నోబడీ

విభిన్న నటనతో బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు మనోజ్‌ బాజ్‌పేయి. ఇటీవల మృతి చెందిన బాలీవుడ్‌ నటుడు ఓంపురిని గుర్తుచేసుకున్న ఆయన.. ఒకవేళ ఓంపురి బయోపిక్‌ని తీస్తే తనకంటే బాగా ఎవరూ నటించలేరంటున్నాడు. ‘‘ఓంపురి చిన్న వూరి నుంచి బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. నటనపై ఆసక్తి ఉన్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన నటించిన ‘ఆక్రోష్‌’ చిత్రం చూశాక సినిమాల్లోకి రావాలనుకున్నా. ఆయన మార్గంలోనే విభిన్న పాత్రల్లో నటిస్తున్నా. ఓంపురి గురించి చాలా బాగా తెలుసు. కాబట్టీ ఆయన బయోపిక్‌లో నాకంటే బాగా ఎవరూ నటించలేరని అనుకుంటున్నా. ఓంపురిని గుర్తు తెచ్చుకున్న వాళ్లు ఎవరూ అప్‌సెట్‌ అవ్వరు. పైగా నవ్వుకుండ ఉండలేరు. ఎందుకంటే ఆయనది అంత సరదా క్యారెక్టర్‌. అందుకే ఆయన్ని చాలా సంతోషంతో గుర్తుపెట్టుకుంటా’’ అని అంటున్నాడు మనోజ్‌ బాజ్‌పేయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com