నేటి వాణిజ్య వార్తలు -07/09

*ఇండిగో, గోఎయిర్‌ విమానయాన సంస్థలు చెరో నాలుగు చొప్పున ఎయిర్‌బస్‌ ఎ320 నియో విమానాలను కొనుగోలు చేశాయి. గత కొంతకాలంగా ప్రాట్‌ అండ్‌ విట్నీ (పీఅండ్‌డబ్ల్యు) ఇంజిన్ల వల్ల ఎ320 నియో విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో, వాటి సరఫరాను ఎయిర్‌బస్‌ మార్చి నుంచి నిలిపేసింది.
* రైల్వే రంగానికి చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్‌ఈ)లు ఇర్కాన్‌, ఐఆర్‌ఎఫ్‌సీలు వచ్చే రెండు నెలల్లో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.1500 కోట్లు సమకూరవచ్చు.
*జీఎస్‌టీ వార్షిక రిటర్నులు, ఆడిట్‌ దరఖాస్తులు ఎలా ఉండాలనే విషయమై ఈ నెల 21న జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో సమీక్షించి, ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేతల్ని నిరోధించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం వార్షిక ఐటీ రిటర్నుల్లో కొన్ని మార్పుచేర్పులు చేయవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
* డాలరు మారకపు విలువ ఈ వారం రూ.70 స్థాయికి చేరొచ్చని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలరు బలోపేతం అవుతుండడం; విదేశీ పెట్టుబడుల రాక తగ్గడం; ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉండడం వల్ల రూపాయిపై ఒత్తిడి పడొచ్చని వారు విశ్లేషిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com