నేటి వాణిజ్యం-౦౪/౦౧

*ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులకు రేపటి నుంచి కాస్త ఉపశమనం లభించనుంది.
పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే వసూలు చేసే ఛార్జీలను ఎస్‌బీఐ ఇటీవల 75శాతం తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తగ్గింపు రేపటి నుంచి అంటే ఏప్రిల్‌ 1 నుంచి వర్తించనుంది.
* కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామ సమీపంలోని ఆదర్శ పారిశ్రామిక పార్క్‌లో అశోక్‌ లేలాండ్‌ బస్‌ బాడీ బిల్డింగ్‌ కర్మాగారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రూ.135 కోట్ల పెట్టుబడితో 75 ఎకరాల్లో కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. ఈ కర్మాగారం ఏర్పాటుతో 2,295 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
*ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించినవారు లేరంటే అతిశయోక్తి కాదు. మొబైల్‌ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను తీసుకొస్తూ ఆకట్టుకుంటున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి.
*వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణం ఇచ్చిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వేగంగా అడుగులు వేస్తోంది. ప్రాథమిక విచారణ(పీఈ)లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను శనివారం ప్రశ్నించింది. 2012లో వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణ మంజూరీలో ఏదైనా ‘క్విడ్‌ ప్రో కో’ (నీకిది నాకది) జరిగిందా అన్నదానిపై పీఈని చేపట్టినట్లు తెలుస్తోంది.
*అంతర్రాష్ట్ర సరకు రవాణాకు నేటి నుంచి ఇ-వే బిల్లు విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇ-వే బిల్లు సమయం వర్తింపుపై ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. జీఎస్‌టీ ఈడబ్ల్యూబీ-01 ఫారంలోని పార్ట్‌-బిలో రవాణాదారు తొలిసారి వివరాలు పూరించినప్పటి నుంచి ఇ-వే బిల్లు సమయం వర్తింపు ప్రారంభం అవుతుందని పేర్కొంది.
*హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా తన సీబీఆర్‌ 250ఆర్‌, సీబీ హార్నెట్‌ 160ఆర్‌ మోటర్‌సైకిళ్లలో 2018 ఎడిషన్లను తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.1,63,584; రూ.84,675 (దిల్లీ, ఎక్స్‌షోరూం). సీబీఆర్‌ 250ఆర్‌ కొత్త ఎడిషన్‌లో 249.60 సీసీ ‘డీఓహెచ్‌సీ’ ఇంజిన్‌, రెండు దశల యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
*ఎక్సైజ్‌, కస్టమ్స్‌ కేంద్ర బోర్డు(సీబీఈసీ) పేరును పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ కేంద్ర బోర్డు(సీబీఐసీ)గా మార్చారు. ఆ మేరకు ఆ సంస్థ తన ట్విటర్‌ హ్యాండిల్‌ను cbec_india నుంచి cbic_india గా మార్చింది. ‘సీబీఈసీని సీబీఐసీగా పేరు మార్చాం. జీఎస్‌టీ వచ్చిన నేపథ్యంలో ఇలా చేయాల్సి వచ్చింద’ని ట్వీట్‌ చేసింది. ఎక్సైజ్‌ పన్ను, సేవా పన్నుతో పాటు మరో 12 కేంద్ర, రాష్ట్ర సుంకాల స్థానంలో జీఎస్‌టీ తెచ్చిన సంగతి తెలిసిందే. ఫైనాన్స్‌ బిల్లు 2018 ద్వారా రెవెన్యూ కేంద్ర బోర్డుల(సీబీఆర్‌) చట్టం-1963కు; కేంద్ర జీఎస్‌టీ చట్టం-2017కు సవరణ చేయడం ద్వారా సీబీఈసీని సీబీఐసీగా మార్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com