న్యాయం గర్జించింది

కృష్ణజింకలను వేటాడిన కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ న్యాయస్థానం సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. 1998 అక్టోబర్‌లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్‌ కృష్ణజింకలను వేటాడారు. దీనిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 9, 51 సెక్షన్ల కింద అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సుమారు 20 ఏళ్ల తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గరిష్ఠంగా ఆరేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉండగా, ఐదేళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సైఫ్‌ అలీఖాన్‌, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌ను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.1998లో సల్మాన్‌ ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ చిత్రీకరణ నిమిత్తం జోధ్‌పూర్‌ వెళ్లారు. ఆయనతో పాటు సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలి బింద్రే, నీలమ్‌, టబు కూడా ఉన్నారు. ఆ సమయంలో కంకణి గ్రామంలో సంచరిస్తున్న రెండు కృష్ణ జింకలపై సల్మాన్‌ కాల్పులు జరిపారు. ఆ కాల్పుల శబ్దం విన్న గ్రామస్థులు ఉలిక్కిపడి అక్కడికి రాగా కృష్ణ జింకల చనిపోయి ఉండటం గమనించారు. గ్రామస్థుల్లో కొందరు సల్మాన్‌ వెంబడించగా ఆయన పరారయ్యారు. బిష్నోయ్‌ వర్గానికి చెందిన గ్రామస్థులు కృష్ణజింకను దైవంగా భావిస్తారు. అలాంటిది తమ కుల దైవాన్నే చంపాలనుకున్నాడన్న కోపంతో సల్మాన్‌పై మిగతా నటీనటులపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలా ఈ కేసు ఇరవై ఏళ్ల పాటు కొనసాగి, ఎన్నో విచారణల అనంతరం సల్మాన్‌ను దోషి తేలుస్తూ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com