నేటి వాణిజ్య వార్తలు-౦౪/౦౩

*బ్యాంకుల నిరర్థక ఆస్తులు అంతకంతకు పెరగనున్నాయని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. అదే సమయంలో బ్యాంకర్లపై కొనసాగుతున్న దర్యాప్తుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి కుంటుపడవచ్చని అంటోంది.
* నాస్కామ్‌ అధ్యక్షురాలిగా దేవయాని ఘోష్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈమె గతంలో ఇంటెల్‌ అధికారిగా పని చేశారు. ఆర్‌.చంద్రశేఖరన్‌ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో దేవయానిని అధ్యక్షురాలిగా నియమించినట్లు నాస్కామ్‌ వెల్లడించింది.
*2017-18లో ప్రత్యక్ష(ఆదాయ పన్ను) వసూళ్లు బడ్జెట్‌ లక్ష్యమైన రూ.9.8 లక్షల కోట్లను అధిగమించి.. రూ.9.95 లక్షలుగా నమోదయ్యాయి. ఒక కోటి మంది కొత్త పన్ను చెల్లింపుదార్లు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడం ఇందుకు దోహదం చేసింది.
* ఇ-వేబిల్లు విధానం అమలు ప్రక్రియ విజయవంతం అయ్యిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని స్పష్టం చేసింది.
*స్మార్ట్ ఫోన్లలో ప్రధాన విడిభాగాలైన కెమెరా మాడ్యుల్‌, ప్రింటెండ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ అసెంబ్లీ, కనెక్టర్లపై 10 శాతం దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
*2017-18లో రూ.1200 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు సింగరేణి సంస్థ తెలిపింది. సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 6.46 కోట్ల టన్నుల బొగ్గును రవాణా చేయడం వల్ల వ్యాపార టర్నోవర్‌ పెరిగినట్లు వెల్లడించింది.
*యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా మరోసారి శిఖా శర్మను నియమించే నిర్ణయాన్ని పునః పరిశీలించాలని బోర్డును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కోరింది.
* ఎనిమిది కీలక రంగాలు (బొగ్గు, ముడిచమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్తు) రాణించాయి. ఫిబ్రవరిలో ఈ రంగాల వృద్ధి 5.3 శాతం నమోదైంది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్‌ ఉత్పత్తులు భారీగా పుంజుకోవడం ఇందుకు దోహదపడింది.
*తొలి విడత ఆఫర్‌లో భారత్‌ 22 ఈటీఎఫ్‌ మార్కెట్లో విజయవంతంగా దూసుకెళ్లింది. ఇప్పుడు మలి విడత ఆఫర్‌కు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
*వినియోగ ఎలక్రానిక్స్‌, కంప్యూటర్లు, రక్షణ వ్యవస్థలు తదితర పరిశ్రమలో వినియోగించే రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ (ఆర్‌ఈఈ) అన్వేషణ, ఉత్పత్తికి ఎన్‌ఎండీసీ, ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ (ఐఆర్‌ఈఎల్‌)లు చేతులు కలిపాయి.
*దివాలాలో ఉన్న ఎస్సార్‌ స్టీల్‌ను రెండో దశ వేలంలో కొనుగోలు చేయడం కోసం యార్సెలర్‌ మిత్తల్‌, వేదాంతా, న్యూమెటల్‌-జేఎస్‌డబ్ల్యూలు బిడ్‌లు దాఖలు చేశాయి. తొలి దశలో న్యూమెటల్‌, యార్సెలర్‌మిత్తల్‌లు మాత్రమే బిడ్‌లు వేశాయి.
*అమెరికా నుంచి దిగుమతి అయ్యే 128 ఉత్పత్తులపై చైనా కొత్త సుంకాలను విధించింది. వీటి విలువ 3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. చైనా ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై గత వారంలో అమల్లోకి వచ్చిన కొత్త అమెరికా సుంకాలకు ప్రతిగా సోమవారం చైనా ఈ నిర్ణయం తీసుకుంది.
*వైస్రాయ్‌ హోటల్స్‌ కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ఇటీ©వల ఉత్తర్వులు జారీ చేసింది. పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ బకాయి 2017 ఆగస్టు 22నాటికి 321.78 కోట్లకు చేరుకుంది.
*మూడు స్కూటర్‌ మోడళ్లు ఏవియేటర్‌, యాక్టివా 125, గ్రేజియా మోడళ్లకు చెందిన 56,194 వాహనాలను హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) వెనక్కు పిలిపించనుంది.
*తమ ఖాతాదారుల సొమ్ము సురక్షితమని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) హామీ ఇచ్చింది. అలాగే బ్యాంకులో ఎలాంటి అనైతిక కార్యకలాపాలను సహించేది లేదని స్పష్టం చేసింది.
* గత నాలుగైదేళ్లలో టాటా మోటార్స్‌ తన మార్కెట్‌ వాటాను కోల్పోవడం.. దేశం దాన్ని ‘ఒక వైఫల్య కంపెనీ’గా చూడడం తనను బాధించిందని టాటా మోటార్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా పేర్కొన్నారు.
*మార్చిలో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మొత్తం విక్రయాలు 60,507 వాహనాలుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ అమ్మిన 55,614 వాహనాలతో పోలిస్తే ఇది 8.8 శాతం అధికం. దేశీయ విక్రయాలు 44,757 నుంచి 7.3 శాతం అధికమై 48,009కు చేరాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com