాస్తవాలను చెప్పాలని కోరారు. తమ ప్రభుత్వం రైతుల సమస్యలు తీర్చేందుకు రాజీలేకుండా కృషి చేస్తోందని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమాన్ని విస్మరించేది లేదని స్పష్టం చేశారు.
*హరియనలో రిజర్వేషన్ల కోసం జాబ్ సామాజిక వర్గీయులు వారి దిమడ్లను వ్యతిరేకిస్తూ కురుసేత్ర ఎంపి రాజ్ కుమార్ ఆదివారం పోటాపోటీగా నిర్వహించనున్న ప్రదర్శనల దృశ్య రోహ టాక్ సహా పదమూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు అంతర్జాల సేవల్ని స్తంభిస్తున్నారు.
*నటి దీపికా పదుకొణె తలకు రూ.10 కోట్లు ఇస్తానంటూ భాజపా నేత సూరజ్‌పాల్‌ అము ఇటీవల వివాదాస్పద ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘పద్మావతి’ చిత్రానికి మద్దతు పలికిన పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘లక్ష్మణుడు రాక్షసి శూర్పణక ముక్కును కోశాడు. మమతా.. శూర్పణక తలరాతను మర్చిపోవద్దు’ అంటూ సూరజ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.‘పద్మావతి’ ప్రీమియర్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఆ చిత్ర యూనిట్‌ను స్వాగతిస్తున్నామని మమత శుక్రవారం అన్నారు. ఇతర రాష్ట్రాలు ఈ సినిమాను నిషేధిస్తే.. తమ రాష్ట్రంలో సినిమా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలు పథకం ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
*గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో ఆ రాష్టంలో భాజపా భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధాని మోడీ కుటుంబం తేనీటి విక్రయ నేపద్యాన్ని హేళన చేసే లా ఇటీవల యువజన కాంగ్రెస్స్ ఆన్ లైన్ పత్రిక లో వచ్చిన o వ్యాఖ్యకు జవాభిచ్చేలా దీనిని నిర్వహిస్తోంది. మోడీ పాల్గొనే మనసులో మాట రేడియో కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వేలకు పైగా ఉన్న పోలింగ్ కేంద్రల్లన్ని టా మాన్ కి బాత్ పేరుతో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
*గుజరాత్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులకు ప్రకటించిన భాజాపా పంచ్ మహాల్ జిల్లాలోని కలోల్ స్థానంలో ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆ స్థానంలో పార్టీ అబ్యార్ధిని ప్రకటించిన వ్యక్తి ఎన్నికల్లో గెలుపొందలేదని ఆమె ఓటమికి తనను బాద్యుడ్ని చేయవద్దని పంచ్ మహాల్ లోక్ సభ సిట్టింగ్ భాజపా ఎంపి ప్రకాట్ సింగ్ చౌహాన్ ఏకంగా అధిష్టానానికి లేఖ రాశారు. అయితే ఆ టికెట్ పొందిన సుమన్ బెన్ ఎవరో కాదు స్వయంగా ఆయన కోడలే కావటం విశేషం.
*అరకు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెదేపాలో చేరుతున్నట్లు సమాచారం.
* ఫరూక్ అబ్దుల్లా ఇంత నీచానికి దిగజారాడా
షేక్ అబ్దుల్లా కుటుంబం కాశ్మీర్ తమ సొంత ఆస్తి అనుకుంటారు. దాని విషయంలో ఎలా మాట్లాడినా చెల్లిపోతుంది అంటారు అన్నది వారి భావన. ఒకే వంశంలో తాతనుండి మనుమడికి వరకు ముఖ్యమంత్రులు చేసారు. ఆ రాష్ట్రానికి నిజానికి ఈ రాష్ట్ర ప్రధాన సమస్య ఏమిటో వారికి బాగా తెలిసి ఉండాలి. కానీ అధికారం కోల్పోగానే దిగార్జరుడు మాటలు ఆ కుటుంబం నోటి నుండి మామూలుగా వస్తుంటాయి. జమ్మూ మొత్తం భారతదేశంలో అంతర్భాగమని పార్లమెంట్ లో ఏకగ్రీవ తీర్మానం జరిగింది. ఆ సమయంలో అబ్దుల్లా కుటుంబం నుండి ఎవరో ఒకరు పార్లమెంట్లో సభ్యులేవరో వారి పార్టీ నేషనల్ ఖాన్ఫరెంస్ ఆ తీర్మానంలో భాగాస్వామి.అది తెలిసి కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్దే. అది ఇక భారతదేశానికి దక్కేది కాదు అనే ప్రకటన ఫరూక్ అబ్దుల్లా చేసాడు. అటువంటి ప్రకటన చెయ్యాల్సిన అవసరం ఏమిటి, కాశ్మీరీ సమస్య మీద పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న వేల పాకిస్తానీ అనుకూల ప్రకటన చెయ్యటంలోని కుతంత్రం ఏమిటో ఫరూక్ అబ్డుల్లానే వివరించాల్సి ఉంటుంది.
*కర్నూలు జిల్లా ఆదోని మండలం అరెకట్లు గ్రామానికి చెందిన వంద మంది వైకపా కార్యకర్తలు ఆదివారం నాడు తెదేపాలో చేరారు.
*గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పల్గోనన్ రాహుల్ గాంధీ ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశాలో పాల్గొన్న కాంగ్రెస్స్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక మహిళా ఆవేదన విని.. తట్టుకోలేక అనూహ్య రీతిలో ప్రతి స్పందించాడు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబందించిన విడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది. అహ్మదాబాద్లో కాంగ్రెస్స్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రహ్ల్ గాంధీ అహ్మద్ పటేల్ సహా మరికొందరు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమయంలో పార్టీ కార్యాకర్తలు తమ కస్తాలును రాహుల్ గాంధీకి వివరిస్తున్నారు. ఈ సమయంలో రంజనా ఆశ్వతి మహిళా లేచి తన కష్టాలను రాహుల్ గాంధీకి వివరించడం మొదలు పెట్టారు. నేను 1994 నుంచి పార్జ్ టైం టీచర్ గా కెరీర్ మొదలు పెట్టాను అప్పట్లో నాకు రెండు వేలు జాతం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ. పన్నెండు వేలు జీతం వస్తోంది. ప్రతి మహిళకు ప్రసూతి సెలవు తప్పక ఇస్తారు. అయితే ఈ ప్రభుత్వం నాకు ప్రసూతి సెలవు కూడా ఇవ్వకుండా ఇబ్బండి పెట్టింది అని ఉద్వేగంతో చెప్పారు.
*టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మెట్రో లేటు
టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మెట్రో ప్రాజెక్టు ఆలస్యమైందని తెలంగాణా పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి ఆరోపించారు. మరో రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభం కానున్న విషయం తెలిశిండే. మెట్రో రైల్ క్రెడిట్ టీఆర్ఎస్ కొట్టేయాలని చూస్తోందని కాంగ్రెస్స్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపద్యంలోనే ఆదివారం మెట్రో ప్రాజెక్ట్ పై టీ కాంగ్రెస్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పజేక్ట్ అనుమతులు డిజైన్ నిధులు వంటి వివరాలు అందులో వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే మెట్రో పనులను జాప్యం చేఇందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఆలస్యం ఫలితం ప్రభుతం పై రూ వేల కోట్ల భారం పడిందన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com