నేటి వాణిజ్య వార్తలు -07/12

*ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్యాలయాల ప్రాంతాల జాబితాలో దిల్లీకి చెందిన కన్నాట్‌ ప్లేస్‌కు తొమ్మిదో స్థానం లభించింది. ఏడాదిక్రితం పదో స్థానంలో ఉన్న ఈ ప్రాంతం ఈసారి ఒక స్థానాన్ని మెరుగుపర్చుకోవడం గమనార్హం.
*ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. 2017 జీడీపీ ఆధారంగా ఆయా దేశాల జాబితాను ప్రపంచబ్యాంక్‌ రూపొందించింది. 2.59 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.176.12 లక్షల కోట్ల)తో మనదేశం ఆరోస్థానంలో నిలిచింది.
*బలహీన అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేయలేకపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) బలమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఆ షేరు ఇంట్రాడేలో 5.47 శాతం దూసుకెళ్లి మార్కెట్‌ను నిలబెట్టింది.
*ప్రపంచ వ్యాప్తంగా పోలియో లేకుండా చేస్తే.. ఆ తర్వాత ప్రస్తుతం వినియోగిస్తున్న లైవ్‌ వ్యాక్సిన్‌ను వినియోగించడానికి వీలుండదు. ఇన్‌యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. కొద్ది కాలం క్రితం ఆఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పోలియో కేసులు బయట పడ్డాయి.
*ప్రపంచ వ్యాప్తంగా పోలియో లేకుండా చేస్తే.. ఆ తర్వాత ప్రస్తుతం వినియోగిస్తున్న లైవ్‌ వ్యాక్సిన్‌ను వినియోగించడానికి వీలుండదు. ఇన్‌యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది.
*ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్‌ సుబ్రమణియన్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ను ప్రశంసించారు. బ్యాంకుల్లో ఎన్‌పీఏల సంక్షోభాన్ని ముందుగానే గుర్తించి వాటి పరిష్కార దిశగా రాజన్‌ చర్యలు తీసుకున్నారని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఎదుట అరవింద్‌ వెల్లడించినట్లు సమాచారం.
*దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ తమ కొత్త కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ)కు ‘హ్యారియర్‌’గా నామకరణం చేసింది. బ్రిటన్‌ విభాగం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌తో జట్టు కట్టి ఈ కారును టాటా మోటార్స్‌ అభివృద్ధి చేసింది.
* అమెరికా- చైనాల మధ్య సుంకాల సమరం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. తాజాగా 20000 కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై 10 శాతం సుంకం విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అటు చైనా కూడా తన ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రతిసుంకం విధిస్తామని అమెరికాను హెచ్చరించింది.
* హైదరాబాద్‌ మేనేజిమెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఏ) అధ్యక్షుడిగా రవి కుమార్‌ పీసపాటి ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న రవి హెచ్‌ఎంఏలో జీవిత కాల సభ్యులు. వైస్‌ ప్రెసిడెంట్‌గా నగేశ్‌ విశ్వనాథం, కార్యదర్శిగా విజయ్‌ వేదాంతం, సంయుక్త కార్యదర్శిగా కె.వి.అచలపతి, కోశాధికారిగా శివధర్‌ సోమా ఎన్నికైనట్లు హెచ్‌ఎంఏ తెలిపింది.
*ఇంటర్నెట్‌ టెలిఫోనీ సేవలకు ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం మొబైల్‌ యాప్‌ ‘వింగ్స్‌’ను సంస్థ ఆవిష్కరించింది. ఈ యాప్‌ ద్వారా, దేశంలో ఏ టెలిఫోన్‌ నెంబరుకు అయినా కాల్‌ చేసుకోవచ్చు. ఏడాది రుసుముగా రూ.1,099 చెల్లించాలి. అనంతరం ఏ నెట్‌వర్క్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌/వైఫై ద్వారా అయినా, దేశంలోని టెలిఫోన్‌ నెంబర్లకు అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు. ఈనెల 25న ఈ సేవలు ప్రారంభమవుతాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com