నేడు యువరాజ్ జన్మదినం

టీమిండియా ప్రపంచకప్‌ల హీరో, సిక్సర్ల వీరుడు మంగళవారం 36వ వసంతంలోకి అడుపెట్టాడు. తన పోరాట పటిమతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన అతడికి తాజా, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడూ హాస్యగుళికలు జోడించి ట్వీట్లు చేసే వీరేంద్ర సెహ్వాగ్‌ ఈసారీ యువీకి అలాంటి శైలిలోనే హత్తుకునే రీతిలో అభినందనలు చెప్పాడు. అరుదుగా ట్వీట్లు చేసే సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, మహ్మద్‌ కైఫ్‌, సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌, మన్‌దీప్‌ సింగ్‌ తదితరులు యువీకి శుభాకాంక్షలు తెలిపారు.

* ఏ బీ సీ డీ ఈ ఎఫ్‌ జీ హెచ్‌ ఐ జే కే ఎల్‌ ఎం ఎన్‌ ఓ పీ క్యూ ఆర్‌ ఎస్‌ టీ డబ్ల్యూ ఎక్స్‌ వై జడ్‌, చాలావాటిల్లో వీటిని చూస్తాం. కానీ యువీ మాత్రం అత్యంత అరుదు. నా ప్రియ మిత్రుడు యువరాజ్‌సింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేందుకు నీ పోరాటం కొనసాగాలి. – వీరేంద్ర సెహ్వాగ్‌
* మేమెప్పుడూ పోరాడేలా పాఠాలు చెప్పిన యువీకి హ్యాపీ బర్త్‌డే. ఎన్నో వేదికలపై నీ అద్భుతమైన ప్రదర్శనలతో మమ్మల్ని గర్వపడేలా చేశావ్‌. దేవుడు నిన్ను చల్లగా చూడాలి.- సురేశ్‌ రైనా
* నా జీవిత గమనంలో విడదీయరాని భాగానికి హ్యాపీ బర్త్‌డే. యువీ అన్నింటా నువ్వు అత్యుత్తమంగా ఉండాలని తప్ప మరేదీ కోరుకోను. కొత్త సంవత్సరం నీకు అద్భుతంగా ఉండాలి. – మహ్మద్‌ కైఫ్‌
* హ్యాపీ బర్త్‌డే యువీ. నీ సంకల్ప బలం, పోరాటానికి వెన్నుచూపని ప్రవర్తనతో అందరికీ ప్రేరణగా నిలిచావు. నీకెప్పుడూ దేవుడి ఆశీర్వాదాలు ఉండుగాక. – వీవీఎస్‌ లక్ష్మణ్‌
* నా పెద్ద సోదరుడు యువరాజ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. – శిఖర్‌ ధావన్‌
* యువీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. – మహ్మద్‌ షమి
* యువీ పా హ్యాపీ బర్త్‌డే. వచ్చే ఏడాదంతా నీకు సంతోషం, విజయం కలగాలి. మళ్లీ కలుస్తా. టేక్‌ కేర్‌. – జస్ప్రీత్‌ బుమ్రా
* హ్యాపీ బర్త్‌డే యువీ పాజీ. నువ్వు చిరకాలం మమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉండాలి! నీతో కలిసి ఆడినందుకు, నేర్చుకున్నందుకు నేనెంతో లక్కీ. దేవుడు నిన్నెప్పుడూ చల్లగా చూడాలి. – మన్‌దీప్‌ సింగ్‌
* యువరాజ్‌సింగ్‌.. హ్యాపీ బర్త్‌డే యంగ్‌ మ్యాన్‌.. – సౌరవ్‌ గంగూలీ

యోయో ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమైన యువీ ఆ తర్వాత బెంగళూరులోని ఎన్‌సీఏలో కఠోరంగా శ్రమించి ఈ మధ్యనే పాసయ్యాడు. ఈ సందర్భంగా ‘నేను వైఫల్యాలను చూసి భయపడను. ఎత్తుపల్లాలెన్నో చూశా. ఓటములను చవిచూశా. అవే విజయానికి మూలస్తంభాలు. జీవితంలోనూ వ్యక్తిగా విజయవంతం అవ్వాలంటే ఓటములను అనుభవించాల్సిందే. అది మనల్ని మరింత శక్తిమంతులను చేస్తుంది. తర్వాతి స్థాయికి తీసుకెళ్తుంది’ అని అన్న సంగతి తెలిసిందే. కెరీర్‌లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడిన యువీ ఆయా ఫార్మాట్లలో వరుసగా 1900, 8701, 1177 పరుగులు చేశాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com