నోరు కట్టేసుకోను

‘‘నాజూకుగా కనిపించాలనే సాకుతో ఎప్పుడూ నోరు కట్టుకోలేదు. అందంగా కనిపించాలని ట్రెండ్‌ వెనకాల పరుగెత్తలేదు. ఏం చేసినా ఒక లెక్క ప్రకారం చేయాలనేది నా సిద్ధాంతం. అందుకు తగ్గట్టే నా నియమాలు ఉంటాయి’’ అంటోంది తమన్నా. త్వరలోనే ‘నా నువ్వే’తో సందడి చేయబోతున్న ఆమె ‘సైరా’ కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. ‘నా నువ్వే’లో ట్యాంగో డ్యాన్స్‌తో అలరించనున్న ఆమె, ‘సైరా’లోనూ కొత్త రకమైన డ్యాన్సులు ప్రదర్శించబోతోందని సమాచారం. అందుకోసం ప్రత్యేకంగా తర్ఫీదు పొందుతున్నట్టు తెలుస్తోంది. ప్రతి సినిమాకీ ఏదో ఒక కొత్త ప్రయత్నం చేయడంపై ఆసక్తి చూపుతుంటుంది తమన్నా. ‘‘ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే ఏ పనైనా ఎందుకు చేయడం? అని కొంతకాలంగా నా మనసు ప్రశ్నిస్తోంది. అందుకు అనుగుణంగానే ఈమధ్య కథల్ని ఎంపిక చేసుకొంటున్నా. కథలే కాదు… ఫ్యాషన్‌ విషయంలోనూ ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నా. అయితే అన్నిటికంటే నా సౌకర్యమే కీలకం. చేసే సినిమాలైనా, వేసుకొనే దుస్తులైన అనువుగా, సౌకర్యంగా ఉంటేనే ఆత్మ విశ్వాసంతో కనిపిస్తాను కదా’’ అని చెప్పింది తమన్నా.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com