పగలు ఆధ్యాత్మికం. రాత్రిళ్ళు అంగాత్మకం. గజల్‌కు నో బెయిల్.

ప్రముఖ గాయకుడు ‘గజల్‌’ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. వెంకటరమణ కాలనీలో ఆలయవాణి వెబ్‌ రేడియోలో జాకీగా పనిచేస్తున్న ఓ యువతి.. తనను గజల్‌ శ్రీనివాస్‌ వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని శ్రీనివాస్‌పై కేసులు నమోదు చేశారు. కోర్టుకు తీసుకెళ్లేముందు ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. బెయిల్‌ కోసం శ్రీనివాస్‌ చేసుకున్న దరఖాస్తును తిరస్కరించిన నాంపల్లి కోర్టు ఈనెల 12 వరకూ జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బాధితురాలు డిసెంబరు 29, 2017న ఫిర్యాదు చేసినా, పక్కా సాక్ష్యాధారాలు లభించే వరకూ వేచిచూసి గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశామని పంజాగుట్ట ఏసీపీ విజయకుమార్‌ తెలిపారు. బాధితురాలిని బలవంతపెట్టిన పార్వతి అనే మహిళపైనా కేసు నమోదు చేశామనీ, ఆమెను త్వరలో అరెస్ట్‌ చేస్తామన్నారు. ‘సేవ్‌ టెంపుల్‌’ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న గజల్‌ శ్రీనివాస్‌… తనను ఉద్యోగంలో చేరిన కొద్దిరోజుల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులకు తెలిపింది. ‘‘వెంకటరమణ కాలనీలోని సేవ్‌ టెంపుల్‌ సంస్థలో ఆలయవాణి పేరున వెబ్‌ రేడియో కార్యాలయముంది. గజల్‌ శ్రీనివాస్‌కు అక్కడ ప్రత్యేక గది ఉంది. ఆరు నెలల నుంచి వేధింపుల పర్వం కొనసాగుతోంది. సాయంత్రం 6.30 గంటలకు విధులు ముగిసినా… ఇంకా పని ఉందని శ్రీనివాస్‌ చెప్పేవాడు. రాత్రి పది తర్వాత ఆయన గదిలోకి పార్వతి వెళ్లేది. కొద్దిసేపటికి నన్ను పిలిచేవారు. అప్పటికే శ్రీనివాస్‌ పడుకుని ఉండేవాడు. ఆయనకు మర్దన చేయాలని పార్వతి చెప్పేది. ఒక్కోసారి నన్ను గదిలోకి పిలిచినప్పుడు గజల్‌ శ్రీనివాస్‌ ఒంటిపై తుండుగుడ్డ మాత్రమే ఉండేది. కొద్దిరోజుల తర్వాత పార్వతి పిలిచి గజల్‌ శ్రీనివాస్‌కు చాలామంది ప్రజాప్రతినిధులు తెలుసని… ఆయన లైంగిక కోర్కెలు తీరిస్తే ఎక్కడైనా మంచి ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పింది. నేను ఒప్పుకోలేదు. దీంతో అప్పట్నుంచి తీవ్రంగా వేధించడం మొదలు పెట్టారు. పది రోజుల నుంచి లైంగిక కోర్కెలు తీర్చాలంటూ మరింత ఒత్తిడి చేయడంతో భయంవేసి పోలీసులను ఆశ్రయించా. గజల్‌ శ్రీనివాస్‌ పచ్చి మోసగాడు. అమ్మాయిలందరినీ అదే దృష్టితో చూస్తాడు. చాలామంది యువతులు, మహిళలకు ఉద్యోగాలిప్పిసానని, గాయకులుగా అవకాశాలిస్తానని వంచించాడు. లైంగిక కోరికలను తీర్చనందుకు నాపై కక్ష తీర్చుకుంటానన్నాడు. నేను ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే పార్వతి ప్రలోభ పెట్టింది. నాకు ఇష్టం లేకపోయినా శ్రీనివాస్‌ గదిలోకి రావాలని బలవంతపెట్టేది. ఆయన చెప్పినట్టు వినకపోతే… ఆలయవాణిలో విధులు నిర్వర్తించిన కాలానికి ధ్రువపత్రాలు ఇవ్వమని బెదిరించింది’’ అని బాధితురాలు వాపోయింది. మర్దన చేస్తానంటూ తనే ఒత్తిడి చేసింది- గజల్‌ శ్రీనివాస్‌నాకు దెబ్బ తగిలిన భుజానికి ఫిజియోథెరపీ చేయాల్సి ఉందని తెలుసుకున్న బాధితురాలు… ‘సార్‌, నేను మర్దన చేస్తాను’ అంటూ వచ్చింది. భుజానికి మందు రాసింది. నేను ఆత్మసాక్షిగా చెబుతున్నా. మహిళలను గౌరవిస్తాను. నాపై ఫిర్యాదు చేసిన అమ్మాయిని నా బిడ్డలా చూసుకున్నాను. ఆమె ఒక ఆధ్యాత్మిక సంస్థలో పెరిగిందని తెలుసుకునే రేడియో జాకీగా ఉద్యోగం ఇచ్చాను. ఆమెను వేధించాననడం అవాస్తవం. ఆలయవాణి రేడియో కార్యాలయం నుంచి వీడియోలు తీసుకెళ్లిందని నాకు కొందరు చెప్పారు. ఆ వీడియోల్లో ఏముందో తెలీదు. ఆ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించలేదు. ఆలయవాణి వెబ్‌ రేడియోలో విధులు నిర్వహిస్తున్న పార్వతితో గజల్‌ శ్రీనివాస్‌కు వివాహేతర సంబంధాలున్నట్లు తమకు సాక్ష్యాలు లభించాయని ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపారు. ఆ మహిళ బాధితురాలిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆధారాలున్నాయన్నారు. బాధితురాలు సత్యసాయిబాబా భక్తురాలని, వేదాధ్యయనంలో పట్టా పొందిందని, గతేడాది జూన్‌ నుంచి ఆలయవాణి వెబ్‌రేడియో బాధ్యురాలిగా విధులు నిర్వహిస్తోందని వివరించారు. బాధితురాలికి నెలకు రూ.13 వేల జీతం ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారన్నారు. పార్వతికి గజల్‌ శ్రీనివాసే పెళ్లి చేయించాడని, దీర్ఘకాలంగా ఆమె అతని వద్దే పనిచేస్తోందన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com