నేటి వాణిజ్య వార్తలు-౦౨/౧౨

*భారత్‌లో ఎలక్ర్టిక్‌ వాహనాల మార్కెట్‌ 2020 నాటికి రెండంకెల సంఖ్యకు చేరనుందని, టెలిమ్యాటిక్స్‌ మార్కెట్‌ కూడా వేగంగా వృద్ధి చేందేలా సంకేతాలు కనిపిస్తున్నాయని అసోచామ్‌ తన నివేదికలో వెల్లడించింది.
*దేశంలో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. బీమా నియంత్రణ మండలి, బీమా సంస్థలు పంటల బీమాపై దృష్టి సారించి, వ్యవసాయ రంగ వృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
*గత ఆర్థిక సంవత్సరంలో (2016-17) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.20,339 కోట్ల విలువైన మొండి బకాయిలను సాంకేతికంగా రద్దు (రైటాఫ్‌) చేసింది.
*కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేసినప్పటినుంచి పన్ను చెల్లింపుదారులు, చిన్న వ్యాపారులకు రిటర్నులు ఎలా దాఖలు చేయాలనే విషయంలో అనేక సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి.
*టాటామోటార్స్‌కు చెందిన స్పోర్ట్స్‌ కార్‌ రేస్‌మో ఆటో ఎక్స్‌పో 2018లో వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. 2017 జెనీవా ఆటోషోలో తొలిసారి దీనిని ప్రదర్శించారు. కానీ, 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శిస్తున్న రేస్‌మో 003 మోడల్‌కు ఒక ప్రత్యేకత ఉంది.
* ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఊగిసలాటకు గురవుతున్న ఈక్విటీ, ఇతర మార్కెట్‌ల గురించి బెంగపడాల్సిన అవసరం లేదని ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టియన్‌ లగార్డే వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వృద్దిరేటు బలంగా ఉంది, అలాగే ద్రవ్యపరపతి పుష్కలంగా ఉందటూ ఆమె పేర్కొన్నారు.
*అంతర్జాతీయ సంకేతాలతో పాటు పారిశ్రామికోత్పత్తి – ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి.
*అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతల ప్రభావంతో గతవారం మన మార్కెట్‌ భారీ నష్టాలను మూటకట్టుకుంది. దిగ్గజ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైనప్పటికీ.. మధ్య, చిన్న తరహా సంస్థల షేర్లకు దేశీయ సంస్థాగత మదుపర్ల (డీఐఐలు) నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది.
*గత ఏడాదితో పోలిస్తే 2018లో కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు మెరుగ్గా ఉంటాయని, 10-15% పెరగొచ్చని ఇండియా స్కిల్స్‌ నివేదిక పేర్కొంది.
*గత ఆర్థిక సంవత్సరంలో (2016-17) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.20,339 కోట్ల విలువైన మొండి బకాయిలను సాంకేతికంగా రద్దు (రైటాఫ్‌) చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com