నేరేడు పండు…ఆరోగ్యం మెండు.

నేరేడు పండు పేరు తెలియని వారుండరు. కానీ దీన్ని తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మాత్రం చాలామందికి తెలియదనే చెప్పాలి. నేరేడు పండ్లు మనకు విరివిగా లభిస్తాయి. వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటివల్ల మన శరీరానికి కావలసిన అన్నిరకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పలు అనారోగ్య సమస్యలూ నయమవుతాయి.నేరేడు పండ్లలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, సోడియం, మెగ్నీషియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రోటీన్లు, కెరోటిన్లు లభిస్తాయి. మధుమేహం ఉన్నవారు నేరేడు పండ్లు తింటే చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. వీటిలోని ఔషధగుణాలు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతాయి. రక్తశుద్ధి జరుగుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ పండ్లను ఎంత తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయిన అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఐరన్‌ లభిస్తుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండురసం కలిపి తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం, నోరు దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడుపండ్లు చక్కటి పరిష్కారం. వీటిలో ఉండే పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసంలో బ్యాక్టీరియాలను దూరం చేసే గుణం ఉంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నేరేడు పండ్లు తినడం వల్ల విటమిన్‌ సి తో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నేరేడు ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి అందులో కొంచెం ఉప్పు కలిపి, తోముకుంటే పళ్లు గట్టిపడుతాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పరగడుపున తీసుకోకూడదు. తప్పనిసరిగా ఏదైనా ఆహారం తిన్న తర్వాతనే వీటిని తీసుకోవాలి. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు వైద్యుల సలహా మేరకు వీటిని తినవచ్చు. కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది చిగుళ్ల వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడు, ఆకుల రసంతో నోరు పుక్కిలిస్తే మంచిది. వీటి రసంలో తేనె కలిపి తీసుకుంటే అరికాళ్లు, అరిచేతుల మంటలు, కాళ్ల మంటల నుంచి ఉపశమనం పొందవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com