నేటి వాణిజ్యం-౦౨/౦౯

*గ్రేటర్‌ నోయిడాలో తొలి రోజే మెరుపులు మెరిపించిన వాహన ప్రదర్శన.. రెండో రోజూ మరింత మైమరపించింది. గురువారం నాటి ప్రదర్శనలో మారుతీ సుజుకీ వంటి దిగ్గజ సంస్థలతో పాటు అంకురాలు, విద్యుత్‌ వాహన సంస్థలు కొత్త కార్లు, బైకులతో సందడి చేశాయి.
*భారత వాహన ప్రదర్శన(ఆటో ఎక్స్‌పో 2018) ప్రీ ఓపెన్‌ ఈవెంట్‌ అట్టహాసంగా సాగుతోంది. దేశ విదేశాలకు చెందిన ఆటోమొబైల్‌ సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
*ఔషధరంగ కంపెనీల షేర్ల ర్యాలీతో నేడు స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. బడ్జెట్‌ సెషన్‌ నుంచి నష్టాలను నమోదు చేస్తున్న మార్కెట్లకు నేడు కొంచెం ఊరట లభించింది.
*ఫోర్బ్స్‌ తొలిసారిగా క్రిప్టోకరెన్సీ కుబేరుల జాబితాను విడుదల చేసింది. అంటే కేవలం క్రిప్టోకరెన్సీ(ఊహాజనిత కరెన్సీ) ఆధారంగా అత్యంత ధనవంతులైన వారికి ఇందులో చోటు ఉంటుందన్నమాట. జాబితాలో 7.5-8 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.48750-52,000 కోట్లు)తో రిపుల్‌ సహ వ్యవస్థాపకుడు క్రిస్‌ లార్సెన్‌ అగ్రస్థానంలో నిలిచారు.
*మీరు ఏప్రిల్‌ 1, 2016 కంటే ముందు గృహ రుణాలు తీసుకున్నారా?. అయితే మీపై నెలవారీ వాయిదాల(ఈఎమ్‌ఐ) భారం తగ్గే అవకాశం కనిపిస్తోంది.
*ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌కు భారత్‌ భారీ జరిమానా విధించింది. ఆన్‌లైన్‌ శోధనకు సంబంధించి అన్యాయపూరితంగా వ్యవహరించినందుకు, గూగుల్‌కు రూ.136 కోట్ల జరిమానా విధిస్తూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) గురువారం ఆదేశాలు జారీ చేసింది.
*ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించడం ద్వారా బడ్జెట్‌లో అత్యంత నిరుత్సాహకర నిర్ణయాన్ని తీసుకున్నారని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు విమర్శించారు.
*అనుచిత వ్యాపార విధానాలు అనుసరిస్తున్నందుకు సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ 136 కోట్ల రూపాయల జరిమానా విధించింది. గూగుల్‌పై అనుచిత వ్యాపార ధోరణుల కేసు 2012లో దాఖలయింది. యాంటీ ట్రస్ట్‌ ప్రవర్తన నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్టు సిసిఐ తెలిపింది. ఇలాంటి అభియోగంపై గూగుల్‌ జరిమానా భరించాల్సివచ్చిన అరుదైన కేసు ఇది. కేసును అన్ని కోణాల నుంచి సునిశితంగా పరిశీలించిన తర్వాతే జరిమానా విధింపు నిర్ణయం తీసుకున్నట్టు సిసిఐ వివరించింది.
*అంతర్జాతీయ మేధో హక్కుల (ఐపీ) సూచీలో భారత్‌ స్థానం గణనీయంగా మెరుగుపడింది. యూఎస్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ 50 దేశాలతో రూపొందించిన జాబితాలో భారత్‌ 44వ స్థానంలో నిలిచింది. గతేడాది 45 దేశాల జాబితాలో 43వ స్థానాన్ని పొందిన సంగతి విదితమే.
*ఏటీఎం సేవలు అందుబాటులో లేని ప్రాంతాలపై దృష్టి సారిస్తున్న బ్యాంకులకు ఉపయోగపడేలా ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ రెండు కొత్త తరహా ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చింది.
*అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో కేడిలా హెల్త్‌కేర్‌ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 67.73 శాతం పెరిగింది.
*హైదరాబాద్‌కు చెందిన ఐటీ మౌలిక సదుపాయాల కంపెనీ వామా ఇండస్ట్రీస్‌ 2017, డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ.28.95 కోట్ల అమ్మకాలపై రూ.1.28 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి గ్రాన్యూల్స్‌ ఇండియా ఏకీకృత ప్రాతిపదికన రూ.35.01 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*ఆదాయం తగ్గినప్పటికీ.. ఎస్‌ఎంఎస్‌ ఫార్మాస్యూటికల్స్‌ నికర లాభం పెరిగింది. 2017, డిసెంబరుతో ముగిసిన మూడు నెలలకు రూ.12.14 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
*మొండి బకాయిలకు భారీగా కేటాయింపులు చేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఆంధ్రా బ్యాంకు నష్టం మరింతగా పెరిగింది. 2016, డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ.56.70 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.532.02 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com