నేటి వాణిజ్య వార్తలు -07/06

*మీరు బిట్‌కాయిన్‌ లేదా ఇతర ఏ క్రిప్టోకరెన్సీలోనైనా పెట్టుబడులు పెట్టారా? అయితే త్వరపడండి.. లేదంటే మరికొన్ని గంటల్లో మీరు మీ పెట్టుబడులను కోల్పోవలసి వస్తుంది. ఎందుకంటే.. బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ కార్యకలాపాలను నిలిపివేయాలని ఎక్స్ఛేంజీలకు, సంస్థలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. అందుకే బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టి ఉంటే వెంటనే వాటిని మార్చుకోవాల్సిందిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* సౌదీలో నిరుద్యోగం 12.9 శాతానికి చేరుకుంది. గతంతో పోలిస్తే పతాక స్థాయికి చేరుకుంది.గత కొంత కాలంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పతనమవడంతో ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా సౌదీ ప్రభుత్వంపై కొంత భారం పెరగడంతో బడ్జెట్‌ లోటు ఏర్పడింది.
*రిలయన్స్‌ 41వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఓ ప్రత్యేక అతిథి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మరెవరో కాదు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి కాబోయే కోడలు శ్లోకా మెహతా. సమావేశానికి హాజరైన వారిలో కోకిలాబెన్‌ అంబానీ పక్కన శ్లోకా కూర్చొని కనిపించారు.
*ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఇ-కామర్స్‌ మార్కెట్లోనూ వాటా పొందాలనే ఉద్దేశంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అడుగులు వేస్తోంది. అందుకుతగ్గట్లుగా గురువారం నాటి ఏజీఎమ్‌లో ఓ హైబ్రిడ్‌ ఫ్లాట్‌ఫాంను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా చిన్న రిటైల్‌ సంస్థలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలన్నది కంపెనీ ఉద్దేశం.
*డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ దివాలా పరిష్కార ప్రక్రియ వ్యవహారంలో తమను హామీ రుణదాతగా పరిగణించేలా దివాలా పరిష్కార ప్రక్రియ నిపుణులు (ఆర్‌పీ) ఆదేశించాలని కోరుతూ గురువారం మరో రెండు కంపెనీలు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశాయి.
*బైక్‌/స్కూటర్‌ లేదా కారు.. ఏది కొనాలన్నా మొబైల్‌లో వాటి వివరాలు పరిశీలించుకున్నాకే ముందుకెళ్తారట.. 2022 నాటికి కారు కొనుగోళ్లలో 81 శాతం మంది, ద్విచక్ర వాహనాల కొనుగోలుదార్లలో 68 శాతం మందిపై డిజిటల్‌ మార్కెటింగ్‌, ముఖ్యంగా మొబైల్‌లో ప్రచారం అమిత ప్రభావం చూపుతుందని ఫేస్‌బుక్‌, కేపీఎంజీ నివేదిక అంచనా వేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com