నేటి వాణిజ్య వార్తలు౦౨/౦౪

*విద్యార్థి దశలో ప్రతి అడుగు ఎంతో అమూల్యమైనదని, సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్‌ సూచించారు.
*జీఎస్టీ రాక ముందు పన్నుల ఎగవేతకు పాల్పడిన డీలర్ల పై తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కొరడా ఝుళిపించింది. వ్యాపార లావాదేవీల రిటర్నులు దాఖలు చేసిన కొందరు డీలర్లు సంబంధిత ఆధారిత ఆస్తుల విలువ పన్నులు చెల్లించలేదు.
*నేటి బులియన్‌ మార్కెట్లో వెండి ధర బాగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.40వేల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ తగ్గడంతో నేటి ట్రేడింగ్‌లో కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.39,800కి చేరింది.
*వృద్ధిరేటును బలోపేతం చేయడం భారత్‌కు చాలా కీలకమని రేటింగ్‌ సంస్థ ఎస్‌ అండ్‌ పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మౌలికవసతుల కల్పనపై ఎంత ఖర్చుపెడతారన్న అంశమే భారత్‌ రేటింగ్‌ను నిర్ణయిస్తుందని ఎస్‌ అండ్‌ పీ సీనియర్‌ డైరెక్టర్‌ కిమ్‌ ఎంగ్‌ టన్‌ పేర్కొన్నారు. ఆదాయపన్నుపై అంచనాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు.
*సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎమ్‌ఈ) రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అభివర్ణించారు.
*భారత వినియోగదారుల కోసం సరికొత్త చిన్న కారు ‘ఫ్రీ స్టయిల్‌’ను ఫోర్డ్‌ ఇండియా ఆవిష్కరించింది. ఎస్‌యూవీ తరహాలో డిజైన్‌, అధునాతన సాంకేతికత ప్రమాణాలు, మెరుగైన ఇంధన సామర్థ్యం లాంటి ప్రత్యేకతలు దీని సొంతమని కంపెనీ పేర్కొంది.
*అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి రూ.617 కోట్ల నికర లాభాన్ని న్యూ ఇండియా అష్యూరెన్స్‌ ప్రకటించింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో రూ.24 కోట్ల నష్టాన్ని చవిచూసింది. బీమా పరిహార (క్లెయిమ్‌) చెల్లింపులు తక్కువగా ఉండటం ఈసారి లాభాలు రావడానికి తోడ్పడింది.
*యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో డీలా పడింది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎల్‌సీఎల్‌టీ)కు సిఫారసు చేసిన ఖాతాలకు కేటాయింపులు చేయాల్సి రావడంతో అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో బ్యాంకుకు రూ.1250 కోట్ల నికర నష్టం వాటిల్లింది.
*డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసికంలో ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ నికర లాభం 13 శాతం క్షీణించి రూ.131 కోట్లకు పరిమితమైంది.
*అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో జేకే సిమెంట్‌ నికర లాభం 9.76 శాతం పెరిగి రూ.72.93 కోట్లకు చేరింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో నికర లాభం రూ.66.44 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం కూడా రూ.1,083 కోట్ల నుంచి రూ.1,151 కోట్లకు పెరిగింది. రాజస్థాన్‌లోని మంగ్రోల్‌ ప్లాంటు విస్తరణ నిమిత్తం రూ.2,000 కోట్లు కేటాయించేందుకు కంపెనీ డైరెక్టర్ల సుముఖత.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com