నేటి వాణిజ్యం-౦౪/౧౩

*హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సొల్యూషన్లను అందిస్తున్న ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో గురువారం నమోదైంది. రూ.17 కోట్ల సమీకరణకు కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. ఇష్యూ ఏప్రిల్‌ 5న ముగిసింది.
*ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెద్ద ఊరట దక్కింది. వీరు నెలకొల్పే అంకురాలకు పెట్టుబడులు(ఏంజెల్‌ ఇన్వెస్టర్ల నుంచి వచ్చినవి సహా) రూ.10 కోట్లలోపు ఉంటే.. పూర్తి స్థాయి పన్ను మినహాయింపును పొందడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.
*తమ ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్‌) నిర్వహణలో తప్పుడు పనులు చేసిన 433 సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సిద్ధమవుతోంది. తమ ఉద్యోగుల 2018 ఫిబ్రవరి పీఎఫ్‌ రిటర్నులను ఈ సంస్థలు దాఖలు చేయలేదు.
*ఉచిత సిమ్‌ కార్డులు.. తక్కువ ధరలకే అపరిమిత కాల్స్‌, డేటా ప్లాన్స్‌తో టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జియో రాకతో తమ వినియోగదారులను కాపాడుకునేందుకు ఇతర నెట్‌వర్క్‌లు దిగివచ్చాయి.
*ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ 2017-18 ఆర్థిక సంవత్సరం ఆదాయంలో 11 శాతం మేర వృద్ధి సాధించిందని ‌ఆ సంస్థ చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌సింగ్‌ ఖరోలా వెల్లడించారు. ఎయిర్‌లైన్స్‌ పనితీరు మెరుగుపడినందు వల్లే ఆదాయంలో వృద్ధి నమోదైందని ఆయన పేర్కొన్నారు.
*భారత వైమానిక దళానికి 110 యుద్ధవిమానాలను సరఫరా చేసే భారీ కాంట్రాక్టుపై కన్నేసిన బోయింగ్‌ తాజాగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌(హాల్‌), మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్స్‌(ఎమ్‌డీఎస్‌)తో జట్టు కట్టింది.
*మేలిమి బంగారం (999 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.32,000 దాటింది. అంతర్జాతీయంగా పసిడిపై పెట్టుబడులు పెరగడానికి తోడు దేశీయంగా ఆభరణాల వ్యాపారులు అధికంగా కొనుగోలు చేయడం వల్లే, ధర ఇంతలా పెరుగుతోందని సమాచారం.
*రూ.100 కొత్త నోట్లను ప్రవేశ పెట్టాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించింది. లేత నీలి రంగులో, ప్రస్తుత నోట్‌ పరిమాణంతో పోలిస్తే 20 శాతం చిన్నదిగా, తక్కువ బరువుతో ఉండే కొత్త రూ.100 నోటును జూన్‌లో విపణిలోకి ప్రవేశ పెట్టాలన్నది ఆర్‌బీఐ ప్రణాళిక.
*ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం రెండో నోటీసును పంపింది. వీడియోకాన్‌ కేసు వ్యవహారంలో పన్ను ఎగవేత దర్యాప్తునకు సంబంధించి ఇచ్చిన మొదటి నోటీసుకు ఆయన నుంచి కొంత సమాచారమే రావడంతో రెండో నోటీసు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
*ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెద్ద ఊరట దక్కింది. వీరు నెలకొల్పే అంకురాలకు పెట్టుబడులు(ఏంజెల్‌ ఇన్వెస్టర్ల నుంచి వచ్చినవి సహా) రూ.10 కోట్లలోపు ఉంటే.. పూర్తి స్థాయి పన్ను మినహాయింపును పొందడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.
*టాటా మోటార్స్‌ నుంచి టాటా ఏస్‌ గోల్డ్‌ మినీ ట్రక్కు మార్కెట్లోకి విడుదలైంది. మే 2005లో టాటా ఏస్‌ పేరుతో వచ్చిన ఒక టన్ను బరువు మోయగల సామర్థ్యం ఉన్న మినీ ట్రక్కును నవీకరించి గోల్డ్‌ పేరుతో తాజాగా విపణిలోకి తీసుకొచ్చారు.
*తమ ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్‌) నిర్వహణలో తప్పుడు పనులు చేసిన 433 సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సిద్ధమవుతోంది.
*ఇప్పటివరకు సెల్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఐప్యాడ్‌-ఐపాడ్‌లలో టెలికాం నెట్‌వర్క్‌లు ఇచ్చే సిమ్‌ కార్డులు వినియోగిస్తున్నాం. వీటితో కాల్స్‌, డేటా వాడుతున్నాం.
* వచ్చే అయిదేళ్లలో మొత్తం 400 పట్టణాలు, నగరాలపై దృష్టి సారించాలని టైటన్‌ కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఏడాదికి రూ.100-200 కోట్ల పెట్టుబడులను రిటైల్‌ వ్యాపార విస్తరణ, విక్రయ కేంద్రాలపై వెచ్చిస్తోంది. ఈ మేరకు పెట్టుబడులను కొనసాగిస్తామని టైటన్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ భట్‌ తెలిపారు.
*ఏకంగా 16 ఏళ్లపాటు ఇబ్బందుల్లో ఉన్న భారత ప్రభుత్వ రంగ టెలికాం తయారీదారు సంస్థ ఐటీఐ తాజాగా లాభాల బాట పట్టింది.
*నష్టాల్లో కొనసాగుతున్న ఎయిరిండియా 2017-18 ఆర్థిక సంవత్సరం ఆదాయంలో 11 శాతం వృద్ధి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఎయిర్‌లైన్స్‌ పనితీరు బాగుండటం వల్లే ఇది సాధ్యమైందని ఎయిరిండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా తెలిపారు.
*మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపునకు చెందిన వ్యవసాయ పరికరాల విభాగం (ఎఫ్‌ఈఎస్‌) 2017-18 ఆర్థిక సంవత్సరంలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 3 లక్షలకుపైగా ట్రాక్టర్లను దేశీయ, అంతర్జాతీయ విపణిలో అమ్మగలిగింది.
* సాంకేతికత పెరుగుతుండటంతో విద్యార్థులు డిజిటల్‌ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిస్కో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ (కమర్షియల్‌ సేల్స్‌) సుధీర్‌ నాయర్‌ పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com