నేటి వాణిజ్యం-౦౨/౦౮

*రెండేళ్లకోసారి జరిగే భారత వాహన ప్రదర్శన (ఆటో ఎక్స్ పో-2018) మరోసారి అబ్బురపరిచింది. భవిష్యత్‌ వాహనాలకు చిరునామాగా మారిన ఈ ప్రదర్శనలో కంపెనీలు తమ కొత్త మోడళ్లతో ఆకట్టుకున్నాయి.
*సామాన్య, మధ్యతరగతి వర్గీయులు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా అందుబాటు ధరల్లో నిర్మిస్తున్న ఇళ్లు, ఫ్లాట్లకు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూలు చేయొద్దని భవన నిర్మాణదార్లను ప్రభుత్వం ఆదేశించింది.
*భారతీయ ఫార్మా సంస్థలు యూరప్‌లో అడుగుపెట్టేందుకు ఐర్లాండ్‌ను ఒక మార్గంగా ఎంచుకుంటున్నాయని ఐడీఏ ఐర్లాండ్‌ భారత డైరెక్టర్‌ తనాజ్‌ బుహారివాలా తెలిపారు.
*వరుసగా ఏడో రోజూ సూచీలకు నిరాశే మిగిలింది. అంతర్జాతీయ సంకేతాల దన్నుతో ఆరంభ ట్రేడింగ్‌లో బలంగా పుంజుకున్న మార్కెట్లకు ఆర్‌బీఐ కళ్లెం వేసింది.
*టాటా గ్రూప్‌ నుంచి మరో కీలక వ్యక్తి బయటకు వెళ్లిపోయారు. టాటా హౌసింగ్‌ ఎండీ, సీఈవో బ్రోటిన్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సంస్థ ఛైర్మన్‌ శాంతన్‌ కృష్ణన్‌ ఉద్యోగులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేసినట్లు కృష్ణన్‌ పేర్కొన్నారు. దీనిపై ప్రమోటర్‌ కంపెనీ అయినా టాటా సన్స్‌ ఎటువంటి సమీక్ష నిర్వహించలేదని తెలిపారు. బ్రోటీన్‌ బెనర్జీ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో ఈవిషయాన్ని వెల్లడించారు.
*ఇప్పటివరకు ప్లాంటు, యంత్రాలపై పెట్టిన పెట్టుబడుల ఆధారంగా సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి వాణిజ్య సంస్థలు (ఎంఎస్‌ఎంఈ)గా గుర్తిస్తుండగా, ఇకపై ఆయా సంస్థల వార్షిక టర్నోవర్‌ ఆధారంగా ఆ గుర్తింపు ఇవ్వనున్నారు.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి అరబిందో ఫార్మా ఏకీకృత నికర లాభం స్వల్పంగా పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 2.8 శాతం వృద్ధితో రూ.578.6 కోట్ల నుంచి రూ.595 కోట్లకు పెరిగిందని అరబిందో ఫార్మా వెల్లడించింది.
*వ్యవసాయంలో వస్తున్న యాంత్రికీకరణ, సాంకేతిక మార్పులను రైతులకు పరిచయం చేసేందుకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘సీఐఐ అగ్రిటెక్‌ సౌత్‌ 2018’ పేరుతో వ్యవసాయ ప్రదర్శన ఫిబ్రవరి 9-11తేదీల్లో జరగనుంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి గాయత్రీ ప్రాజెక్ట్స్‌ రూ.46.51 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం నికర లాభం రూ.14.15 కోట్లతో పోలిస్తే 228 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కావేరీ సీడ్‌ కంపెనీ రూ.5.43 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com