నేటి వాణిజ్యం-౦౪/౧౪

*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఒక విద్యా సాంకేతిక కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయబోతోంది. ఇండియావిడ్యువల్‌ లెర్నింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎంబైబ్‌)లో 73 శాతం వాటా కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్‌ పేర్కొంది.
*బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ విభాగానికి ఛైర్మన్‌గా డి.వి.ఎన్‌. రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2018-19కి ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) తెలిపింది. ఈ కార్యక్రమానికి బీఏఐ జాతీయ ఛైర్మన్‌ పుహజెందీ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా పి.భాస్కర్‌ రెడ్డి నామినేట్‌ అయ్యారు.
* బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ విభాగానికి ఛైర్మన్‌గా డి.వి.ఎన్‌. రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2018-19కి ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) తెలిపింది. ఈ కార్యక్రమానికి బీఏఐ జాతీయ ఛైర్మన్‌ పుహజెందీ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా పి.భాస్కర్‌ రెడ్డి నామినేట్‌ అయ్యారు.
*ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌)ల ద్వారా స్టాక్‌ మార్కెట్లో పెట్టే తమ పెట్టుబడులను పెంచుకోవడం లేదా తగ్గించుకోవడాన్ని ఎంపిక(ఆప్షన్‌) చేసుకునే అవకాశాన్ని వినియోగదార్లకు త్వరలో ఇవ్వాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) భావిస్తోంది.
* 2జీ, 3జీ హ్యాండ్‌సెట్లు వాడుతున్న వినియోగదారులు 4జీ స్మార్ట్‌ఫోన్లకు మారితే 30 జీబీ ఉచిత డేటా అందిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ప్రీపెయిడ్‌ వినియోగదారులు రోజుకు 1 జీబీ చొప్పున 30 రోజులపాటు ఈ ఉచిత డేటాను పొందవచ్చన్నారు.
*ప్రైవేటు రంగ బ్యాంకులను జాతీయం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు గట్టిగా కోరుతున్నాయి.
*భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ ఉద్యోగాల తొలగింపు సర్వసాధారణంగానే ఉందని ఓ నివేదిక పేర్కొంది.
*అమెరికా మార్కెట్లోకి దిగుమతి అవుతున్న కొన్ని ఉత్పత్తులపై పన్ను ప్రయోజన పథకం కింద పన్ను వేయడం లేదు. అయితే ఆ తరహాలో వాటిపై సుంకం వేయకుండా ఉండేందుకు భారత్‌కున్న అర్హతపై సమీక్షించాలని అమెరికా నిర్ణయించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత సార్వభౌమ పసిడి బాండ్ల ఇష్యూను 16న ప్రభుత్వం ప్రారంభించనుంది. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), తపాలా కార్యాలయాలు, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ), బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ)ల్లో ఈ బాండ్లను విక్రయిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
*ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో మార్చిలో ద్రవ్యోల్బణం 4.3 శాతానికి చేరింది. అయినప్పటికీ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తదుపరి రేట్ల కోత విషయంలో విశ్లేషకులు స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. సమీప భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం మళ్లీ పుంజుకోవచ్చన్న ఆందోళనలే ఇందుకు కారణమని చెబుతున్నారు.
*విదేశీ మారకపు నిల్వలు ఏప్రిల్‌ 6తో ముగిసిన వారానికి 50.36 కోట్ల డాలర్లు (దాదాపు రూ.3,200 కోట్లు) పెరిగి జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 65.77 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,200 కోట్లు) పెరగడంతోనే మొత్తం విదేశీ మారకపు నిల్వలు 42,486.4 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.27,60,000 కోట్లు) చేరినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది.
*సమస్యల్లో చిక్కుకున్న ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేయడానికి మరో కంపెనీ ముందుకువచ్చింది. మణిపాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆఫర్‌ విలువ కంటే ఎక్కువతో మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ బెర్హాద్‌ ముందుకు వచ్చింది.
* వివో బ్రాండ్‌ నుంచి వై సిరీస్‌లో ‘వివో వై 71’ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి విడుదలైంది. దీని ధర రూ.10,990. బంగారు, నలుపు రంగుల్లో ఇవి లభిస్తాయని, ఏప్రిల్‌ 14 నుంచి అన్ని ఆఫ్‌లైన్‌ విక్రయ కేంద్రాల్లో విక్రయిస్తామని వివో సంస్థ తెలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com