నేటి వాణిజ్య వార్తలు -05/18

*నిరర్థక ఆస్తులు, మోసపూరిత లావాదేవీలతో ఇబ్బంది పడుతున్న బ్యాంకింగ్‌ రంగాన్ని గాడిన పెట్టేందుకు సత్వర చర్యలు చేపడతామని, ఆర్థిక మంత్రి పీయుశ్‌ గోయెల్‌ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యున్నత ప్రమాణాల్లో నైతికతతో వ్యవహరిస్తూ, బాధ్యతాయుత విధి నిర్వహణ చేపట్టేలా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
*అయిదు నక్షత్రాలు, అత్యధిక రేటింగ్‌ కలిగిన రెస్టారెంట్లలో ఆఫర్ల ద్వారా తక్కువ ధరకు ఆహారాన్ని, పానీయాలను కొనుగోలు చేయడానికి వీలు కల్పించే గౌర్‌మెట్‌ పాస్‌పోర్ట్‌ యాప్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ యాప్‌లో సభ్యులుగా చేరిన వారికి ఆహారం, పానీయాలపై ఒకటి కొంటే ఒకటి ఉచితం వంటి ఆఫర్లు ఉంటాయని గౌర్‌మెట్‌ పాస్ట్‌పోర్ట్‌ వ్యవస్థాపకుడు రాకీ మోహన్‌ తెలిపారు.
*ప్రజలందరికీ అవసరమైన సిమెంటుపై 28శాతం జీఎస్‌టీ విధించడం, పెట్‌ కోక్‌, బొగ్గు ధరలు 25-30శాతం వరకూ పెరగడంతో వినియోగదారులపై భారం పడుతోందని గ్రీన్‌ సిమెంట్‌టెక్‌ 2018 ఛైర్మన్‌, ఏసీసీ చీఫ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫీసర్‌ ఫిలిప్‌ మాథ్యూ అన్నారు.
*దేశ జనాభాలో 50 శాతం మంది 2050 నాటికి పట్టణాలు, నగరాల్లోనే ఉంటారని, ఇందుకనుగుణంగా నివాస సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) లో రూ.13,000 కోట్ల మోసపూరిత లావాదేవీలకు సంబంధించి నిందితుడైన మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్‌ నుంచి రూ.85 కోట్ల విలువైన 34,000 ఆభరణాలను ఆభరణాలు సీజ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రకటించింది.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎస్కార్ట్స్‌ రూ.112.54 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.59.48 కోట్ల నికర లాభం ఆర్జించింది.
*ప్రవేశ పరీక్షల శిక్షణా కేంద్రాలు అందించే సేవలకు 18% జీఎస్‌టీ వర్తిస్తుంది. శిక్షణా కేంద్రాల సేవలు జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయా అంటూ దాఖలైన దరఖాస్తుపై అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌ (ఏఏఆర్‌) పైవిధంగా స్పష్టతను ఇచ్చింది.
*రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఈసారి మూడు రోజుల పాటు జరగనుంది.
*ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్‌ స్కూళ్లు అందిస్తున్న అత్యుత్తమ ఎంబీఏ (ఫర్‌ ఫైనాన్స్‌) విద్యలో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 44 స్థానంలో నిలిచింది.
*అయిదు నక్షత్రాలు, అత్యధిక రేటింగ్‌ కలిగిన రెస్టారెంట్లలో ఆఫర్ల ద్వారా తక్కువ ధరకు ఆహారాన్ని, పానీయాలను కొనుగోలు చేయడానికి వీలు కల్పించే గౌర్‌మెట్‌ పాస్‌పోర్ట్‌ యాప్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు.
* చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల కంపెనీ వన్‌ప్లస్‌ తన నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ ప్లస్‌ 6ను ఈరోజు భారత్‌లో విడుదల చేసింది. బుధవారం లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వన్‌ ప్లస్‌ 6ను లాంచ్‌ చేయగా, నేడు భారత్‌లోనూ విడుదల చేసింది.
* బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌(బీఓఈ)కు వెళ్లే ఉద్దేశం తనకు లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. బీఓఈ గవర్నర్‌ పదవికి దరఖాస్తు చేసుకోవట్లేదని చెప్పారు. ఈ మేరకు లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజన్‌ వెల్లడించారు.
*ఆర్థిక సంవత్సరంలో ప్రతి రెండు నెలలకోసారి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష చేపడుతుంది. ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లు, భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటారు. సాధారణంగా రెండు రోజుల పాటు ఈ సమీక్ష జరుగుతుంది. అయితే జూన్‌లో జరిగే సమీక్షను మూడు రోజుల పాటు నిర్వహించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com