నేటి వాణిజ్య వార్తలు-07/06

*తెలుగు రాష్ట్రాల్లో గొలుసుకట్టు రిటైల్‌ విక్రయ కేంద్రాల ద్వారా మొబైల్‌ ఫోన్లను విక్రయిస్తున్న బిగ్‌ సి పొరుగు రాష్ట్రాలకు విక్రయ కేంద్రాలను విస్తరించనుంది.
*జీఎంఆర్‌-మెగవిడే కన్సార్టియం అభివృద్ధి చేసిన మెక్‌టన్‌ సెబు అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్‌ నేడు ప్రారంభం కానుంది. ఫిలిప్పీన్స్‌ ప్రెసిడెంట్‌ రోడ్రిగో డుటెర్ట్‌ దీన్ని ప్రారంభించనున్నారని జీఎంఆర్‌ గ్రూప్‌ వర్గాలు తెలిపాయి. జూన్‌ 7 రెండు టెర్మినల్‌ను ప్రారంభిస్తారని, జులై ఒకటి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని వివరించారు.
*క్యాపిటల్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు, తమ ఆధార్‌ వివరాలు జతచేసేందుకు గడువును మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింత పెంచింది. ఆర్థిక కార్యకలాపాలకు ఆధార్‌ను అనుసంధానించడంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు, మదుపర్లు తమ వివరాలు జత చేసుకునేందుకు సమయం ఇచ్చింది.
*దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారి అదనపు బ్యాగేజీ చార్జీలను పెంచుతున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఒక టికెట్‌పై అనుమతించిన బరువు కంటే అదనంగా తీసుకెళ్లేందుకు ప్రస్తుతం కిలోకు రూ.400 వసూలు చేస్తుండగా, రూ.100 పెంచి రూ.500 చేస్తున్నట్లు తెలిపింది.
*దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారి అదనపు బ్యాగేజీ చార్జీలను పెంచుతున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఒక టికెట్‌పై అనుమతించిన బరువు కంటే అదనంగా తీసుకెళ్లేందుకు ప్రస్తుతం కిలోకు రూ.400 వసూలు చేస్తుండగా, రూ.100 పెంచి రూ.500 చేస్తున్నట్లు తెలిపింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం మేర వృద్ధి చెందొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20)లో 7.5 శాతం మేర ముందుకెళ్లొచ్చని అభిప్రాయపడింది. భారత వృద్ధికి ప్రతిబంధకంగా మారిన కారకాలు వెనక్కి వెళ్లాయని పేర్కొంది.
*ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాశ్‌, రోజీ బ్లూ డైమండ్స్‌ అధినేత రసెల్ మెహతా- మోనాల కుమార్తె శ్లోకా మెహతాల నిశ్చితార్థానికి రంగం సిద్ధమైంది. ఈనెల 30న ముకేశ్‌ నివాసం యాంటెలా ఇందుకు వేదికైంది.
*వేసవి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం, ఆయా విమానాల ఆక్యుపెన్సీ రేటును పెంచుకోవడానికి దేశీయ విమాన సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల్ని ఆకర్షిచేందుకు ఎయిర్‌ఏషియా, గో ఎయిర్‌, విస్తారా వంటి దేశీయ విమానయాన సంస్థలు భారీ ఆఫర్లతో ముందుకు వచ్చాయి.
*ఎన్‌పీఏలను తగ్గించుకునేందుకు దేశీయ బ్యాకింగ్‌ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా రూ.1300 కోట్ల విలువైన ఎన్‌పీఏల విక్రయానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విక్రయాల్లో స్టీల్‌, టెక్స్‌టైల్‌ రంగానికి చెందిన ఎన్‌పీఏలు ఉన్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com