నేటి వాడి-వేడి వార్తా విశేషాలు-౧౧/౨౫

* గుజరాత్‌ ఎన్నికల సమరం దగ్గరపడుతోంది. అటు అధికార భాజపా.. ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రచారంలో వేగం పెంచుతూ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌ రాజకీయాల్లో ఆసక్తికర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తన మద్దతు కాంగ్రెస్‌కేనని పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి నేత హార్దిక్‌ పటేల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పటేల్‌ వర్గం ఎన్నారైలు మాత్రం హార్దిక్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. తాము భాజపాతోనే ఉంటామని ఎన్నారై పటేల్‌లు ముక్తకంఠంగా చెబుతున్నారు. ఉండటమే కాదు.. భాజపాకు మద్దతుగా ప్రచారం కూడా చేపడతామంటున్నారు.
* విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం వద్ద శనివారం రెండు త్రాచుపాముల సంచారం భక్తుల్లో కలకలం రేపింది. కొండపైనున్న క్యూలైన్ల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో రెండు త్రాచు పాములు కన్పించాయి. దీంతో ఆ పాములు ఎక్కడ క్యూలైన్లలోకి ప్రవేశిస్తాయేమోనన్న భయంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. గమనించిన భద్రతా సిబ్బంది అటువైపు వెళ్లేందుకు ప్రయత్నించేలోపే అవి మట్టిలోపలికి వెళ్లిపోయాయి. కాసేపటికే భక్తులు యథావిధిగా క్యూలైన్లలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
* సైద్ధాంతిక విభేదాలు కంటే మానవత్వమే ముఖ్యమని చాటారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేత, తన మిత్రుడు అయిన రాజేంద్రప్రసాద్‌ను శనివారం పరామర్శించారు. హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి శనివారం ముఖ్యమంత్రి స్వయంగా కేసీఆర్‌ వెళ్లారు. రాజేంద్రప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలింగనంపై ఆ మధ్య కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ గృహ నిర్బంధం నుంచి విడుదలైన నేపథ్యంలో మరోసారి అలాంటి విమర్శలే చేశారు రాహుల్‌ గాంధీ. ప్రధాని మోదీజీ.. అర్జెంట్‌గా మరిన్ని ఆలింగనాలు కావాలి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
* తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం 5,000 టికెట్లను తితిదే శనివారం విక్రయించింది. ఈ ఉదయం 10గంటలకు అంతర్జాలంలో విడుదల చేయగా తితిదే వెబ్‌సైట్‌ నుంచి భక్తులు వీటిని కొనుగోలు చేశారు. విడుదల చేసిన కొద్దిసేపట్లోనే భక్తులు పోటీ పడి అధికసంఖ్యలో ఈ టిక్కెట్లను కొనుగోలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న శ్రీవారి దర్శనం కోసం 10,000 టికెట్లను తితిదే కేటాయించింది. వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
* గోల్కొండ కోటలో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ఇచ్చే విందును పురస్కరించుకుని కోటలో తాత్కాలిక నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోట ప్రవేశద్వారం నుంచి కోటలోని తారామతి మసీదు వద్ద సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసే వేదిక వరకు వీటిని బిగిస్తున్నారు. కోట ప్రవేశద్వారం నుంచి వేదిక వద్దకు వెళ్లే దారిపొడవునా మొత్తం 30 నిఘానేత్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కోటలో 29వ తేదీన జరిగే విందు కార్యక్రమం ముగియగానే వీటిని తొలగిస్తామని నిఘానేత్రాలు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది తెలిపారు.
* గత పాలకుల విధానాల కారణంగానే పేదలకు సొంతిళ్లు లేవని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. లేని వారి పేరు చెప్పి ఉన్న వాళ్లు ఇళ్లు కట్టుకున్నారని అన్నారు. గత పాలకులు ఇళ్లు కట్టకుండా బిల్లులు కూడా తీసుకున్నారని ఆరోపించారు. అన్ని వసతులతో కూడిన ఇళ్లు పేదలకు ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తెలిపారు.
* మహబూబ్‌నగర్ రాష్ట్ర మంత్రి ల‌క్ష్మారెడ్డి సమక్షంలో రాజాపూర్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
* ఈనెల 27వ తేదీన ప్రముఖ సినీ హీరోయిన్ రాకూల్ ప్రీత్ సింగ్ విశాఖకు విచేస్తున్నారు. స్థానికంగా జరిగే o కార్యక్రమంలో ఆమెతో పాటు పలువురు పాల్గొన్నారు. స్థానిక పొర్తుస్టేడియం ల ఇషా ఫౌండేషన్ యునిసెఫ్ అద్వర్యంలో గ్రామోత్సవం జరగనుంది.
* జీపీఎస్‌ సదుపాయం లేని స్మార్ట్‌ఫోన్లను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి విక్రయించడానికి వీల్లేదని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ తాజా ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. భయాందోళన(ప్యానిక్‌) మీటతోపాటు ఉపగ్రహ సమాచారం ద్వారా ప్రాంతాన్ని గుర్తించడానికి వీలుకల్పించే జీపీఎస్‌ సదుపాయాన్ని స్మార్ట్‌ఫోన్లలో తప్పనిసరిగా పొందుపర్చాలని తయారీసంస్థలను ఆదేశించింది. వాస్తవానికి అన్ని ఫోన్లలో జీపీఎస్‌ను తప్పనిసరిచేస్తూ(2018 జనవరి 1నుంచి) కేంద్రం గతేడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీచేసింది. ఉత్తర్వుల్లో ఫీచర్‌ ఫోన్లకు మినహాయింపునిచ్చింది.
* తమ ప్రమేయం లేకుండానే కొంతమంది వినియోగదారుల లొకేషన్‌ వివరాలు బహిర్గతం అయ్యాయంటూ వచ్చిన ఫిర్యాదులపై ట్విటర్‌ స్పందించింది. ఓ బగ్‌ కారణంగా ఈ పొరపాటు జరిగిందని అంగీకరించింది. కొందరు వినియోగదారుల విషయంలో ఈ విధంగా జరిగిందని తెలిపింది. ట్వీట్‌ చేసేటప్పుడు ఎమోజీ లేదా జిఫ్‌ ఇమేజ్‌ను సెలెక్ట్‌ చేస్తే వాటితో పాటు లొకేషన్‌ వివరాలు కూడా జత అయ్యాయని ట్విటర్‌ తెలిపింది. అలా షేర్‌ అయిన లొకేషన్‌ వివరాలను ట్విటర్‌ తొలగించడంతో పాటు ఆ విషయాన్ని ఈమెయిల్‌ ద్వారా సదరు వినియోగదారులకు తెలియజేసింది.
* దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చేంత వరకు హిందువులు కనీసం నలుగురేసి పిల్లల్ని కనాలి అంటూ హిందూ ఆధ్యాత్మిక వేత్త ఒకరు వ్యాఖ్యానించారు. హరిద్వార్‌లోని భారత్‌మాత మందిర్‌కు చెందిన స్వామి గోవింద్‌దేవ్‌ గిరీజీ మహరాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మసంసద్‌ రెండో రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
* తీరప్రాంత ఖనిజ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం తరుపున రాయల్టీ కోరామని, అయితే తమ ప్రతిపాదనపై కేంద్రం స్పందించలేదని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఇబ్బందికర పరిస్థితిలో ఉందని, ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం కొంత అవకాశం కల్పించాలని అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘం సమావేశంలో మంత్రి కోరారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు వెసులుబాటు ఉందని ఆయన అన్నారు. ఏపీ అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘం సమావేశం ఢిల్లీలో జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున యనమల హాజరైనారు.
* వైకుంఠ ద్వాదశి, న్యూఇయర్‌ సందర్భంగా స్వామి దర్శన కోసం టీటీడీ శనివారం టికెట్లను విడుదల చేసింది. వైకుంఠ ద్వాదశికి సంబంధించి 5 వేల టికెట్లు.. జనవరి ఒకటో తేదీకి సంబంధించి 10 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టీటీడీ తెలిపింది. టీటీడీ వెబ్‌సైట్‌లో రూ.300 టికెట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. కాగా తిరుమలలో డిసెంబరు 28న వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 29న ద్వాదశి పర్వదినాలను నిర్వహిస్తారు.
*దేశ రాజధాని డిల్లీలో మెట్రో టికెట్ల ధర పెంపు ప్రయనికిల సంఖ్య పై ప్రతీకూల ప్రభావం చూపుతుంది. దహరాల పెంపునకు మందుతో పోలిస్తే ప్రస్తుతం ప్రయాణీకుల సంఖ్య రోజుకు మూడు లక్షల పైగా తగ్గుముకం పటింది. గతనెల పడి నుంచి డిల్లి మెట్రో టికెట్ల నూతన ధరలు అమల్లోకి వచ్చాయి.
* ఆటగాడిగా కెరీర్‌ ముగిశాక తాను భారత క్రికెట్‌ జట్టుకు కోచ్‌ కావాలని ఆశించినట్లు మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వెల్లడించాడు. ఐతే అనుకోని పరిస్థితుల్లో క్రికెట్‌ పాలకుడిగా మారినట్లు చెప్పాడు. ‘‘ఫలితం గురించి ఆలోచించకుండా మన వల్ల ఏదైతే అది చేయాలి. జీవితం ఎటు వైపు వెళ్తుందో, మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. 1999లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినపుడు నేను భారత జట్టుకు వైస్‌కెప్టెన్‌ కూడా కాదు. అప్పుడు సచిన్‌ కెప్టెన్‌.
* లండన్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఆక్స్ ఫర్డ్‌ సర్కస్‌ ఏరియాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాల్పుల శబ్దాలు వినిపించాయంటూ ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిలసలాట జరిగి 16 మంది గాయపడ్డారు. అయితే అక్కడ ఎలాంటి కాల్పుల ఘటన చోటుచేసుకోలేదని.. అవన్నీ వదంతులేనని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న గొడవే దీనికి కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు.
*విజయవాడ నగరంలో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. బెంజ్ సర్కిల్ పటమట, రమేష్ హాస్పిటల్ అతోనగర్ పాటు పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంది.
* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ) క్రమంగా నష్టాల వూబి నుంచి బయటపడుతోంది. గతేడాదికంటే నష్టాలు తగ్గినందున భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. కార్మికుల కృషితో పాటు ఖర్చు తగ్గించేలా ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. బ్యాంకు రుణాల విషయంలో ప్రభుత్వం తోడ్పాటు ఆర్టీసీకి కలిసి వచ్చింది. ఆర్టీసీలో రెండు, మూడు సంవత్సరాలుగా చేపట్టిన సంస్కరణలు ఫలితాన్నిస్తున్నాయి. గతేడాది 66.93 శాతంగా ఉన్న ఆక్యుఫెన్సీ రేషియో ఈ ఏడాది 78.97 శాతానికి పెరిగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణీకుల సంఖ్య ఒక్కసారిగా 7.05 శాతం పెరగటం సంస్థకు విజయం లాంటిదే. సాంబశివరావు ఎండీగా ఉన్న కాలంలో ఆర్టీసీ నవీకరణకు చేపట్టిన చర్యలు సంస్థ ప్రతిష్టను పెంచడం సహా ప్రయాణీకులను ఆర్టీసీ వైపు ఆకర్షితులను చేశాయి. ప్రస్తుత ఎండీ మాలకొండయ్య సైతం ప్రయాణీకుల నమ్మకాన్ని చూరగొనేలా చర్యలు చేపట్టారు.
*ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార తెదేపా పార్టీ నాయకులు రాజకీయ హత్యలకు ప్రేరేపిస్తున్నారు. అని వైకాపా అనంతపురం పార్లమెంట్ అద్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి విమర్శించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com