నేటి వాణిజ్య వార్తలు -06/05

*ఆహార తయారీ రంగంలో గత నాలుగేళ్లలో 3.85 లక్షల ఉద్యోగాలు లభించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి మరో 4 లక్షల కొత్త ఉద్యోగాలు ఈ రంగంలో లభిస్తాయని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తెలిపారు. ‘కొత్తగా 15 మెగా ఫుడ్‌ పార్క్‌ల్లో కార్యకలాపాలు మొదలయ్యాయి.
* ఐడీబీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ) ఎమ్‌కే జైన్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ప్రభుత్వం నియమించింది.
*తక్కువ ధర స్మార్ట్‌ఫోన్లను అందించే చైనా సంస్థ కొమిమో కొత్తగా ‘ఎక్స్‌ 1 నోట్‌’ను విడుదల చేసింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సినీనటి ప్రణీత ఈ ఫోనును విడుదల చేశారు.
* ఎంపిక చేసిన మార్గాల్లో తక్కువ ధరకే టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు ట్రూజెట్‌ ప్రకటించింది. జూన్‌ 9 వరకు ఈ టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.
*విశాఖపట్నంలో ఎగుమతుల తనిఖీ సంస్థ కార్యాలయం, లేబొరేటరీ కాంప్లెక్స్‌ నిర్మాణం సహా 15 ప్రాజెక్టుల ఏర్పాటుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24 లోతైన బావుల (డీప్‌ వాటర్‌ వెల్స్‌)పై ఓఎన్‌జీసీ 2.4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.16000 కోట్లు)కు పైగా వెచ్చించడానికి సన్నాహాలు చేస్తోంది.
*వ్యర్థ పదార్థాల నిర్వహణ సంస్థ రాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌లో అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ సంస్థ కేకేఆర్‌ వాటా సొంతం చేసుకోనుంది.
*మ్యూచువల్‌ ఫండ్‌ల వైపు మరింత మంది ఆకర్షితులయ్యేందుకు ఫండ్‌ సంస్థలు విధిస్తున్న ‘అదనపు రుసుము’ను 5 బేసిస్‌ పాయింట్లకు (0.05%) సెబీ తగ్గించింది. ఇంతకుముందు ఇది 20 బేసిస్‌ పాయింట్లు (0.20%)గా ఉంది. ఫండ్‌ పథకాల్లో పెట్టుబడులపై ఖర్చు తగ్గేందుకు తాజా పరిణామం దోహదం చేస్తుంది.
*ప్రస్తుత నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎం.కె. శర్మ పదవీ కాలం జూన్‌ 30న ముగియనున్న నేపథ్యంలో, ఐసీఐసీఐ బ్యాంక్‌ కొత్త ఛైర్మన్‌ నియామక ప్రక్రియను ప్రారంభించింది.
* సంప్రదాయేతర ఇంధన విద్యుత్తు ఉత్పత్తి సంస్థ గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్‌, సింగపూర్‌కు చెందిన ఆరంజ్‌ రెన్యూవబుల్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.
*ఎయిరిండియా కొనుగోలు బిడ్డింగ్‌ ఆకర్షణీయం కావాలంటే, 100 శాతం వాటా విక్రయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ సెంటర్‌ ఫర్‌ ఏషియా- పసిఫిక్‌ ఏవియేషన్‌ (కాపా) సూచించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com