న్యాయవాదులకు సామాజిక స్పృహ అవసరం-జస్టిస్ రమణ

ఏపీలో ట్రిబ్యునల్స్, హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఆదివారం బెజవాడ బార్ అసోసియేషన్ 111వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్‌ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ న్యాయవాదులకు సామాజిక స్పృహ అవసరమని అన్నారు. కేసుల విషయంలో గ్రామీణీలకు న్యాయవాదులు అండగా ఉండాలని, తెలుగులో న్యాయపరిపాలన జరగాలని అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ మాట్లాడుతూ కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరగాలని అన్నారు. సామాజిక వివాదాలు తలెత్తినప్పుడు బార్ అసోసియేషన్ పాత్ర కీలకమని, జడ్జిలు సమాజ నిర్మాతలుగా ఉండాలని జస్టిస్‌ రంజన్ అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com