నేటి వాణిజ్యం-౦౪/౦౨

*మార్చిలో మారుతీ సుజుకీ దేశీయంగా 1,48,582 వాహనాలు విక్రయించింది. 2017 మార్చి అమ్మకాలు 1,27,999తో పోలిస్తే, ఈసారి 16.1 శాతం వృద్ధి చెందాయి. ఎగుమతులు సహా మొత్తం విక్రయాలు 14.9 శాతం అధికమై 1,60,598కు పెరిగాయి. స్విఫ్ట్‌, ఎస్టిలో, డిజైర్‌, బాలెనోలతో కూడిన కాంపాక్ట్‌ విభాగ అమ్మకాలు 60,699 కార్ల నుంచి 13.5 శాతం వృద్ధితో 68,885కు పెరిగాయి.
*దేశీయ అగ్రగామి ద్విచక్రవాహనాల సంస్థ హీరో మోటోకార్ప్‌ 2017-18లో మొత్తం 75 లక్షల వాహన విక్రయాలు నమోదు చేసింది. అంతర్జాతీయంగా ఇటువంటి ఘనత సాధించిన తొలి సంస్థగా నిలిచింది. 2016-17లో కంపెనీ 66.6 లక్షల బైక్‌లు, స్కూటర్లను విక్రయించింది.
*పట్టణ ఆర్థిక వ్యవస్థలతో పాటు స్థిరాస్తి విపణిలో ప్రస్తుతం అధిక వృద్ధి లభిస్తున్న అంతర్జాతీయ 30 నగరాలలో హైదరాబాద్‌, బెంగళూరు అగ్రస్థానాల్లో ఉన్నాయని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ ‘సిటీ మొమెంటమ్‌ సూచీ 2018’ వార్షిక నివేదికలో వెల్లడించింది.
*ఎగుమతిదార్లకు రావాల్సిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రిఫండ్‌ కోసం రూ.12,700 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వారికి రావాల్సిన మొత్తంలో ఇది 80 శాతానికి సమానమని ఒక అధికారి తెలిపారు.
*మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో చైనా ఉండగా, స్వల్పకాలంలోనే భారత్‌ రెండోస్థానానికి చేరిందని ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌ (ఐసీఏ) జాతీయ అధ్యక్షుడు పంకజ్‌ మొహింద్రూ కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా, ఐటీ శాఖా మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు లేఖ ద్వారా తెలియజేశారు.
*తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో రాయల్‌ ఆర్చిడ్‌ హోటళ్లను విస్తరించబోతున్నట్లు ఆ సంస్థ ఎండీ చందర్‌ బాలాజీ వెల్లడించారు. 2020 కల్లా దేశవ్యాప్తంగా 80-90 హోటళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యమన్నారు. ప్రస్తుతం 32 నగరాల్లో 49 హోటళ్లు, అందులో 3,200 గదులు సంస్థకున్నాయి. ‘
*ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రుణం పొందడంలో క్విడ్‌ ప్రోకో (నీకది నాకిది) జరిగిందన్న ఆరోపణలపై వీడియోకాన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌ స్పందించారు. రుణ మొత్తానికి ఆమోదం తెలిపిన కమిటీలోని మొత్తం 12 మంది సభ్యులూ తనకు తెలుసని, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలు ఎల్లప్పుడూ నేరపూరిత చర్యలకు దారితీయవని పేర్కొన్నారు.
* ప్రపంచంలో మొబైల్‌ ఫోన్లను‌ ఉత్పత్తి చేస్తున్న రెండో అతిపెద్ద దేశంగా భారత్‌ నిలిచింది. తొలి స్థానంలో చైనా ఉంది. ఈ విషయాన్ని ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌(ఐసీఏ) నేషనల్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ మహేంద్రు లేఖ ద్వారా ఐటీ, టెలికం మంత్రిత్వశాఖకు తెలియజేశారు.
*హోండా మోటర్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా తన యాక్టివా, గ్రాజియా, ఏవియేటర్‌ స్కూటర్‌లను త్వరలో రీకాల్‌ చేయబోతోంది.
*ప్రపంచంలో తమకున్న అతిపెద్ద మార్కెట్లలో భారత్‌ ఒకటని ఉబెర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డారా ఖాస్రోషాహి అన్నారు. దేశ వ్యాప్తంగా తమ సేవలను విస్తరించి లాభాలనుఅందిపుచ్చుకునేలా మరికొంత పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com