నేటి వాణిజ్య వార్తలు-౧౧/౨౬

* రతన్‌ టాటా డ్రీమ్‌ కార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నానో మార్కెట్‌నుంచి తెరమరుగు కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లలో మెజారిటీదారులు.. నానో బుకింగ్స్‌ నిలిపేసినట్లు తెలుస్తోంది. ఆరంభంలోనే అంతంతమాత్రంగా ఉన్న బుకింగ్స్‌.. గత నాలుగు నెలలుగా మరింత తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని డీలర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గుజరాత్‌లోని సనంద్‌ ప్లాంట్‌లోనూ నానో కార్ల ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో నానో కార్ల ఉత్పత్తి 180 ఉండగా.. అక్టోబర్‌ నాటికి దీనిని 5కు తగ్గించారు.టాటా నానో కార్‌ను ప్రకటించిన సమయంలో కేవలం లక్ష రూపాయలకే సామాన్యుడికి కారు అందిస్తున్నట్లు రతన్‌ టాటా 2008లో ప్రకటించారు. తరువాత అనేక వివాదాలు, సమస్యలు, ప్లాంట్‌ తరలింపు, ఇతర కారణాల వల్ల దీని ధర మారుతూ వచ్చింది. ప్రస్తుతం నానో ధర.. రూ.2.69 లక్షలుగా ఉంది. ప్రస్తుతం టాటా మోటార్స్‌కు నానో మోడల్‌ ఒక వైట్‌ ఎలిఫెంట్‌లా మారింది.
*తగ్గించిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్లను వినియోగదారులకు బదలాయించని పెద్ద కంపెనీలపై చర్యలు తప్పవని ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్‌ అధియా హెచ్చరించారు. ‘పెద్ద వస్తువులపై పన్ను రేట్లను తగ్గించాం. వాటిని బదలాయించకుంటే చిన్న విక్రేతలను పట్టించుకోం. పెద్ద కంపెనీలను పట్టుకుంటాం’ అని అధియా వెల్లడించారు. వ్యవస్థను శుద్ధి చేసేందుకు పెద్ద నోట్లను రద్దు చేశామని, నల్లధన నిర్మూలనకు సైతం దోహదపడిందని అన్నారు. అధిక శాతం నగదు ఇళ్లలో ఉండేదని, నోట్ల రద్దుతో మొత్తం సొమ్ము బ్యాంకింగ్‌లోకి వచ్చిందని.. తద్వారా ప్రజలకు రుణాలు ఇచ్చేందుకు ఆస్కారం ఏర్పడిందని తెలిపారు.
*ఐటీ ఉద్యోగులకు వారానికి 5 రోజులే పని, పైగా ఇంటి దగ్గర నుంచి (వర్క్‌ ఫ్రం హోం) కూడా ఆడుతూ పాడుతూ పని పూర్తి చేసుకోవచ్చు..’ అనే భావన అధికుల్లో ఉంటుంది. అయితే ఐటీ కంపెనీలు కొత్తగా అమల్లోకి తెస్తున్న నిబంధనలతో.. ఇంటి దగ్గర కంటే, కార్యాలయానికి వెళ్తేనే హాయి అనే పరిస్థితికి ఐటీ ఉద్యోగులొస్తున్నారు.
*డెరివేటివ్స్‌ అంటే.. ఏదైనా ఒక ఆస్తి(ద్రవ్య రూపంలో ఉండే సాధనం) లో అంతర్లీనంగా ఉన్న విలువను రాబట్టుకునేవి. ఆ అంతర్లీనంగా ఉన్న ఆస్తి ఒక షేరు కావొచ్చు. కరెన్సీ కావొచ్చు.. లేదా బంగారం కావొచ్చు.. లేదా మరేదైనా ఆస్తి కావొచ్చు. డెరివేటివ్స్‌ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యేవి. మరొకటి ‘ఓవర్‌ ద కౌంటర్‌’(ఓటీసీ)లో జరిగేవి. మొదటి రకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్ఛేంజీల్లో జరుగుతూనే ఉంటాయి. ఇక ఓటీసీలకు మాత్రం ప్రమాణాలంటూ ఉండవు. అవి ఎక్స్ఛేంజీల ద్వారా జరగవు కూడా. భారత్‌లో వాటికి పెద్ద ప్రాముఖ్యతా లేదు.
*పెద్ద నోట్ల రద్దు తర్వాత దాచుకున్న నగదును లక్షలాది మంది బ్యాంకుల్లోకి జమ చేశారు. ప్రభుత్వ అనుమతించిన గరిష్ఠ పరిమితి రూ.2 లక్షలు కాగా.. అంతకంటే ఎక్కువ మొత్తం చేసిన జమపై 30 శాతం పన్ను చెల్లించారు. అనంతరం సవరించిన ఐటీ రిటర్న్‌లను దాఖలు చేశారు. ఇదంతా నగదును తరలించడానికి సులభమైన మార్గంగా కొందరు భావించారు.
*మెట్రో రైలు ప్రయాణ చార్జీలు ఖరారు అయ్యాయి. కనీస చార్జి రూ. పది రూపాయల గరిష్టంగా అరవైగా నిర్ణయించారు.
*టమాటా ధరలను తగ్గించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com