నేటి వాణిజ్య వార్తలు-౦౨/౧౫

*మొండి బకాయిల సమస్యను వేగంగా పరిష్కరించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నిబంధనలను కఠినతరం చేసిందని.. ఇది ఎగవేతదార్లకు ఒక ప్రమాదఘంటికగా పనిచేయగలదని ప్రభుత్వం పేర్కొంది.
*నేడు స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై వెంటనే నష్టాల్లోకి వెళ్లాయి. నిన్న శివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లకు సెలవు కాగా నేడు తిరిగి ప్రారంభమయ్యాయి.
*శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సిగలో మరో పురస్కారం చేరింది. పౌర విమానయాన రంగంలో నాణ్యమైన రవాణా సేవలు, సామాజిక బాధ్యత తదితర అంశాల్లో జీఎమ్‌ఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)కు ‘గోల్డెన్‌ పికాక్‌ అవార్డు 2017’ దక్కింది.
* శివరాత్రి రోజున సీఎం చంద్రబాబుతో పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ సమావేశం జరగడం రాష్ట్రానికి శుభపరిణామమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత అంబానీ చంద్రబాబు భేటీకి సంబంధించిన పలు అంశాలను ఆయన మీడియాకు వివరించారు.
*దేశీయ బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) వాటికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది.
*హర్లే డేవిడ్సన్‌, ట్రయంఫ్‌ లాంటి లగ్జరీ ద్విచక్రవాహనాల ధరలు తగ్గనున్నాయి. వీటిపై ఉన్న కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
*మొండి బకాయిల సమస్య ఇంకా సమసి పోలేదని జాగ్రత్తగా ఉండాల్సిందేనని రేటింగ్‌ ఏజెన్సీ కేర్‌ హెచ్చరిస్తోంది. బ్యాంకులు ఇటీవలి కాలంలో దివాలా చట్టం ద్వారా నిరర్థక ఆస్తుల విషయంలో గట్టి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలోనూ కేర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
*జియో ఫోన్‌ వినియోగదారులకు శుభవార్త. నేటి నుంచి జియో ఫోన్లలో ఫేస్‌బుక్‌ అందుబాటులోకి రానుంది. జియో యాప్‌ స్టోర్‌ ద్వారా హ్యాండ్‌సెట్లలో ఫేస్‌బుక్‌ను పరిచయం చేస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
*విదేశాల నుంచి దిగుమతి అవుతున్న హార్లే డేవిడ్‌సన్‌, ట్రయంఫ్‌ సహా ఇతర హైఎండ్‌ బైక్‌ల ధరలు తగ్గనున్నాయి. పూర్తిగా తయారై, దిగుమతి చేసుకునే ఈ బైక్‌లపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని 50 శాతానికి పరిమితం చేయడమే ఇందుకు కారణం.
* దేశంలో సంపన్నుల సంఖ్య 12 శాతం పెరిగినా, అందరి సంపద వృద్ధి 5 శాతమేనని ఒక నివేదిక వెల్లడించింది. సంపద పంపిణీ సక్రమంగా జరగడం లేదని, సమాజంలో పేద-ధనిక తారతమ్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, 2017లో ప్రపంచ, దేశ పరిస్థితులపై కోటక్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక రూపొందించింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్థిరాస్తి సంస్థ డీఎల్‌ఎఫ్‌ రూ.4091.27 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2016-17 ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.98.14 కోట్లతో పోలిస్తే, ఇది 42 రెట్లు అధికం.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఎన్‌ఎండీసీ రూ.886.53 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం నికర లాభం రూ.595.16 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది.
*గత మూడేళ్లలో సామాజిక బాధ్యత కింద కంపెనీలు చేసే వ్యయం గణనీయంగా పెరిగిందని.. ప్రయోగాత్మకంగా దేశంలో అమలులోకి తీసుకువచ్చిన కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) చట్టం, 135 సెక్షన్‌ ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ (ఐఐసీఏ) మాజీ డైరెక్టర్‌ జనరల్‌, సీఈఓ భాస్కర్‌ ఛటర్జీ తెలిపారు.
*ప్రపంచవ్యాప్తంగా అత్యంత నైతిక విలువలు కలిగిన సంస్థల జాబితాలో భారత్‌ నుంచి రెండు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థ విప్రోతో పాటు టాటాస్టీల్‌ కూడా అత్యంత నైతిక విలువలు కల్గిన సంస్థలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com