నో ఫర్ ఇన్ఫోసిస్

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి చుక్కెదురైంది. పశ్చిమ్‌బంగాలో ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌) ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వాణిజ్యశాఖ కార్యదర్శి రీటా టియోటియా అధ్యక్షతన ఆగస్టు 12న జరిగిన బోర్డు ఆఫ్‌ అప్రూవల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం సందర్భంగా ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఇన్ఫోసిస్‌ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. పశ్చిమ్‌బంగాలోని దక్షిణ 24 పరగణాల్లో 20.14 హెక్టార్లలో ఐటీసెజ్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇన్ఫోసిస్‌ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కాగా మరో నాలుగు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న దేవభూమి రియాల్టర్స్‌, ఫోనిక్స్‌ లివింగ్‌ స్పేసెస్‌, ఫోనిక్స్‌ ఎంబసీ టెక్‌ జోన్‌లకు పచ్చజెండా వూపింది. వీటితో పాటు చింద్వారా ప్లస్‌ డెవలపర్స్‌కు అనుమతి లభించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com