నేటి వాణిజ్య వార్తలు-06/11

* హెచ్‌ఎంటీ, ఆండ్రూ యూలే సహా ఖాయిలా పడ్డ అయిదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈలు) షేర్లను ప్రత్యేక జాతీయ పెట్టుబడి సంస్థ (ఎస్‌ఎన్‌ఐఎఫ్‌)కు తరలించేందుకు ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది.
*వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణం మంజూరు చేయడంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచ్చర్‌, ఆమె కుటుంబ సభ్యులపై దేశీయంగా పలు సంస్థలు దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. అమెరికాలో కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌ నమోదైనందున, ఈ కేసును అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌ (సెక్‌) పరిశీలిస్తోందని సమాచారం.
*రుణ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌ విభాగం సిద్ధమవుతోంది. దీనికోసం వచ్చే నెలలో సెబీకి ప్రతిపాదనలు పంపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
*విద్యార్థి దశలోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా నిరూపించుకోవాలనుకునే వారికోసం టై-హైదరాబాద్‌ నిర్వహించిన పోటీలో ‘మైఫో’ విజయం సాధించింది.
*స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్‌ దిగ్గజం ఐకియా భారత్‌లో తన తొలి విక్రయ కేంద్రాన్ని జులై 10న ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ‘ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సంస్థ సీఈఓ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఐకియా దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ఉద్యోగాలు వస్తాయని’ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com