నేటి రాజకీయ వార్తా విశేషాలు-౧౧/౨౫

*ఆర్కేనగర్‌కు అభ్యర్థిని ప్రకటించిన డీఎంకే
తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ ఖరారైంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున మరదు గణేశ్‌ బరిలోకి దిగుతారని ప్రతిపక్ష డీఎంకే ప్రకటించింది. శనివారం ఉదయం పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ గణేశ్‌ పేరును వెల్లడించారు.
*ప్రధానిపై రాహుల్‌ మళ్లీ వ్యంగ్యాస్త్రాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలింగనంపై ఆ మధ్య కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ గృహ నిర్బంధం నుంచి విడుదలైన నేపథ్యంలో మరోసారి అలాంటి విమర్శలే చేశారు రాహుల్‌ గాంధీ. ప్రధాని మోదీజీ.. అర్జెంట్‌గా మరిన్ని ఆలింగనాలు కావాలి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
*కదలలేని కరుణా నిధితో ‘మోడీ’ ఏమీ మాట్లాడాడు అబ్బా..
మరేదో కార్యక్రమంలో కోసం చెన్నై వెళ్ళిన కేంద్ర మోడీ ముందస్తుగా చెప్పకుండానే డీ ఎం కే కురు వృద్దుడు కరుణానిధి ఇంటికెళ్ళి పరామర్శించే నిర్ణయం తీసుకున్నట్లు బయటకు కనిపిస్తున్నా దాని వెనుక ముందస్తు ప్రణాళిక ఉద్న్డనే అర్ధమవుతుంది.విదేహంలో ఉన్న కరుణానిధి కొడుకు రాజకీయ వారసుడు స్టాలిన్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటా హుటీన చెన్నై చేరాడు. నిజానికి ప్రధాని మంత్రి నరేంద్రమోడి గానీ మరొకరిని గానీ గుర్తించే స్థితిలో మాట్లాడే స్థితిలో కరుణానిధి లేదు. అందుకని అసలు మాటలు స్తాలిన్ తోనే జరిగిఉంతాయి. చెన్నైలో శశికళ వ్యాపార విభాగాలు టీవీ చానల్లు ఇళ్ళ మీద దాడులు చేసి వేల కోట్లు నల్లడబ్బును వేలికితీసాయి. పైగా శశికళ ఇంట్లో భూగర్భంలో నిక్షేపాలు దాచి పెట్టిన మాలిగ ఉందని దానిని కనుక్కున్నమంటూన్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో అన్నా డీఎంకే తో ఆటంకంగా మంచిదన్న ఆలోచన అమిత్శాకి కలగటం వలెనే జరుగుతున్నాయా.
*గుజరాత్ గుబులుతో పార్లమెంట్ వాయిదా.
పార్లమెంట్ శీత్యాకాల సమావేశాలకు రాజకీయ వాయిదా తప్పలేదు. సాధారంగా నవంబరులో జరిగే ఆ సమావేశాలు ఈసారి డిసెంబరు వరకు మొదలు పెట్టేలా లేడు. సభలు ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వ నిర్ణయమే అయినా సంప్రదాయాలకు పెద్ద పీత వేయటం ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా కానీ గుజరాత్ ఎన్నికలు అక్కడ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నేతలు తలమునకలవుతున్నారు. జీ ఎస్టీ పెద్ద నిట్ల రద్దు మీద ప్రతిపక్షాలు రెచ్చిపోవటం భాజాపాకి ఇబ్బందిగా మారిండి. పార్లమెంట్ ని సమావేశపరచి దానిని ప్రతిపక్షాల గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వేదికగా అప్పగించి నష్టపోవటం ఎందుకని భావించిన ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల వాయిదా వైపు మొగ్గింది. ఎప్పుడూ ప్రారంభిస్తారో ఇంతవరకు చెప్పలేదు. బహుశా గుజరాత్ ఓటింగ్ ముగిసే వరకు పార్లమెంట్ విషయాలు ఊసును ప్రభుత్వం కన్నా భిన్నంగానే కాదని మరోమారు నిరూపించుకుంది భాజపా.
*తమిళనాడులో ఉప ఎన్నికల కోలాహలం
తమిళనాడులో ఎన్నికల షెడ్యుల్ ఖరారైంది. ఈ ఎన్నికల్లో తమపార్టీ తరపున మరది గణేష్ బరిలోకి దిగుతారని ప్రతిపక్ష డీ ఎం కే ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరపున మారదు గణేష్ బరిలోకి దిగుతారని ప్రతిపక్ష డీ ఎం కే ప్రకటించింది. శ్జనివారం ఉదయం నాడు పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం డీఎంకే అద్యక్షుడు ఎంకే స్తాలిన్ గనేషన్ పేరును వెల్లడించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. శుక్రవారం ఈ ఎన్నికల ఈసీ షెడ్యుల్ విడుదల చేసింది.
*ముస్లీం కు బద్ద వ్యతిరేకి చంద్రబాబు
ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుట్లూరు సమీపంలో ముస్లింల ఆత్మీయ సదస్సుకు హాజరయ్యారు. ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే వైఎస్‌ఆర్‌ పాలన కొనసాగించాలని వైఎస్‌ జగన్‌కు మైనార్టీలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ… ‘ ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశాడు. ఎనిమిది శాతం రిజర్వేషన్లు అంటూ ముస్లింలను నిలువునా ముంచారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే మసీదు, చర్చి, దేవాలయాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.15 వేలు, మసీద్‌ ఇమమ్‌లకు నెలకు రూ.10వేల వేతనం ఇస్తాం.’ అని హామీ ఇచ్చారు.
*నేడు తెదేపా కేంద్ర కార్యాలయానికి శంఖుస్తాపన
మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు గ్రామం వద్ద ఆదివారం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు తెదేపా కేంద్ర కార్యాలయానికి పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు శంకుస్తాపన చేస్తున్నారు. నూతన డీజీపీ కార్యాలయానికి పక్కనే తెదేపా కార్యాలయం నిర్మాణం జరగనుంది. పార్టీ కార్యాలయం మొత్తం మూడు ఎకరాల అరవై సెంట్లు కాగా ఇందులో మొత్తం మూడు బ్లాక్లు పార్టీ కార్యాలయం నిర్మాణం ఆరు నెలల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం మొదటి బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ బ్లాక్ సిద్దం చ౪ఎసి ఇవ్వాలని ఆదేసహం. రేపు తెల్లవారు జమున పూజా శంకుస్తాపనకు పూజా కార్యక్రమాలు .ఈ శంకుస్తాపన ఏర్పాట్లు ఏవీ రమణ, టీడీ . జనార్ధన్ వీవీవీ చౌదరిలు పర్యవేక్షణ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్న ఈ ప్రాంతంలో భారీ ఎక్కువ పోలీసులు బలగాలను మొహరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com