నేటి వాణిజ్యం-౦౪/౧౫

*అమెరికా తన కరెన్సీ, స్థూల ఆర్థిక విధానాల పరిశీలన జాబితాలో భారత్‌నూ చేర్చింది. 2017 తొలి మూడు త్రైమాసికాల్లో అవసరం లేకున్నా విదేశీ మారకాన్ని భారత్‌ కొనుగోలు చేసిందని అమెరికా ఆరోపించింది.
*జనవరి- మార్చి త్రైమాసికానికి డీసీబీ బ్యాంక్‌ రూ.64 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఆర్జించిన రూ.53 కోట్లతో పోలిస్తే లాభం పెరిగింది. సమీక్ష త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగి రూ.264 కోట్ల నుంచి రూ.220 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండు కింద 75 పైసలు చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
* జనవరి- మార్చి త్రైమాసికానికి ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నికర లాభం 91% పెరిగి రూ.159 కోట్లకు చేరింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో నికర లాభం రూ.83 కోట్లుగా నమోదైంది.
*చిన్నపిల్లలు కూడా సొంతంగా బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతాలు తెరిచే సౌలభ్యాన్ని ఎస్‌బీఐ కల్పిస్తోంది. పెహలే కదమ్‌(తొలి అడుగు), పెహలే ఉదాన్‌(ఎగరడం) పేరిట రెండు పథకాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. పిల్లలకు చిన్నవయసు నుంచే డబ్బును పొదుపు చేయడం నేర్పించడంతో పాటు కొనుగోలు శక్తిని పరిచయం చేయడమే లక్ష్యంగా వీటిని ముందుకు తీసుకువచ్చింది ఎస్‌బీఐ.
*ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ కాయిన్‌ సెక్యూర్‌ నుంచి రూ. 20కోట్ల విలువైన బిట్‌కాయిన్లు చోరీకి గురయ్యాయి. వీటిని ఎవరు దొంగలించారో గుర్తించేందుకు ఎక్స్ఛేంజీ ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. దీంతో వీటిని కనిపెట్టేందుకు ఓ బహిరంగ ప్రకటన చేసింది.
*అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలో హెచ్చుతగ్గులు వేగంగా కన్పిస్తున్నాయి. డిమాండ్‌ లేమితో నిన్న కాస్త తగ్గి రూ.32వేల దిగువకు వచ్చిందనుకునే లోపే నేడు మళ్లీ పెరిగింది. రూ. 300 పెరగడంతో శనివారం నాటి మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ. 32,100కు చేరింది.
*ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ కాయిన్‌ సెక్యూర్‌ నుంచి రూ. 20కోట్ల విలువైన బిట్‌కాయిన్లు చోరీకి గురయ్యాయి. వీటిని ఎవరు దొంగలించారో గుర్తించేందుకు ఎక్స్ఛేంజీ ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. దీంతో వీటిని కనిపెట్టేందుకు ఓ బహిరంగ ప్రకటన చేసింది.
*‘వేసవి అంటే సెలవులు.. సెలవులంటే విహారయాత్రలు..’ అవును మరి పిల్లల స్కూళ్లు, కాలేజీలకు సెలవులు వస్తాయి కాబట్టి చాలా మంది వేసవిలో ప్రయాణాలు పెట్టుకుంటారు. ఏ బంధువుల ఇంటికో.. పర్యాటక ప్రాంతాలకో వెళ్లి విహరిస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com