నేత్రాలు ఇలా జాగ్రత్త

కళ్లకు కలిగే నిరంతర శ్రమను మనం అంచనా వేయలేం… నేటి ఆధునిక జీవితంలో మరీ ఎక్కువగా చదవడం, రాయడం, టీవీ చూడడం, కంప్యూటర్పై పనిచేయడం… ఇలా కంటితో ముడిపడి ఉండే పనులను మనం చాలా చేస్తున్నాం. ఇంత చేస్తున్నా కళ్లకోసం ఏదైనా జాగ్రత్త తీసుకుందామన్న ఆలోచన కలగదు. ప్రస్తుత తరంలో నానాటికీ పెరుగుతున్న టెక్నాలాజీ మోజులో పడి మనం కంటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరచిపోతున్నాం. దీంతో పాటు చిన్నారులపై అధిక ప్రభావం చూపతున్న ఈ కంటి సమస్యల పట్ల శ్రద్ధ పెట్టక పోవడం వల్ల పసి వయస్సులోనే కళ్లద్దాలతో పయనం సాగిస్తున్నాం. అందువల్ల కంటి అందం, ఆరోగ్యం పది కాలాలు పదిలంగా ఉండాలంటే తప్పక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
సాధారణంగా మనం చదివేటప్పుడు కళ్లతోనే ఎక్కువ పని ఉంటుంది. చదివేటప్పుడు కళ్లకు ఎక్కువ శ్రమ కల్సిస్తుంటాం. సరిపడా వెలుతురు లేనప్పటికీ చదివే ప్రయత్నం చేస్తుంటాం. ఇది కళ్లకు మంచిది కాదు. కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే చదివేటప్పుడు కళ్లపై భారం పడకుండా ఉంటుంది.
* పుస్తకం కంటికి 30సెంటీమీటర్ల దూరం ఉంచి ఉండాలి.
* నిటారుగా కూర్చొని చదవడం మంచిది.
* పడుకుని చదవడం వల్ల కళ్లపై భారం పడుతుంది. కూర్చుని చదవడమే శ్రేయస్కరం.
* సరిపడా వెలుతురులో మాత్రమే చదవాలి.
* కదులుతున్న కుర్చీలో, ఊయలలో కూర్చుని చదివితే కళ్లకు శ్రమ కలుగుతుంది. దీన్ని మానుకోవడం మంచిది.
**టీవీ చూస్తున్నప్పుడు…
* గంటకు మించి విడవకుండా టీవీ చూడడం మంచిది కాదు.
* టీవీ చూస్తున్నప్పుడు శరీరాన్ని పలు రకాల భంగిమల్లో ఉంచడం చాలా మంచిది.
* వెన్నెముకకు ఆసరా ఇచ్చే కుర్చీలో కూర్చుని టీవీ చూడడం కంటికి మేలు చేస్తుంది.
* టీవీకి కనీసం మూడు మీటర్ల దూరంలో కూర్చోవాలి.
* చీకటిగా ఉన్న గదిలో కూర్చుని టీవీ చూడటం కంటికి శ్రేయస్కరం కాదు.
* టీవీకి వెనుకవైపు ఎత్తుగా లైట్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.
***కంప్యూటర్ పై పని చేస్తున్నప్పుడు…
* కంప్యూటర్ తెర మధ్యభాగానికి కాస్తపైన మీ చూపు ఉంటే మంచిది.
* రెప్ప వేయకుండా పని చేయడం మంచిది కాదు. L కంప్యూటర్పై పనిచేస్తున్నప్పుడు తరచుగా రెప్ప వేయాలి.
* నిరంతరం పని చేయకుండా మధ్యలో విరామం తీసుకోవడం ఉత్తమం.
* కాళ్లు నేలపై ఆనించి వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి.
* కీబోర్డు, మౌస్లను సమానస్థాయిలో ఉంచాలి. ఇవి శరీరానికి దూరంగా ఉండాలి. టైప్ చేస్తున్నప్పుడు ముంచేతి భాగం కీ బోర్డుపై ఉంచకూడదు.
* మరింత కాంతివంతంగా కనిపించేలా మానిటర్ లైటింగ్ను ఏర్పాటు చేసుకోవాలి.
* మానిటర్పై యాంటిగ్లేర్ స్క్రీన్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.
***డ్రైవింగ్ చేస్తున్నప్పుడు…
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్లజోడు వాడాలి. సూర్యుడి నుంచి వచ్చే యూవీ(ఆల్ట్రా వయొలెట్) కిరణాల తాకిడితో కళ్లకు హానికలగకుండా దుమ్ము, ధూళీ పడకుండా రక్షణగా కళ్లజోడు ఉపయోగపడుతుంది.
* యూవీ కిరణాల నుంచి కాపాడలేని ముదురు రంగులో ఉన్న కళ్లద్దాలు కంటికి రక్షణనివ్వలేవు. ఇలాంటికి మరింత ఎక్కువగా యూవీ కిరణాలు కంటికి చేరేలా చేసి హాని చేస్తాయి.
***కంటి వ్యాయామం తప్పని సరి…
* తలను బాగా విశ్రాంతిగా ఉంచి చూపును కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పూర్తి చివరలకు తిప్పాలి. కనుగుడ్లు రెండు పక్కలకు తిప్పాలి. తలను ఏ మాత్రం కదల్చకుండానే వీలైనంత పైకి, కిందకు చూడాలి.
* తలను విశ్రాంతి దశలో ఉంచి చూపును, క్లాక్వైజ్, యాంటీక్లాక్వైజ్గా తిప్పాలి. ఇలా మూడుసార్లు చేయాలి. తలను నిటారుగా ఉంచి చూపును పైకి తిప్పుతూ పూర్తిగా కుడివైపునకు చూడాలి. ఆ తర్వాత చూపును కిందకు దింపి ఎడమ పక్కకు చూడాలి. ఇలా మూడుసార్లు చేయాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com