నేను పార్టీ పెడుతున్నా

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన రాజకీయ ఐకాస.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయనుంది. తుర్కయాంజల్‌లో జరిగిన ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో కొత్త పార్టీని ఏర్పాటును ఐకాస ఛైర్మన్‌ కోదండరాం ప్రకటించారు. రాజకీయ పార్టీ పెట్టాలని వస్తున్న డిమాండ్‌ను సమ్మతిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరాం తెలిపారు. గ్రామాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు బతకలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల కోసం పెద్ద పోరాటమే చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టాలని ప్రజలంతా కోరుతున్నారని, అది లేకపోతే తమ పోరాటానికి ఫలితం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని, రాజకీయాల్లో మార్పు కోసమే పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. త్వరలో పార్టీ పేరును ప్రకటిస్తామని చెప్పారు. డబ్బున్నవారే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆరోపించారు. ప్రజల సహకారంతోనే పార్టీ నడపాలి అని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీతో పాటు ఐకాస కూడా నడుస్తుందని కోదండరాం స్పష్టంచేశారు.

kodandaramnewpartytelanganatnilivetni2018newstelugunriglobalworldabroad

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com