నేటి వాణిజ్య వార్తలు -07/10

*నేటి నుంచి విజయవాడలో ఉబర్‌ ఈట్స్‌ సేవలను ప్రారంభించనుంది. మొబైల్‌ ఫోన్లలో ఉబర్‌ ఈట్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇష్టమైన ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేయొచ్చు. డ్రంకెన్‌ మంకీ, సెవన్‌డేస్‌, సదరన్‌ స్పైస్‌ వంటి రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే విశాఖపట్నంలో ఉబర్‌ ఈట్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
*బడ్జెట్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, మొబైల్‌ యాక్ససరీస్‌తో దేశీయంగా తన మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్న ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ షామీ. ముఖ్యంగా మొబైల్‌ ఫోన్ల విపణిలో దిగ్గజ కంపెనీలకు ముచ్చెమటలు పోయిస్తోంది. మంగళవారానికి భారత మార్కెట్‌లో షామీ అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎంఐ వార్షికోత్సవం పేరిట ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. జులై 10 నుంచి 12 వరకూ ఈ ఆఫర్లు కొనసాగుతాయి.
*కాలం చెల్లిన వాహనాలను వినియోగిస్తూ, వాయు కాలుష్యానికి కారణమవుతున్న వారిపై బీమా నియంత్ర‌ణ‌, ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏ) సరికొత్త నిబంధన విధించింది. ఇక నుంచి వాహనానికి బీమా పొందాలంటే పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌(పీయూసీ) ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేసింది.
*వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థల విలీనానికి టెలికం మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. కానీ ఈ విలీనం జరిగేందుకు కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది. వొడాఫోన్‌ఐడియా విలీనానికి నేడు డీవోటీ ఆమోదం తెలిపింది. కానీ అధికారికంగా ఆమోదం తెలిపేందుకు సంస్థకు కొన్ని షరతులు పెట్టినట్లు సంబంధిత శాఖకు చెందిన వర్గాలు వెల్లడించారు.
*వేదాంతాలో బ్రిటిష్‌ చమురు సంస్థ కెయిర్న్‌ ఎనర్జీకి ఉన్న షేర్లలో 40 శాతాన్ని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం విక్రయించింది. పాత లావాదేవీలకు సంబంధించి రూ.10,247 కోట్ల పన్ను వసూలులో భాగంగా ఈ చర్య తీసుకుంది.
*రాంకీ ఇన్‌ఫ్రా దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ గౌతమి ఇన్‌ఫ్రా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌లో దరఖాస్తు దాఖలు చేసింది. రాంకీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ రూ.5.57 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉందని, దివాలా పరిష్కార ప్రక్రియను చేపట్టడానికి మధ్యంతర దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్‌పీ)ని నియమించాలంటూ గౌతమి ఇన్‌ఫ్రా కంపెనీ తరఫున సహాయ మేనేజరు తోటకూరి జ్యోతి దరఖాస్తు చేశారు.
*విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే.. బ్యాంకులకు వెళ్లి వారు అడిగే పత్రాలు దాఖలు చేయడానికి కష్టాలు పడాలని, రోజుల తరబడి బ్యాంకు చుట్టూ తిరగాలని వెనుకడుగు వేస్తారు.
*ఉద్గార నిబంధనల ఉల్లంఘనపై బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ కఠిన చర్యలు ప్రకటించింది. సరైన కాలుష్య నియంత్రణ (పీయూసీ) ధ్రువీకరణ పత్రం లేకుంటే.. ఆ వాహనానికి బీమా చేయడం కుదరదని స్పష్టం చేసింది.
*హోండా కార్స్‌ ఇండియా తమ మోడళ్లపై రూ.35000 వరకు ధరలు పెంచనుంది. ఆగస్టు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ముడిపదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ వెల్లడించింది. వివిధ మోడళ్లపై ధరలను రూ.10,000- 35,000 శ్రేణిలో పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com