నేటి వాణిజ్య వార్తలు-౦౨/౦౩

*టెలికాం రంగంలో ‘జియో’ సంచనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే చౌక డేటా ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న జియో.. తాజాగా డేటా వేగంలోనూ దూసుకుపోతోంది. వరుసగా 11వ నెలలోనూ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియో అగ్ర స్థానంలో నిలిచి రికార్డు సాధించింది.
*ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్‌ఎల్‌ స్పెక్ట్రమ్‌ కొనుగోలుచేయడానికి రూ.6,652 కోట్లు అవసరం అవుతాయని టెలికాం శాఖా మంత్రి మనోజ్ సిన్హా శుక్రవారం పార్లమెంటులో వెల్లడించారు.
*భవన నిర్మాణంలో వినియోగించే ఉత్పత్తులను తయారు చేయడానికి దక్షిణాదిలో కొత్తగా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ మనీశ్‌ సంఘీ తెలిపారు.
*పీసీ జువెలర్‌ మదుపరి లబోదిబోమన్నాడు. ఇంట్రాడేలో ఈ షేరు 60 శాతం పతనమైంది. అయితే ఆ తర్వాత స్వల్పంగా కోలుకొని నష్టాన్ని 25 శాతానికి పరిమితమైంది.
*తయారీ సామర్థ్యం పెంపు, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) విభాగ విస్తరణ కోసం వచ్చే అయిదేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హీరో ఎలక్ట్రిక్‌ వెల్లడించింది.
*4జీ బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో వరుసగా 11వ నెలా రిలయన్స్‌ జియోనే అగ్రస్థానంలో కొనసాగింది. గత నవంబరులో జియో డేటా డౌన్‌లోడ్‌ సగటు వేగం 25.6 ఎంబీపీఎస్‌గా నమోదైందని, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తెలిపింది.
* అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో బజాజ్‌ ఆటో ఏకీకృత నికర లాభం 3.8% పెరిగి రూ.1,013.16 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే సమయంలో నికర లాభం రూ.976.82 కోట్లుగా నమోదైంది.
*డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్‌ స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.377.14 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అగ్రగామి స్టాక్‌ ఎక్స్ఛేంజీ బీఎస్‌ఈ రూ.58.67 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి స్టాండ్‌అలోన్‌ ప్రాతిపదికన న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ రూ.1.21 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్‌)లో వాటాను జీఎంఆర్‌ గ్రూప్‌ పెంచుకోనుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com