నేటి వాణిజ్య వార్తలు-౦౨/౦౨

* అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌కు లాభాల పంట పడింది. గత త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 20 బిలియన్‌ డాలర్ల లాభం వచ్చినట్లు యాపిల్‌ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్‌ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది.
*బడ్జెట్‌పై ఎన్నో ఆశలతో.. మరెన్నో అంచనాలతో గత కొన్ని రోజులుగా మార్కెట్‌ రికార్డుల మోత మోగించింది. అయితే ఒకే ఒక్క ప్రతిపాదన మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీసింది.
*సగటు వ్యక్తి బీమా ఉంటే అనుకోనిది జరిగితే అతని కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. అందుకే ప్రైవేట్ సంస్థల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల వరకూ ప్రతి ఒక్కటీ బీమా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. బీమా అవసరాన్ని ముందే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బ్యాంక్‌ ఖాతా ఉంటే చాలు మీ భవిష్యత్‌కు భరోసాగా బీమా ఇస్తామంటూ ప్రత్యేకంగా రెండు పథకాలను అందుబాటులోకి తెచ్చింది.
*కార్పొరేట్‌ కంపెనీలకు అరుణ్‌ జైట్లీ పాక్షికంగా ఊరటనిచ్చారు. గత బడ్జెట్లో ఇచ్చిన మినహాయింపు పరిధిని పొడిగించారు. ఈ నిర్ణయంతో దేశంలోని చిన్న మధ్య తరహా కంపెనీలు లబ్ధిపొందనున్నాయి.
*కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, ఆరోగ్యం పోషకాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తన ప్రసంగంలో పేర్కొన్నారు.
*ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో పేద, మధ్యతరగతి వర్గాలకు వరాలను కురిపించింది. ఈ క్రమంలో ఉద్యోగులు, పింఛనుదారులకు తాయిలాలను ప్రకటించింది.
*రూ.250 కోట్ల వరకు టర్నోవరు ఉన్న కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 25 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) రంగానికి చెందిన 99 శాతం కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుందని జైట్లీ పేర్కొన్నారు.
*దేశంలోకి దిగుమతి అయ్యే సెల్‌ఫోన్లపై కస్టమ్స్‌ సుంకాన్ని 15 నుంచి 20 శాతానికి పెంచారు. దేశీయంగా తయారీ-బిగింపు (అసెంబ్లింగ్‌)ను ప్రోత్సహించేందుకే ఈ చర్య తీసుకున్నారు. ఇందువల్ల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.
*దేశంలో విమాన ప్రయాణాలు శరవేగంగా పెరుగుతున్నందున, అందుకనుగుణంగా విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. చిన్న నగరాలకు విమానాలు నిర్వహించేందుకు అమలు చేస్తున్న ప్రాంతీయ విమానయాన పథకం (ఉడాన్‌) కింద 56 విమానాశ్రయాలను, 31 హెలిప్యాడ్లను వినియోగంలోకి తేనున్నట్లు ప్రకటించారు. వీటిల్లో 16 విమానాశ్రయాల్లో ఇప్పటికే రాకపోకలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
*వ్యవసాయ దిగుబడులు వృథా అవ్వకుండా పరిరక్షించడంతో పాటు రైతు ఆదాయం పెంచాలంటే ఆహార తయారీ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) రంగాన్ని బలోపేతం చేయడం ప్రధాన మార్గం.
*ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా మూడు సాధారణ బీమా సంస్థలను ఒక్కటిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
*వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) ఆ దిశగా పయనిస్తుందని మరిన్ని ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌)లను తీసుకొస్తుందని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు.
*వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2018-19) ముద్రా యోజన కింద రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెటో ప్రతిపాదించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com