నేటి వాణిజ్య వార్తలు-06/06

* గత కొద్ది రోజుల్లో అవంతీ ఫీడ్స్‌ షేరు ధర బాగా క్షీణించింది. దాదాపు నెల రోజుల క్రితం (మే 2 తేదీ) ఈ కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో రూ.2,415.35 ఉంటే..మంగళవారం ముగింపు (జూన్‌ 5) రూ.1,353.70 ఉంది. అంటే 44 శాతం క్షీణించింది.
*విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ అంకుర సంస్థ అథెర్‌ ఎనర్జీ విద్యుత్‌ స్కూటర్‌ ఎథెర్‌ 450ని మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.1.24 లక్షలు. అథెర్‌ 340ని కూడా రూ.1.09 లక్షలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అథెర్‌ 450ని నగర పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దారు.
*విమానాశ్రయాల ప్రైవేటీకరణ వల్ల ప్రయాణికులపై అదనపు భారం పడటం సరి కాదని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) అభిప్రాయడుతోంది. ప్రజాధనం వృథా కాకుండా ఉండేందుకు అంతర్జాతీయంగా ఓ విధానాన్ని తీసుకొచ్చేందుకు సంఘం ప్రయత్నిస్తోంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు నిరర్థక ఆస్తులు మరికొంత పెరిగే అవకాశం ఉందని ఇక్రా నివేదిక అంచనా వేస్తోంది. దేశీయ బ్యాంకింగ్‌ రంగ స్థూల నిరర్థక ఆస్తులు 2017-18లో 11.2 శాతం కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 11.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
* విప్రో సంస్థ తమ ఉద్యోగులకు జూన్‌ 1 నుంచి వేతనాలు పెంచింది. దేశీయంగా విధులు నిర్వర్తిస్తున్న వారికి (ఆఫ్‌షోర్‌ ఉద్యోగులు) అధికంగా, ఇతర దేశాల్లో (ఆన్‌సైట్‌ ఉద్యోగులు) ఖాతాదారుల (క్లయింట్స్‌) ప్రాంగణాల్లో పని చేసే వారికి తక్కువగా వేతనాలు పెంచింది.
*ఎయిర్‌టెల్‌ అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్‌, ఫిక్స్‌డ్‌ లైన్‌, పోస్ట్‌పెయిడ్‌ మొబైల్‌, డిజిటల్‌ టీవీ తదితర సేవల్ని వినియోగించే ఖాతాదారులకు శుభవార్త. ఒకే వ్యక్తి పేరిట ఈ బిల్లులన్నీ ఉంటే, ఒకే బిల్లుగా చెల్లించవచ్చు.
*వాట్సాప్‌ ద్వారా ముందే ఆర్థిక ఫలితాలు విడుదలైన ఘటనలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో చర్యలు చేపట్టనుంది. డజనుకు పైగా బ్లూచిప్‌ కంపెనీలకు చెందిన సీనియర్‌ ఉద్యోగులు, కొందరు మార్కెట్‌ ఆపరేటర్లపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
* పర్యావరణానికి హాని చేయని కీటక నియంత్రణ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సంయుక్త సంస్థ ఏర్పాటు చేయడానికి ఎన్‌ఏసీఎల్‌ (గతంలో నాగార్జునా అగ్రికెమ్‌), హైదరాబాద్‌కే చెందిన ఏటీజీసీ బయోటెక్‌లు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
*వ్యాపార కార్యకలాపాల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గిస్తామని పర్యావరణ దినోత్సవం రోజున ఐటీసీ, ఆర్‌బీ, పెప్సీకో, నెస్లే, హ్యుందాయ్‌ లాంటి దిగ్గజ కంపెనీలు ప్రతిన పూనాయి. ప్లాస్టిక్‌ పునర్వినియోగాన్ని (రీసైక్లింగ్‌) పెంచుతామని, ప్యాకింగ్‌ కోసం ప్రత్యామ్నాయ, పర్యావరహణహిత ఉత్పత్తులను అన్వేషిస్తామని తెలిపాయి.
*భారత సేవా రంగ ప్రగతి నెమ్మదించింది. గత మూడు నెలల్లో తొలిసారి క్షీణత బాట పట్టింది. కొత్త వ్యాపార ఆర్డర్లలో స్తబ్దత, అధిక చమురు ధరల నేపథ్యంలో వ్యయ భారం తీవ్రమవడం లాంటివి ఇందుకు కారణమయ్యాయి. నిక్కీ భారత సేవల వ్యాపార కార్యకలాపాల సూచీ మేలో 49.6 పాయింట్లకు దిగివచ్చింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com